Surah An-NisaBegins here at 4:24
-
4:24
۞ وَٱلْمُحْصَنَـٰتُ مِنَ ٱلنِّسَآءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَـٰنُكُمْ ۖ كِتَـٰبَ ٱللَّهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَآءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا۟ بِأَمْوَٰلِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَـٰفِحِينَ ۚ فَمَا ٱسْتَمْتَعْتُم بِهِۦ مِنْهُنَّ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَٰضَيْتُم بِهِۦ مِنۢ بَعْدِ ٱلْفَرِيضَةِ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
Walmuḥṣanaatu minan Nisaaaʹi ʹillaa maa- malakat ʹaymaanukum. Kitaabal laahi ʻalaykum. Wa-ʹuḥilla lakum maa waraaaʹa ẓaalikum ʹañ tabtag̣oo biʹamwaalikum muḥṣineena g̣ayra musaafiḥeen. Famas tamtaʻtum̃ bihee minhunna faʹaatoohunna ʹujoorahunna fareeḍah. Wa-laa junaaḥa ʻalaykum fimaa taraaḍaytum̃ bihee mim baʻdil fareeḍati, ʹinnal laaha kaana ʻAleeman Ḥakeemaa.
మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
-
4:25
وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ ٱلْمُحْصَنَـٰتِ ٱلْمُؤْمِنَـٰتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَـٰنُكُم مِّن فَتَيَـٰتِكُمُ ٱلْمُؤْمِنَـٰتِ ۚ وَٱللَّهُ أَعْلَمُ بِإِيمَـٰنِكُم ۚ بَعْضُكُم مِّنۢ بَعْضٍ ۚ فَٱنكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَءَاتُوهُنَّ أُجُورَهُنَّ بِٱلْمَعْرُوفِ مُحْصَنَـٰتٍ غَيْرَ مُسَـٰفِحَـٰتٍ وَلَا مُتَّخِذَٰتِ أَخْدَانٍ ۚ فَإِذَآ أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَـٰحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى ٱلْمُحْصَنَـٰتِ مِنَ ٱلْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِىَ ٱلْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا۟ خَيْرٌ لَّكُمْ ۗ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ
Wa-mal lam yastaṭiʻ miñkum ṭawlan ʹañy yañkiḥal Muḥṣanaatil Muʹminaati famim maa malakat ʹaymaanukum miñ fatayaatikumul Muʹminaat: wallaahu ʹaʻlamu biʹeemaanikum Baʻḍukum mim baʻḍ: fañkiḥoohunna biʹiẓni ʹahlihinna wa-ʹaatoohunna ʹujoorahunna bilmaʻroofi muḥṣanaatin g̣ayra musaafiḥaatiñw walaa muttakhiẓaati ʹakhdaan. Faʹiẓaaa ʹuḥṣinna faʹin ʹatayna bifaaḥishatiñ faʻalayhinna niṣfu maa- ʻalal muḥṣanaati minal ʻaẓaab. Ẓaalika liman khashiyal ʻanata miñkum. Wa-ʹañ taṣbiroo khayrul lakum: wallaahu G̣afoorur Raḥeem.
మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు[1]. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి[2]. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత.
-
4:26
يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ ٱلَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ
Yureedul laahu liyubayyina lakum wa-yahdiyakum sunanal laẓeena miñ q̣ablikum wa-yatooba ʻalaykum: wallaahu ʻAleemun Ḥakeem.
అల్లాహ్ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం వైపునకు, మీకు మార్గదర్శకత్వం చేయాలనీ మరియు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలనీ కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
-
4:27
وَٱللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ ٱلَّذِينَ يَتَّبِعُونَ ٱلشَّهَوَٰتِ أَن تَمِيلُوا۟ مَيْلًا عَظِيمًا
Wallaahu yureedu ʹañy yatooba ʻalaykum; Wayureedul laẓeena yattabiʻoonash shahawaati ʹañ tameeloo maylan ʻaz̤̣eemaa.
మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించ గోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు.
-
4:28
يُرِيدُ ٱللَّهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ ٱلْإِنسَـٰنُ ضَعِيفًا
Yureedul laahu ʹañy yukhaffifa ʻañkum; wa-khuliq̣al ʹiñsaanu ḍaʻeefaa.
అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు.
-
4:29
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَأْكُلُوٓا۟ أَمْوَٰلَكُم بَيْنَكُم بِٱلْبَـٰطِلِ إِلَّآ أَن تَكُونَ تِجَـٰرَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوٓا۟ أَنفُسَكُمْ ۚ إِنَّ ٱللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
Yaaaʹayyuhal laẓeena ʹaamanoo laa- taʹkulooo ʹamwaalakum̃ baynakum̃ bilbaaṭili ʹillaaa ʹañ takoona tijaaratan ʻañ taraaḍim miñkum: walaa taq̣tulooo ʹanfusakum: ʹinnal laaha kaana bikum Raḥeemaa!
ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప[1]. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి[2]. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత.
-
4:30
وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَٰنًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرًا
Wa-mañy yafʻal ẓaalika ʻudwaanañw wa-Z̤̣ulmañ fasawfa nuṣleehi Naaraa: wa-kaana ẓaalika ʻalal laahi yaseeraa.
మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలా చేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్ కు ఎంతో సులభం.
-
4:31
إِن تَجْتَنِبُوا۟ كَبَآئِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّـَٔاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
ʹIñ tajtaniboo kabaaaʹira maa- tunhawna ʻanhu nukaffir ʻañkum sayyiʹaatikum wa-nudkhilkum Mudkhalañ kareemaa.
ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము[1].
-
4:32
وَلَا تَتَمَنَّوْا۟ مَا فَضَّلَ ٱللَّهُ بِهِۦ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا ٱكْتَسَبُوا۟ ۖ وَلِلنِّسَآءِ نَصِيبٌ مِّمَّا ٱكْتَسَبْنَ ۚ وَسْـَٔلُوا۟ ٱللَّهَ مِن فَضْلِهِۦٓ ۗ إِنَّ ٱللَّهَ كَانَ بِكُلِّ شَىْءٍ عَلِيمًا
Wa-laa tatamannaw maa- faḍḍalal laahu bihee baʻḍakum ʻalaa baʻḍ. Lirrijaali naṣeebum mimmak tasaboo, wa-lin-Nisaaaʹi naṣeebum mimmak tasabn. Wasʹalul laaha miñ faḍlih. ʹInnal laaha kaana bikulli shayʹin ʻAleemaa.
మరియు అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది.
-
4:33
وَلِكُلٍّ جَعَلْنَا مَوَٰلِىَ مِمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ ۚ وَٱلَّذِينَ عَقَدَتْ أَيْمَـٰنُكُمْ فَـَٔاتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدًا
Wa-likulliñ jaʻalnaa mawaaliya mimmaa tarakal waalidaani wal-ʹaq̣raboon. Wallaẓeena ʻaq̣adat ʹaymaanukum faʹaatoohum naṣeebahum. ʹInnal laaha kaana ʻalaa kulli shayʹiñ Shaheedaa.
మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించి ఉన్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలను చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చి వేయండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు[1].
-
4:34
ٱلرِّجَالُ قَوَّٰمُونَ عَلَى ٱلنِّسَآءِ بِمَا فَضَّلَ ٱللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَآ أَنفَقُوا۟ مِنْ أَمْوَٰلِهِمْ ۚ فَٱلصَّـٰلِحَـٰتُ قَـٰنِتَـٰتٌ حَـٰفِظَـٰتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ ٱللَّهُ ۚ وَٱلَّـٰتِى تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَٱهْجُرُوهُنَّ فِى ٱلْمَضَاجِعِ وَٱضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا۟ عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا
ʹArrijaalu q̣awwaamoona ʻalan Nisaaaʹi bimaa faḍ-ḍalal laahu baʻḍahum ʻalaa baʻḍiñw wabimaaa ʹañfaq̣oo min ʹamwaalihim, Faṣ-Ṣaaliḥaatu q̣aanitaatun ḥaafi-Z̤̣atul lil-g̣aybi bimaa ḥafi-Z̤̣al laah. Wallaatee takhaafoona nushoozahunna faʻi-Z̤̣oohunna wahjuroohunna fil maḍaajiʻi waḍriboohunn. Faʹin ʹaṭaʻnakum falaa tabg̣oo ʻalayhinna sabeelaa: ʹinnal laaha kaana ʻAliyyañ Kabeeraa.
పురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్)[1], ఎందుకంటే అల్లాహ్ కొందరికి మరికొందరిపై ఘనత నిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చు చేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి[2]. కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, మహనీయుడు[3].
-
4:35
وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَٱبْعَثُوا۟ حَكَمًا مِّنْ أَهْلِهِۦ وَحَكَمًا مِّنْ أَهْلِهَآ إِن يُرِيدَآ إِصْلَـٰحًا يُوَفِّقِ ٱللَّهُ بَيْنَهُمَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا
Wa-ʹin khiftum shiq̣aaq̣a baynihimaa fabʻas̤oo ḥakamam min ʹahlihee waḥakamam min ʹahlihaa. ʹIñy yureedaaa ʹiṣlaaḥ añyyuwaffiq̣il laahu baynahumaa: ʹinnal laaha kaana ʻAleeman Khabeeraa.
మరియు వారిద్దరి (భార్యాభర్తల) మధ్య సంబంధాలు తెగి పోతాయనే భయం మీకు కలిగితే అతని (భర్త) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె (భార్య) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకో గోరితే అల్లాహ్ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.
-
4:36
۞ وَٱعْبُدُوا۟ ٱللَّهَ وَلَا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَـٰنًا وَبِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينِ وَٱلْجَارِ ذِى ٱلْقُرْبَىٰ وَٱلْجَارِ ٱلْجُنُبِ وَٱلصَّاحِبِ بِٱلْجَنۢبِ وَٱبْنِ ٱلسَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَـٰنُكُمْ ۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا
Waʻbudul laaha wa-laa tushrikoo bihee shayʹañw wabilwaalidayni ʹiḥsaanañw Wabiẓil q̣urbaa wal-yataamaa wal-masaakeeni wal-jaari ẓil q̣urbaa wal-jaaril junubi waṣ-ṣaaḥibi biljambi wabnis sabeeli wa-maa malakat ʹaymaanukum: ʹinnal laaha laa- yuḥibbu mañ kaana mukhtaalañ fakhooraa;
మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో[1], ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి[2]. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు[3].
-
4:37
ٱلَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ ٱلنَّاسَ بِٱلْبُخْلِ وَيَكْتُمُونَ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ ۗ وَأَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ عَذَابًا مُّهِينًا
ʹAllaẓeena yabkhaloona wa-yaʹmuroonan naasa bilbukhli wa-yaktumoona maaa ʹaataahumul laahu miñ faḍlih; wa-ʹaʻtadnaa lilkaafireena ʻaẓaabam muheenaa;
ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచి పెట్టే వారినీ (అల్లాహ్ ప్రేమించడు)[1]. మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.
-
4:38
وَٱلَّذِينَ يُنفِقُونَ أَمْوَٰلَهُمْ رِئَآءَ ٱلنَّاسِ وَلَا يُؤْمِنُونَ بِٱللَّهِ وَلَا بِٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ ۗ وَمَن يَكُنِ ٱلشَّيْطَـٰنُ لَهُۥ قَرِينًا فَسَآءَ قَرِينًا
Wallaẓeena yuñfiq̣oona ʹamwaalahum riʹaaaʹan naasi wa-laa yuʹminoona billaahi wa-laa bil-Yawmil ʹAakhir. Wa-mañy yakunish shayṭaanu lahoo q̣areenañ fasaaaʹa q̣areenaa.
మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చుపెడతారో మరియు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో! మరియు ఎవడైతే షైతాన్ ను తన స్నేహితునిగా (ఖరీనున్ గా) చేసుకుంటాడో![1] అతడు ఎంత నీచమైన స్నేహితుడు.
-
4:39
وَمَاذَا عَلَيْهِمْ لَوْ ءَامَنُوا۟ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَنفَقُوا۟ مِمَّا رَزَقَهُمُ ٱللَّهُ ۚ وَكَانَ ٱللَّهُ بِهِمْ عَلِيمًا
Wa-maaẓaa ʻalayhim law ʹaamanoo billaahi wal-Yawmil ʹAakhiri wa-ʹañfaq̣oo mimmaa razaq̣ahumul laah? Wa- kaanallaahu bihim ʻAleemaa.
మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికే మయ్యేది? మరియు అల్లాహ్ కు, వారిని గురించి బాగా తెలుసు.
-
4:40
إِنَّ ٱللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَـٰعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا
ʹInnal laaha laa- yaz̤̣limu mis̤q̣aala z̤̣arrah: wa-ʹiñ taku ḥaṣanatañy yuḍaaʻifhaa wa-yuʻti mil ladunhu ʹajran ʻaz̤̣eemaa.
నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు[1]. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.
-
4:41
فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍۭ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَـٰٓؤُلَآءِ شَهِيدًا
Fakayfa ʹiẓaa jiʹnaa miñ kulli ʹummatim bishaheediñw wa jiʹnaabika ʻalaa haaaʹulaaaʹi Shaheedaa?
మేము (ప్రతిఫల దినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది?
-
4:42
يَوْمَئِذٍ يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَعَصَوُا۟ ٱلرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ ٱلْأَرْضُ وَلَا يَكْتُمُونَ ٱللَّهَ حَدِيثًا
Yawmaʹiẓiñy yawad dullaẓeena kafaroo wa-ʻaṣawur Rasoola law tusawwaa bihimul ʹarḍ: wa-laa yaktumoonal laaha ḥadees̤aa!
ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు! కానీ, వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్నీ దాచలేరు[1].
-
4:43
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟ ۚ وَإِن كُنتُم مَّرْضَىٰٓ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَآءَ أَحَدٌ مِّنكُم مِّنَ ٱلْغَآئِطِ أَوْ لَـٰمَسْتُمُ ٱلنِّسَآءَ فَلَمْ تَجِدُوا۟ مَآءً فَتَيَمَّمُوا۟ صَعِيدًا طَيِّبًا فَٱمْسَحُوا۟ بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا
Yaaaʹayyuhal laẓeena ʹaamanoo laa- taq̣rabuṣ ṣalaata wa-ʹañtum sukaaraa ḥattaa taʻlamoo maa- taq̣ooloona wa-laa junuban ʹillaa ʻaabiree sabeelin ḥatta tag̣tasiloo. Wa-ʹiñ kuñtum marḍaaa ʹaw ʻalaa safarin ʹaw jaaaʹa ʹaḥadum miñkum minal g̣aaaʹiṭi ʹaw laamastumun niṣaaaʹa falam tajidoo maaaʹañ fatayammamoo ṣaʻeedañ ṭayyibañ famsaḥoo biwujoohikum wa-ʹaydeekum: ʹinnal laaha kaana ʻAfuwwan G̣afooraa.
ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే[1], మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప[2]. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి)[3]. నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు.
-
4:44
أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًا مِّنَ ٱلْكِتَـٰبِ يَشْتَرُونَ ٱلضَّلَـٰلَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا۟ ٱلسَّبِيلَ
ʹAlam tara ʹilal laẓeena ʹootoo naṣeebam minal Kitaabi yashtaroonaḍ ḍalaalata wa-yureedoona ʹañ taḍillus sabeel.
ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడలేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు.
-
4:45
وَٱللَّهُ أَعْلَمُ بِأَعْدَآئِكُمْ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِٱللَّهِ نَصِيرًا
Wallaahu ʹaʻlamu biʹaʻdaaaʹikum; wa-kafaa billaahi Waliyyañw Wakafaa billaahi Naṣeeraa.
మరియు అల్లాహ్ మీ శత్రువులను బాగా ఎరుగును. కావున మీ రక్షకుడుగా అల్లాహ్ యే చాలు మరియు మీకు సహాయకుడుగా కూడా అల్లాహ్ యే చాలు!
-
4:46
مِّنَ ٱلَّذِينَ هَادُوا۟ يُحَرِّفُونَ ٱلْكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَٱسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَٰعِنَا لَيًّۢا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِى ٱلدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا۟ سَمِعْنَا وَأَطَعْنَا وَٱسْمَعْ وَٱنظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَـٰكِن لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا
Minal laẓeena haadoo yuḥarrifoonal kalima ʻam mawaaḍiʻihee wa-yaq̣ooloona samiʻnaa wa-ʻaṣaynaa wasmaʻ g̣ayra musmaʻiñw waraaʻinaa lay-yam biʹalsinatihim waṭaʻnañ fid deen. Wa-law ʹannahum q̣aaloo samiʻnaa wa-ʹaṭaʻnaa wasmaʻ wañz̤̣urnaa lakaana khayral lahum wa-ʹaq̣wama wa-laakil laʻanahumul laahu bikufrihim falaa yuʹminoona ʹillaa q̣aleelaa.
యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి'అనా వ 'అ'సయ్ నా)." అనీ; మరియు: "విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ 'అ 'గైర మస్ మ'ఇన్)."[1] అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా'ఇనా) [2] అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: "విన్నాము, విధేయులమయ్యాము. (సమి'అనా వ అ'త'అనా)." అనీ; మరియు: "మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ'అ వన్'జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.
-
4:47
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ ءَامِنُوا۟ بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰٓ أَدْبَارِهَآ أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّآ أَصْحَـٰبَ ٱلسَّبْتِ ۚ وَكَانَ أَمْرُ ٱللَّهِ مَفْعُولًا
Yaaaʹayyuhal laẓeena ʹootul Kitaaba ʹaaminoo bimaa nazzalnaa muṣaddiq̣al limaa maʻakum miñ q̣abli ʹañ naṭmisa wujoohañ fanaruddahaa ʻalaaa ʹadbaarihaaa ʹaw nalʻanahum kamaa laʻannaaa ʹAṣḥaabas Sabt. Wa-kaana ʹamrul laahi mafʻoolaa.
ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయక ముందే). లేక మేము సబ్త్ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి)[1]. ఎందుకంటే! అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది.
-
4:48
إِنَّ ٱللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِۦ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ ۚ وَمَن يُشْرِكْ بِٱللَّهِ فَقَدِ ٱفْتَرَىٰٓ إِثْمًا عَظِيمًا
ʹInnal laaha laa- yag̣firu ʹañy yushraka bihee wayag̣firu maa- doona ẓaalika limañy yashaaaʹ. Wa-mañy yushrik billaahi faq̣adif taraaa ʹis̤man ʻa-Z̤̣eemaa.
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు[1]. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!
-
4:49
أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ ٱللَّهُ يُزَكِّى مَن يَشَآءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
ʹAlam tara ʹilal laẓeena yuzakkoona ʹañfusahum? Balil laahu yuzakkee mañy yashaaaʹu wa-laa yuz̤̣lamoona fateela.
ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)?[1] వాస్తవానికి, అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు[2]. మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు.[3]
-
4:50
ٱنظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِۦٓ إِثْمًا مُّبِينًا
ʹUñz̤̣ur kayfa yaftaroona ʻalal laahil kaẓib! wa-kafaa biheee ʹiṣmam mubeenaa!
చూడండి! వారు అల్లాహ్ ను గురించి ఏ విధమైన అబద్ధాన్ని కల్పిస్తున్నారో? మరియు స్పష్టమైన పాపం, అని చెప్పటానికి ఇది చాలు.
-
4:51
أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًا مِّنَ ٱلْكِتَـٰبِ يُؤْمِنُونَ بِٱلْجِبْتِ وَٱلطَّـٰغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا۟ هَـٰٓؤُلَآءِ أَهْدَىٰ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ سَبِيلًا
ʹAlam tara ʹilal laẓeena ʹootoo naṣeebam minal Kitaabi yuʹminoona bil-Jibti waṭ-Ṭaag̣ooti wa-yaq̣ooloona lillaẓeena kafaroo haaaʹulaaaʹi ʹahdaa minal laẓeena ʹaamanoo sabeelaa?
ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్[1] మరియు తాగూత్ [2]లలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి: "విశ్వాసుల కంటే, వీరే సరైన మార్గంలో ఉన్నారు." అని అంటారు.
-
4:52
أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ لَعَنَهُمُ ٱللَّهُ ۖ وَمَن يَلْعَنِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ نَصِيرًا
ʹUlaaaʹikal laẓeena laʻanahumul laah: wa-mañy yalʻanil laahu falañ tajida lahoo naṣeeraa.
ఇలాంటి వారే, అల్లాహ్ శాపానికి (బహిష్కారానికి) గురి అయిన వారు. మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు.
-
4:53
أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ ٱلْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ ٱلنَّاسَ نَقِيرًا
ʹAm lahum naṣeebum minal mulki faʹiẓal laa yuʹtoonan naasa naq̣eeraa?
లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక[1] అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు.
-
4:54
أَمْ يَحْسُدُونَ ٱلنَّاسَ عَلَىٰ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ ۖ فَقَدْ ءَاتَيْنَآ ءَالَ إِبْرَٰهِيمَ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَءَاتَيْنَـٰهُم مُّلْكًا عَظِيمًا
ʹAm yaḥsudoonan naasa ʻalaa maaa ʹaataahumul laahu miñ faḍlih? Faq̣ad ʹaataynaaa ʹAala ʹIbraaheemal Kitaaba wal-Ḥikmata wa-ʹaataynaahum mulkan ʻa-Z̤̣eemaa.
లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము.
-
4:55
فَمِنْهُم مَّنْ ءَامَنَ بِهِۦ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا
Faminhum man ʹaamana bihee wa-minhum mañ ṣadda ʻanh: wa-kafaa bi-Jahannama saʻeeraa.
కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు! [1]
-
4:56
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَـٰهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا۟ ٱلْعَذَابَ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا
ʹInnal laẓeena kafaroo biʹAayaatinaa sawfa nuṣleehim Naaraa. kullamaa naḍijat julooduhum baddalnaahum juloodan g̣ayrahaa liyaẓooq̣ul ʻaẓaab: ʹinnal laha kaana ʻAzeezan Ḥakeemaa.
నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు.
-
4:57
وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ سَنُدْخِلُهُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۖ لَّهُمْ فِيهَآ أَزْوَٰجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا
Wallaẓeena ʹaamanoo wa-ʻamiluṣ ṣaaliḥaati sanudkhiluhum Jannaatiñ tajree miñ taḥtihal ʹanhaaru khaalideena feehaaa ʹabadaa: lahum feehaaa ʹazwaajum muṭahharah: wa-nudkhiluhum z̤̣illañ z̤̣aleelaa.
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము; వారందులో, శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము. [1]
-
4:58
۞ إِنَّ ٱللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا۟ ٱلْأَمَـٰنَـٰتِ إِلَىٰٓ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ ٱلنَّاسِ أَن تَحْكُمُوا۟ بِٱلْعَدْلِ ۚ إِنَّ ٱللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِۦٓ ۗ إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعًۢا بَصِيرًا
ʹInnal laaha yaʹmurukum ʹañ tuʹaddul ʹamaanaati ʹilaaa ʹahlihaa wa-ʹiẓaa ḥakamtum̃ baynan naasi ʹañ taḥkumoo bil-ʻadl! ʹInnal laaha niʻimmaa yaʻiz̤̣ukum̃ bih! ʹInnal laaha kaana Sameeʻam Baṣeeraa.
పూచీలను (అమానాత్ లను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండనీ మరియు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండనీ, అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంత ఉత్తమమైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
-
4:59
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَطِيعُوا۟ ٱللَّهَ وَأَطِيعُوا۟ ٱلرَّسُولَ وَأُو۟لِى ٱلْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَـٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
Yaaaʹayyuhal laẓeena ʹaamanooo ʹaṭeeʻul laaha wa-ʹaṭeeʻur Rasoola wa-ʹulil ʹamri miñkum. Faʹiñ tanaazaʻtum fee shayʹiñ faruddoohu ʹilal laahi war-Rasooli ʹiñ kuntum tuʹminoona billaahi wal-Yawmil ʹAakhir. Ẓaalika khayruñw waʹaḥsanu taʹweelaa.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి.[1] ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.
-
4:60
أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ ءَامَنُوا۟ بِمَآ أُنزِلَ إِلَيْكَ وَمَآ أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوٓا۟ إِلَى ٱلطَّـٰغُوتِ وَقَدْ أُمِرُوٓا۟ أَن يَكْفُرُوا۟ بِهِۦ وَيُرِيدُ ٱلشَّيْطَـٰنُ أَن يُضِلَّهُمْ ضَلَـٰلًۢا بَعِيدًا
ʹAlam tara ʹilal laẓeena yazʻumoona ʹannahum aamanoo bimaaa ʹuñzila ʹilayka wa-maaa ʹuñzila miñ q̣ablika yureedoona ʹañy yataḥaakamooo ʹilaṭ Ṭaag̣ooti wa-q̣ad ʹumirooo ʹañy yakfuroo bih. Wayureedush Shayṭaanu ʹañy yuḍillahum ḍalaalam baʻeedaa.
(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్[1] వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు.
-
4:61
وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا۟ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ رَأَيْتَ ٱلْمُنَـٰفِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا
Wa-ʹiẓaa q̣eela lahum taʻaalaw ʹilaa maaa ʹañzalal laahu wa-ʹilar Rasooli raʹaytal Munaafiq̣eena yaṣuddoona ʻañka ṣudoodaa.
మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని చెప్పినపుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగి పోవటాన్ని చూస్తావు!
-
4:62
فَكَيْفَ إِذَآ أَصَـٰبَتْهُم مُّصِيبَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَآءُوكَ يَحْلِفُونَ بِٱللَّهِ إِنْ أَرَدْنَآ إِلَّآ إِحْسَـٰنًا وَتَوْفِيقًا
Fakayfa ʹiẓaaa ʹaṣaabathum muṣeebatum bimaa q̣addamat ʹaydeehim s̤umma jaaaʹooka yaḥlifoona billaahi ʹin ʹaradnaaa ʹillaaa iḥsaanañw watawfeeq̣aa!
అయితే వారు తమ చేతులారా చేసుకున్న (దుష్కార్యాల) ఫలితంగా వారికి బాధ కలిగినపుడు, వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ: "మేము మేలు చేయాలనీ మరియు ఐకమత్యం చేకూర్చాలనీ మాత్రమే ప్రయత్నించాము." అని అంటారు.[1]
-
4:63
أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَعْلَمُ ٱللَّهُ مَا فِى قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِىٓ أَنفُسِهِمْ قَوْلًۢا بَلِيغًا
ʹUlaaaʹikal laẓeena yaʻla mullaahu maa- fee q̣uloobihim faʹaʻriḍ ʻanhum wa-ʻiẓhum wa-q̣ul lahum feee ʹañfusihim q̣awlam baleeg̣aa.
అలాంటి వారినీ (కపట విశ్వాసులనూ) ! వారి హృదయాలలో ఉన్నదీ అల్లాహ్ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చెయ్యి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాట పలుకు.
-
4:64
وَمَآ أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ ٱللَّهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوٓا۟ أَنفُسَهُمْ جَآءُوكَ فَٱسْتَغْفَرُوا۟ ٱللَّهَ وَٱسْتَغْفَرَ لَهُمُ ٱلرَّسُولُ لَوَجَدُوا۟ ٱللَّهَ تَوَّابًا رَّحِيمًا
Wa-maaa ʹarsalnaa mir Rasoolin ʹillaa liyuṭaaʻa biʹIẓnil laah. Wa-law ʹannahum ʹiz̤̣ z̤̣alamooo ʹañfusahum jaaaʹooka fastag̣farul laaha wastag̣fara lahumur Rasoolu lawajadul laaha Tawwaabar Raḥeemaa.
మరియు మేము ఏ ప్రవక్తను పంపినా - అల్లాహ్ అనుజ్ఞతో - (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి వారు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు - ప్రవక్త కూడా వారికై అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకున్నప్పుడు - వారు అల్లాహ్ ను నిశ్చయంగా, క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాత గానూ పొందుతారు.
-
4:65
فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا۟ فِىٓ أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا۟ تَسْلِيمًا
Falaa Wa-Rabbika laa- yuʹminoona ḥattaa yuḥakkimooka fee-ma shajara baynahum s̤umma laa- yajidoo feee ʹañfusihim ḥarajam mimmaa q̣aḍayta wa-yusal-limoo tasleemaa.
అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు![1]
-
4:66
وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ ٱقْتُلُوٓا۟ أَنفُسَكُمْ أَوِ ٱخْرُجُوا۟ مِن دِيَـٰرِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا۟ مَا يُوعَظُونَ بِهِۦ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا
Wa-law ʹannaa katabnaa ʻalayhim ʹaniq̣ tulooo ʹanfusakum ʹawikh rujoo miñ diyarikum maa faʻaloohu ʹillaa q̣aleelum minhum: wa-law ʹannahum faʻaloo maa- yooʻaz̤̣oona bihee lakaana khayral lahum wa-ʹashadda tas̤beetaa;
మరియు ఒకవేళ వాస్తవానికి మేము వారిని: "మీ ప్రాణాల బలి ఇవ్వండి లేదా మీ ఇల్లూ వాకిళ్ళను విడిచి వెళ్ళండి!" అని ఆజ్ఞాపించి (విధిగా చేసి) ఉంటే, వారిలో కొందరు మాత్రమే అలా చేసి ఉండేవారు. ఒకవేళ వారికి ఉపదేశించినట్లు వారు చేసి ఉంటే, నిశ్చయంగా, అది వారికే శ్రేయస్కరమైనదిగా మరియు వారి (విశ్వాసాన్ని) దృఢపరిచేదిగా ఉండేది.
-
4:67
وَإِذًا لَّـَٔاتَيْنَـٰهُم مِّن لَّدُنَّآ أَجْرًا عَظِيمًا
Wa-ʹiẓal laʹaataynaahum mil ladunnaaa ʹajran ʻaz̤̣eemaa;
మరియు అప్పుడు వారికి మేము, మా వైపు నుండి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారం.
-
4:68
وَلَهَدَيْنَـٰهُمْ صِرَٰطًا مُّسْتَقِيمًا
Wa-la-hadynaahum Ṣiraaṭam Mustaq̣eema.
మరియు మేము వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసి ఉండేవారం.
-
4:69
وَمَن يُطِعِ ٱللَّهَ وَٱلرَّسُولَ فَأُو۟لَـٰٓئِكَ مَعَ ٱلَّذِينَ أَنْعَمَ ٱللَّهُ عَلَيْهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ وَٱلصِّدِّيقِينَ وَٱلشُّهَدَآءِ وَٱلصَّـٰلِحِينَ ۚ وَحَسُنَ أُو۟لَـٰٓئِكَ رَفِيقًا
Wa-mañy yuṭiʻil laaha war-Rasoola faʹulaaaʹika maʻal laẓeena ʹanʻamal laahu ʻalayhim minan Nabiyeena waṣ-Ṣiddeeq̣eena wash-Shuhadaaaʹi waṣ-Ṣaaliḥeen: waḥasuna ʹulaaʹika Rafeeq̣aa.
మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది![1]
-
4:70
ذَٰلِكَ ٱلْفَضْلُ مِنَ ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ عَلِيمًا
Ẓaalikal Faḍlu minal laah: wa-kafaa billaahi ʻAleemaa.
అల్లాహ్ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు (యథార్థం) తెలుసుకోవటానికి అల్లాహ్ చాలు.
-
4:71
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ خُذُوا۟ حِذْرَكُمْ فَٱنفِرُوا۟ ثُبَاتٍ أَوِ ٱنفِرُوا۟ جَمِيعًا
Yaaaʹayyuhal laẓeena ʹaamanoo khuẓoo ḥiẓrakum fañfiroo s̤ubaatin ʹawiñ firoo jameeʻaa.
ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! [1] మీరు (యుద్ధానికి) జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలు దేరండి.
-
4:72
وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَـٰبَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ ٱللَّهُ عَلَىَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا
Wa-ʹinna miñkum lamal layubaṭṭiʹann: faʹin ʹaṣaabatkum muṣeebatuñ q̣aala q̣ad ʹanʻamal laahu ʻalayya ʹiẓ lam ʹakum maʻahum shaheedaa.
మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు: "వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను!" అని అంటాడు.
-
4:73
وَلَئِنْ أَصَـٰبَكُمْ فَضْلٌ مِّنَ ٱللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُنۢ بَيْنَكُمْ وَبَيْنَهُۥ مَوَدَّةٌ يَـٰلَيْتَنِى كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
Wa-laʹin ʹaṣaabakum faḍlum minal laahi layaq̣oolanna kaʹal lam takum baynakum wabaynahoo mawaddatuñy yaa-laytanee kuñtu maʻahum faʹafooza fawzan ʻa-Z̤̣eemaa!
మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! [1] మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: "అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా!" అని తప్పక అంటాడు.
-
4:74
۞ فَلْيُقَـٰتِلْ فِى سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يَشْرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا بِٱلْـَٔاخِرَةِ ۚ وَمَن يُقَـٰتِلْ فِى سَبِيلِ ٱللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
Falyuq̣aatil fee Sabeelil laahil laẓeena yashroonal ḥayaatad dunyaa bil-ʹAakhirah. Wa-mañy yuq̣aatil fee Sabeelil laahi fayuq̣tal ʹaw yag̣lib fasawfa nuʹteehi ʹajran ʻaz̤̣eemaa.
కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు), అల్లాహ్ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వాడు, చంపబడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.
-
4:75
وَمَا لَكُمْ لَا تُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ وَٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلْوِلْدَٰنِ ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ أَخْرِجْنَا مِنْ هَـٰذِهِ ٱلْقَرْيَةِ ٱلظَّالِمِ أَهْلُهَا وَٱجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَٱجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا
Wa-maa lakum laa- tuq̣aatiloona fee Sabeelil laahi walmustaḍʻafeena minar rijaali wan-Nisaaaʹi walwildaanil laẓeena yaq̣ooloona Rabbanaaa ʹakhrijnaa min haaẓihil q̣aryatiz̤̣ z̤̣aalimi ʹahluhaa; wajʻal lanaa mil laduñka waliyyañw wajʻal lanaa mil laduñka naṣeeraa!
మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? [1] వారు: "మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!" అని వేడుకుంటున్నారు.
-
4:76
ٱلَّذِينَ ءَامَنُوا۟ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱلطَّـٰغُوتِ فَقَـٰتِلُوٓا۟ أَوْلِيَآءَ ٱلشَّيْطَـٰنِ ۖ إِنَّ كَيْدَ ٱلشَّيْطَـٰنِ كَانَ ضَعِيفًا
Allaẓeena ʹaamanoo yuq̣aatiloona fee Sabeelil laahi wallaẓeena kafaroo yuq̣aatiloona fee Sabeeliṭ Ṭaag̣ooti faq̣aatilooo ʹawliyaaʹash Shayṭaan: ʹinna kaydash Shayṭaani kaana ḍaʻeefaa.
విశ్వసించిన వారు, అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. మరియు సత్యతిరస్కారులు తాగూత్ మార్గంలో పోరాడుతారు; [1] కావున మీరు (ఓ విశ్వాసులారా!) షైతాను అనుచరులను విరుద్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షైతాను కుట్ర బలహీనమైనదే!
-
4:77
أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوٓا۟ أَيْدِيَكُمْ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ ٱلْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ ٱلنَّاسَ كَخَشْيَةِ ٱللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا۟ رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا ٱلْقِتَالَ لَوْلَآ أَخَّرْتَنَآ إِلَىٰٓ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَـٰعُ ٱلدُّنْيَا قَلِيلٌ وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا
ʹAlam tara ʹilal laẓeena q̣eela lahum kuffooo ʻaydiyakum wa-ʹaq̣eemuṣ Ṣalaata wa-ʹaatuz Zakaah? Falammaa kutiba ʻalayhimul q̣italu ʹiẓaa fareeq̣um minhum yakhshawnan naasa kakhashyatil laahi ʹaw ʹashadda khashyah: wa-q̣aaloo Rabbana lima katabta ʻalaynal q̣itaal? Law- laaa ʹakhkhartanaaa ʹilaaa ʹajaliñ q̣areeb? Q̣ul mataaʻud dunyaa q̣aleel: wal-ʹAakhiratu khayrul limanit taq̣aa: wa-laa tuz̤̣lamoona fateelaa.
"మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు?[1] అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.
-
4:78
أَيْنَمَا تَكُونُوا۟ يُدْرِككُّمُ ٱلْمَوْتُ وَلَوْ كُنتُمْ فِى بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا۟ هَـٰذِهِۦ مِنْ عِندِ ٱللَّهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا۟ هَـٰذِهِۦ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ ٱللَّهِ ۖ فَمَالِ هَـٰٓؤُلَآءِ ٱلْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا
ʹAynamaa takoonoo yudrikkumul mawtu walaw kuñtum fee buroojim mushayyadah. Wa-ʹiñ tuṣibhum ḥasanatuñy yaq̣ooloo haaẓihee min ʻiñdil laah; wa-ʹiñ tuṣibhum sayyiʹatuñy yaq̣ooloo haaẓihee min ʻiñdik. Q̣ul kullum min ʻiñdil laah. Famaali haaaʹulaaaʹil q̣awmi laa- yakaadoona yafq̣ahoona ḥadees̤aa?
"మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు." (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని అంటారు. కాని వారికేదైనా కీడు గలిగితే: "(ఓ ముహమ్మద్!) ఇది నీ వల్ల జరిగింది." అని అంటారు. వారితో అను: "అంతా అల్లాహ్ తరఫు నుండే (వస్తుంది)!" ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?
-
4:79
مَّآ أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ ٱللَّهِ ۖ وَمَآ أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَـٰكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا
Maaa ʹaṣaabaka min ḥasanatiñ faminal laah; wa-maaa ʹaṣaabaka miñ sayyiʹatiñ famin nafsik Wa-ʹarsalnaaka linnaasi Rasoolaa. Wa-kafaa billaahi Shaheedaa.
(ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే[1] మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే![2] మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్ సాక్ష్యమే చాలు.
-
4:80
مَّن يُطِعِ ٱلرَّسُولَ فَقَدْ أَطَاعَ ٱللَّهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَآ أَرْسَلْنَـٰكَ عَلَيْهِمْ حَفِيظًا
Mañy yuṭiʻir Rasoola faq̣ad ʹaṭaaʻal laah: wa-mañ tawallaa famaaa ʹarsalnaaka ʻalayhim ḥafeez̤̣aa.
ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే.[1] మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు.
-
4:81
وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا۟ مِنْ عِندِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنْهُمْ غَيْرَ ٱلَّذِى تَقُولُ ۖ وَٱللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا
Wa-yaq̣ooloona Ṭaaʻatun faʹiẓaa barazoo min ʻiñdika bayyata ṭaaaʹifatum minhum g̣ayral laẓee taq̣ool. Wallaahu yaktubu maa- yubayyitoon; faʹaʻriḍ ʻanhum wa-tawakkal ʻalal lah: wa-kafaa billaahi Wakeelaa.
మరియు వారు (నీ సమక్షంలో): "మేము విధేయులమయ్యాము." అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళి పోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పిన దానికి విరుద్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారి నుండి ముఖము త్రిప్పుకో మరియు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు!
-
4:82
أَفَلَا يَتَدَبَّرُونَ ٱلْقُرْءَانَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ ٱللَّهِ لَوَجَدُوا۟ فِيهِ ٱخْتِلَـٰفًا كَثِيرًا
ʹAfalaa yatadabbaroonal Q̣urʹaan? Wa-law kaana min ʻiñdi g̣ayril laahi lawajadoo fee-hikh tilaafañ kas̤eeraa
ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా! [1]
-
4:83
وَإِذَا جَآءَهُمْ أَمْرٌ مِّنَ ٱلْأَمْنِ أَوِ ٱلْخَوْفِ أَذَاعُوا۟ بِهِۦ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى ٱلرَّسُولِ وَإِلَىٰٓ أُو۟لِى ٱلْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ ٱلَّذِينَ يَسْتَنۢبِطُونَهُۥ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ ٱللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُۥ لَٱتَّبَعْتُمُ ٱلشَّيْطَـٰنَ إِلَّا قَلِيلًا
Wa-ʹiẓaa jaaaʹahum ʹamrum minal ʹamni ʹawil khawfi ʹaẓaaʻoo bih. Wa-law raddoohu ʹilar rasooli wa-ʹilaaa ʹulil ʹamri minhum laʻalimahul laẓeena yastambiṭoonahoo minhum. Wa-lawlaa Faḍlul laahi ʻalaykum wa-Raḥmatuhoo lattabaʻtumush Shayṭaana ʹillaa q̣aleelaa.
మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించ గలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ ను అనుసరించి ఉండేవారు.
-
4:84
فَقَـٰتِلْ فِى سَبِيلِ ٱللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ ٱلْمُؤْمِنِينَ ۖ عَسَى ٱللَّهُ أَن يَكُفَّ بَأْسَ ٱلَّذِينَ كَفَرُوا۟ ۚ وَٱللَّهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلًا
Faq̣aatil fee Sabeelil laahi laa- tukallafu ʹillaa nafsaka waḥarriḍil Muʹmineen. ʻAsal laahu ʹañy yakuffa baʹsal laẓeena kafaroo: wallaahu ʹashaddu baʹsañw waʹashaddu tañkeelaa.
కావున నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ మట్టుకే బాధ్యుడవు. మరియు విశ్వాసులను (యుద్ధానికి) ప్రోత్సహించు. అల్లాహ్ సత్యతిరస్కారుల శక్తిని అణచవచ్చు! మరియు అల్లాహ్ అంతులేని శక్తిగలవాడు మరియు శిక్షించటంలో చాలా కఠినుడు!
-
4:85
مَّن يَشْفَعْ شَفَـٰعَةً حَسَنَةً يَكُن لَّهُۥ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَـٰعَةً سَيِّئَةً يَكُن لَّهُۥ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ مُّقِيتًا
Mañy yashfaʻ shafaaʻatan ḥasanatañy yakul lahoo naṣeebum minhaa; wa-mañy yashfaʻ shafaaʻatañ sayyiʹatañy yakul lahoo kiflum minhaa: wa-kaanal laahu ʻalaa kulli shayʹim Muq̣eetaa.
మంచి విషయం కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై అధికారం గలవాడు.[1]
-
4:86
وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا۟ بِأَحْسَنَ مِنْهَآ أَوْ رُدُّوهَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَىْءٍ حَسِيبًا
Wa-ʹiẓaa ḥuyyeetum̃ bitaḥiyatiñ faḥayyoo biʹaḥsana minhaaa ʹaw ruddoohaa. ʹInnal laaha kaana ʻalaa kulli shayʹin Ḥas̤eebaa.
మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). [1] నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు.[2]
-
4:87
ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ ٱللَّهِ حَدِيثًا
ʹAllaahu laaa ʹilaaha ʹillaa huwa layajmaʻannakum ʹilaa yawmil Q̣iyaamati laa- rayba feeh. Wa-man ʹaṣdaq̣u minal laahi ḥadees̤aa?
అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది?
-
4:88
۞ فَمَا لَكُمْ فِى ٱلْمُنَـٰفِقِينَ فِئَتَيْنِ وَٱللَّهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوٓا۟ ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا۟ مَنْ أَضَلَّ ٱللَّهُ ۖ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ سَبِيلًا
Famaa lakum fil Munaafiq̣eena fiʹatayni wallaahu ʹarkasahum̃ bimaa kasaboo? ʹAtureedoona ʹañ tahdoo man ʹaḍallal laah? Wa-mañy yuḍlilil laahu falañ tajida lahoo Sabeelaa.
(ఓ విశ్వాసులారా!) మీకేమయింది, కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలిపోయారు.[1] అల్లాహ్ వారి కర్మల ఫలితంగా, వారిని వారి పూర్వ (అవిశ్వాస) స్థితికి మరలించాడు. ఏమీ? అల్లాహ్ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి, అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు (ఋజు) మార్గం చూప లేవు.[2]
-
4:89
وَدُّوا۟ لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا۟ فَتَكُونُونَ سَوَآءً ۖ فَلَا تَتَّخِذُوا۟ مِنْهُمْ أَوْلِيَآءَ حَتَّىٰ يُهَاجِرُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ۚ فَإِن تَوَلَّوْا۟ فَخُذُوهُمْ وَٱقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا۟ مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا
Waddoo law takfuroona kamaa kafaroo fatakoonoona sawaaaʹa; falaa tattakhiẓoo minhum ʹawliyaaaʹa ḥattaa yuhaajiroo fee sabeelil laah; faʹiñ tawallaw fakhuẓoohum waq̣tuloohum ḥays̤u wajattumoohum; wa-laa tattakhiẓoo minhum waliyyañw walaa naṣeeraa:
మరియు వారు సత్యతిరస్కారులైనట్లే మీరు కూడా సత్యతిరస్కారులై, వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్ మార్గంలో వారు వలస పోనంత వరకు (హిజ్రత్ చేయనంత వరకు), వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెను దిరిగితే, మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా, సహాయకులుగా చేసుకోకండి.
-
4:90
إِلَّا ٱلَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍۭ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَـٰقٌ أَوْ جَآءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَـٰتِلُوكُمْ أَوْ يُقَـٰتِلُوا۟ قَوْمَهُمْ ۚ وَلَوْ شَآءَ ٱللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَـٰتَلُوكُمْ ۚ فَإِنِ ٱعْتَزَلُوكُمْ فَلَمْ يُقَـٰتِلُوكُمْ وَأَلْقَوْا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا
ʹIllal laẓeena yaṣiloona ʹilaa q̣awmim baynakum wa-baynahum mees̤aaq̣un ʹaw jaaaʹookum ḥaṣirat ṣudooruhum ʹañy yuq̣aatilookum ʹaw yuq̣aatiloo q̣awmahum. Wa-law shaaaʹal laahu lasallaṭahum ʹalaykum falaq̣aatalookum Faʹiniʻ tazalookum falam yuq̣aatilookum wa-ʹalq̣aw ʹilaykumus salama famaa jaʻalal laahu lakum ʻalayhim sabeelaa.
కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు.
-
4:91
سَتَجِدُونَ ءَاخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا۟ قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوٓا۟ إِلَى ٱلْفِتْنَةِ أُرْكِسُوا۟ فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوٓا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ وَيَكُفُّوٓا۟ أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَٱقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُو۟لَـٰٓئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَـٰنًا مُّبِينًا
Satajidoona ʹaakhareena yureedoona ʹañy yaʹmanookum wa-yaʹmanoo q̣awmahum: kulla maa- ruddooo ʹilal fitnati ʹurkisoo feehaa: faʹil lam yaʻtazilookum wa-yulq̣ooo ʹilaykumus salama wa-yakuffooo ʹaydiyahum fakhuẓoohum waq̣tuloohum ḥays̤u s̤aq̣iftumoohum: wa-ʹulaaaʹikum jaʻalnaa lakum ʻalayhim sulṭaanam mubeenaa.
మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతి వారితో కూడా శాంతి పొందాలని కోరుతుంటారు. కాని సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలి పోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరించక పోతే, తమ చేతులను (మీతో యుద్ధం చేయటం నుండి) ఆపు కోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము.
-
4:92
وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَـًٔا ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَـًٔا فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰٓ أَهْلِهِۦٓ إِلَّآ أَن يَصَّدَّقُوا۟ ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍۭ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَـٰقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰٓ أَهْلِهِۦ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ ٱللَّهِ ۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا
Wa-maa kaana limuʹminin ʹañy yaq̣tula Muʹminan ʹillaa khaṭaʹaa. Wa-mañ q̣atala Muʹminan khaṭaʹañ fataḥreeru raq̣abatim Muʹminatiñw wadiyatum musallamatun ʹilaaa ʹahliheee ʹillaaa ʹañy yaṣṣaddaq̣oo. Faʹiñ kaana miñ q̣awmin ʻaduwwil lakum wa-huwa Muʹminuñ fataḥreeru raq̣abatim Muʹminah. Wa-ʹiñ kaana miñ q̣awmim baynakum wa-baynahum mees̤aaq̣uñ fadiyatum musallamatun ʹilaaa ʹahlihee wa-taḥreeru raq̣abatim Muʹminah. Famal lam yajid fa-Ṣiyaamu Shahrayni mutataabiʻayn: tawbatam minal laah: wa-kaanal laahu ʻaleeman Ḥakeemaa.
మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) [1] అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
-
4:93
وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهُۥ جَهَنَّمُ خَـٰلِدًا فِيهَا وَغَضِبَ ٱللَّهُ عَلَيْهِ وَلَعَنَهُۥ وَأَعَدَّ لَهُۥ عَذَابًا عَظِيمًا
Wa-mañy yaq̣tul Muʹminam mutaʻammidañ fajazaaaʹuhoo Jahannamu khaalidañ feehaa wa-g̣aḍibal laahu ʻalayhi wa-laʻanahoo wa-ʹaʻadda lahoo ʻaẓaaban ʻa-Z̤̣eemaa.
మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు [1] మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు.
-
4:94
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا ضَرَبْتُمْ فِى سَبِيلِ ٱللَّهِ فَتَبَيَّنُوا۟ وَلَا تَقُولُوا۟ لِمَنْ أَلْقَىٰٓ إِلَيْكُمُ ٱلسَّلَـٰمَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا فَعِندَ ٱللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ ٱللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوٓا۟ ۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
Yaaaʹayyuhal laẓeena ʹaamanooo ʹiẓaa ḍarabtum fee Sabeelil laahi fatabayyanoo wa-laa taq̣ooloo liman ʹalq̣aaa ʹilaykumus salaama lasta Muʹminaa! tabtag̣oona ʻaraḍal ḥayaatid dunyaa: faʻiñdal laahi mag̣aanimu kas̤eerah. Kaẓaalika kuñtum miñ q̣ablu famannal laahu ʻalaykum fatabayyanoo. ʹInnal laaha kaana bimaa taʻmaloona Khabeeraa.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - "నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు."[1] అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును.
-
4:95
لَّا يَسْتَوِى ٱلْقَـٰعِدُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ غَيْرُ أُو۟لِى ٱلضَّرَرِ وَٱلْمُجَـٰهِدُونَ فِى سَبِيلِ ٱللَّهِ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ ٱللَّهُ ٱلْمُجَـٰهِدِينَ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ عَلَى ٱلْقَـٰعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ ٱللَّهُ ٱلْحُسْنَىٰ ۚ وَفَضَّلَ ٱللَّهُ ٱلْمُجَـٰهِدِينَ عَلَى ٱلْقَـٰعِدِينَ أَجْرًا عَظِيمًا
Laa- yastawil q̣aaʻidoona minal Muʹmineena g̣ayru ʹuliḍ ḍarari wal-Mujaahidoona fee Sabeelil laahi biʹamwaalihim wa-ʹañfusihim. Faḍḍalal laahul Mujaahideena biamwaalihim wa-ʹañfusihim ʻalal q̣aaʻideena darajah wa-kullañw waʻdal laahul ḥusnaa: wa-faḍḍalal laahul Mujaahideena ʻalal q̣aaʻideena ʹajran ʻaz̤̣eemaa;―
ఎలాంటి కారణం లేకుండా, ఇంటి వద్ద కూర్చుండిపోయే విశ్వాసులు మరియు అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసే విశ్వాసులతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసేవారి స్థానాన్ని అల్లాహ్! ఇంట్లో కూర్చుండి పోయే వారి స్థానం కంటే, ఉన్నతం చేశాడు. మరియు అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ అల్లాహ్ ధర్మయుద్ధం (జిహాద్) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారి కంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు.
-
4:96
دَرَجَـٰتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا
Darajaatim minhu wa-mag̣firatañw waraḥmah. Wa-kaanal laahu G̣afoorar Raḥeemaa.
వారి కొరకు, ఆయన తరఫు నుండి ఉన్నత స్థానాలు, క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
-
4:97
إِنَّ ٱلَّذِينَ تَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ ظَالِمِىٓ أَنفُسِهِمْ قَالُوا۟ فِيمَ كُنتُمْ ۖ قَالُوا۟ كُنَّا مُسْتَضْعَفِينَ فِى ٱلْأَرْضِ ۚ قَالُوٓا۟ أَلَمْ تَكُنْ أَرْضُ ٱللَّهِ وَٰسِعَةً فَتُهَاجِرُوا۟ فِيهَا ۚ فَأُو۟لَـٰٓئِكَ مَأْوَىٰهُمْ جَهَنَّمُ ۖ وَسَآءَتْ مَصِيرًا
ʹInnal laẓeena tawaffaahumul malaaaʹikatu z̤̣aalimeee ʹañfusihim q̣aaloo feema kuñtum: Q̣aaloo kunnaa mustaḍʻafeena fil ʹarḍ. Q̣aalooo ʹalam takun ʹarḍul laahi waasiʻatañ fatuhaajiroo feehaa? Faʹulaaaika maʹwaahum Jahannam, Wasaaaʹat maṣeeraa:
నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం![1]
-
4:98
إِلَّا ٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلْوِلْدَٰنِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا
ʹIllal mustaḍʻafeena minar rijaali wannisaaaʹi walwildaani laa- yastaṭeeʻoona ḥeelatañw walaa yahtadoona sabeelaa.
కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప!
-
4:99
فَأُو۟لَـٰٓئِكَ عَسَى ٱللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ ٱللَّهُ عَفُوًّا غَفُورًا
Faʹulaaaʹika ʻasal laahu ʹañy yaʻfuwa ʻanhum: wa-kaanal laahu ʻAfuwwan G̣afooraa.
కావున ఇటు వంటి వారిని, అల్లాహ్ మన్నించవచ్చు! ఎందుకంటే, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు.
-
4:100
۞ وَمَن يُهَاجِرْ فِى سَبِيلِ ٱللَّهِ يَجِدْ فِى ٱلْأَرْضِ مُرَٰغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِنۢ بَيْتِهِۦ مُهَاجِرًا إِلَى ٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ يُدْرِكْهُ ٱلْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُۥ عَلَى ٱللَّهِ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا
Wa-mañy yuhaajir fee Sabeelil laahi yajid fil ʹarḍi muraag̣amañ kas̤eerañw wasaʻah. wa-mañy yakhruj mim baytihee muhaajiran ʹilal laahi wa-Rasoolihee s̤umma yudrikhul mawtu faq̣ad waq̣aʻa ajruhoo ʻalal laah: wa-kaanal laahu G̣afoorar Raḥeemaa.
మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలస పోవటానికి బయలుదేరిన తరువాత, అతనికి చావు వస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
-
4:101
وَإِذَا ضَرَبْتُمْ فِى ٱلْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا۟ مِنَ ٱلصَّلَوٰةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ ٱلَّذِينَ كَفَرُوٓا۟ ۚ إِنَّ ٱلْكَـٰفِرِينَ كَانُوا۟ لَكُمْ عَدُوًّا مُّبِينًا
Wa-ʹiẓaa ḍarabtum fil ʹarḍi fallaysa ʻalaykum junaaḥun ʹañ taq̣ṣuroo minaṣ Ṣalaati ʹin khiftum ʹañy yaftinakumul laẓeena kafaroo: ʹinnal kaafireena kaanoo lakum ʻaduwwam mubeenaa.
మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు.[1] (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు.
-
4:102
وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ ٱلصَّلَوٰةَ فَلْتَقُمْ طَآئِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوٓا۟ أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا۟ فَلْيَكُونُوا۟ مِن وَرَآئِكُمْ وَلْتَأْتِ طَآئِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا۟ فَلْيُصَلُّوا۟ مَعَكَ وَلْيَأْخُذُوا۟ حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَٰحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰٓ أَن تَضَعُوٓا۟ أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا۟ حِذْرَكُمْ ۗ إِنَّ ٱللَّهَ أَعَدَّ لِلْكَـٰفِرِينَ عَذَابًا مُّهِينًا
Wa-ʹiẓaa kuñta feehim faʹaq̣amta lahumuṣ Ṣalaata faltaq̣um ṭaaaʹifatum minhum maʻaka wal-yaʹkhuẓooo ʹasliḥatahum: faʹiẓaa sajadoo fal-yakoonoo miñw waraaaʹikum. Wal-taʹti ṭaaaʹifatun ʹukhraa lam yuṣalloo falyuṣalloo maʻaka wal-yaʹkhuẓoo ḥiẓrahum wa-ʹasliḥatahum. Waddal laẓeena kafaroo law tag̣fuloona ʻan ʹasliḥatikum wa-ʹamtiʻatikum fayameeloona ʻalaykum maylatañw waaḥidah. Wa-laa junaaḥa ʻalaykum ʹiñ kaana bikum ʹaẓam mim maṭarin ʹaw kuñtum marḍaaa ʹañ taḍaʻooo ʹasliḥatakum: wa-khuẓoo ḥiẓrakum. ʹInnal laaha ʹaʻadda lilkaafireena ʻaẓaabam muheenaa.
మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.[1]
-
4:103
فَإِذَا قَضَيْتُمُ ٱلصَّلَوٰةَ فَٱذْكُرُوا۟ ٱللَّهَ قِيَـٰمًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا ٱطْمَأْنَنتُمْ فَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ ۚ إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتْ عَلَى ٱلْمُؤْمِنِينَ كِتَـٰبًا مَّوْقُوتًا
Faʹiẓaa q̣aḍaytumuṣ Ṣalaata faẓkurul laaha q̣iyaamañw waq̣uʻoodañw waʻalaa junoobikum. Faʹiẓaṭ maʹnañtum faʹaq̣eemuṣ Ṣalaah: ʹinnaṣ Ṣalaata kanat ʻalal Muʹmineena kitaabam mawq̣ootaa.
ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.
-
4:104
وَلَا تَهِنُوا۟ فِى ٱبْتِغَآءِ ٱلْقَوْمِ ۖ إِن تَكُونُوا۟ تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ ٱللَّهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا
Wa-laa tahinoo fib tig̣aaaʹil q̣awm ʹIñ takoonoo taʹlamoona faʹinnahum yaʹlamoona kamaa taʹlamoon; wa-tarjoona minal laahi maa laa- yar-joon. Wa-kaanal laahu ʻAleeman Ḥakeemaa.
మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - మీరు బాధపడుతున్నట్లే - బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
-
4:105
إِنَّآ أَنزَلْنَآ إِلَيْكَ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ لِتَحْكُمَ بَيْنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُ ۚ وَلَا تَكُن لِّلْخَآئِنِينَ خَصِيمًا
ʹInnaaa ʹañzalnaaa ʹilaykal Kitaaba bilḥaq̣q̣i litaḥkuma baynan naasi bimaaa ʹaraakal laah: Wa-laa takul lilkhaaaʹineena khaṣeemaa;
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను), సత్యంతో, నీపై అవతరింపజేసాము - అల్లాహ్ నీకు తెలిపిన ప్రకారం - నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికి. మరియు నీవు విశ్వాసఘాతకుల పక్షమున వాదించేవాడవు కావద్దు.
-
4:106
وَٱسْتَغْفِرِ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
Wastag̣firil laah; innal laaha kaana G̣afoorar Raḥeemaa.
మరియు అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.[1]
-
4:107
وَلَا تُجَـٰدِلْ عَنِ ٱلَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا
Wa-laa tujaadil ʻanil laẓeena yakhtaanoona ʹañfusahum: ʹinnal laaha laa- yuḥibboo mañ kaana khawwaanan ʹas̤eemaa;
మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు.
-
4:108
يَسْتَخْفُونَ مِنَ ٱلنَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ ٱللَّهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ ٱلْقَوْلِ ۚ وَكَانَ ٱللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا
Yastakhfoona minan naasi wa-laa yastakhfoona minal laahi wa-Huwa maʻahum ʹiẓ yubayyitoona maa laa- yarḍaa minal q̣awl: wa-kaanal laahu bimaa yaʻmaloona Muḥeeṭaa.
వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన (అల్లాహ్) కు సమ్మతం లేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలను చేసేటపుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.
-
4:109
هَـٰٓأَنتُمْ هَـٰٓؤُلَآءِ جَـٰدَلْتُمْ عَنْهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا فَمَن يُجَـٰدِلُ ٱللَّهَ عَنْهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلًا
Haaaʹañtum haaaʹulaaaʹi jaadaltum ʻanhum fil ḥayaatid dunyaa. Famañy yujaadilul laaha ʻanhum Yawmal Q̣iyaamati ʹam mañy yakoonu ʻalayhim wakeelaa?
అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పుదినమున వారి పక్షమున అల్లాహ్ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు?
-
4:110
وَمَن يَعْمَلْ سُوٓءًا أَوْ يَظْلِمْ نَفْسَهُۥ ثُمَّ يَسْتَغْفِرِ ٱللَّهَ يَجِدِ ٱللَّهَ غَفُورًا رَّحِيمًا
Wa-mañy yaʻmal soooʹan ʹaw yaz̤̣lim nafsahoo s̤umma yastag̣firil laaha yajidil laaha G̣afoorar Raḥeemaa.
మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు,[1] తరువాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటి వాడు, అల్లాహ్ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు.!
-
4:111
وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُۥ عَلَىٰ نَفْسِهِۦ ۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا
Wa-mañy yaksib is̤mañ faʹinnamaa yaksibuhoo ʻalaa nafsih: wa-kaanal laahu ʻAleeman Ḥakeemaa.
కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
-
4:112
وَمَن يَكْسِبْ خَطِيٓـَٔةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِۦ بَرِيٓـًٔا فَقَدِ ٱحْتَمَلَ بُهْتَـٰنًا وَإِثْمًا مُّبِينًا
Wa-mañy yaksib khaṭeeeʹatan ʹaw ʹis̤mañ s̤ummaa yarmi bihee bareeeʹañ faq̣adiḥ tamala buhtaanañw waʹis̤mam mubeenaa.
మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే!
-
4:113
وَلَوْلَا فَضْلُ ٱللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُۥ لَهَمَّت طَّآئِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَىْءٍ ۚ وَأَنزَلَ ٱللَّهُ عَلَيْكَ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ ٱللَّهِ عَلَيْكَ عَظِيمًا
Wa-lawlaa faḍlul laahi ʻalayka wa-Raḥmatuhoo lahammaṭ ṭaaaʹifatum minhum ʹañy yuḍillook. Wa-maa yuḍilloona ʹillaaa ʹañfusahum; wa-maa yaḍurroonaka miñ shayʹ. Wa-ʹañzalal laahu ʻalaykal Kitaaba wal-Ḥikmata waʻallamaka maa- lam takuñ taʻlam: wa-kaana faḍlul laahi ʻalayka ʻaz̤̣eemaa.
మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీ కెలాంటి హానీ చేయలేరు. మరియు అల్లాహ్ నీ పై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు.[1] మరియు నీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది.
-
4:114
۞ لَّا خَيْرَ فِى كَثِيرٍ مِّن نَّجْوَىٰهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَـٰحٍۭ بَيْنَ ٱلنَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ٱبْتِغَآءَ مَرْضَاتِ ٱللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
Laa- khayra fee kas̤eerim min najwaahum ʹillaa man ʹamara biṣadaq̣atin ʹaw maʻroofin ʹaw ʹiṣlaahim baynan naas. Wa-mañy yafʻal ẓaalikab tig̣aaaʹa marḍaatil laahi fasawfa nuʹteehi ʹajran ʻaz̤̣eemaa.
వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ'అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్ ప్రీతి కొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
-
4:115
وَمَن يُشَاقِقِ ٱلرَّسُولَ مِنۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ ٱلْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ ٱلْمُؤْمِنِينَ نُوَلِّهِۦ مَا تَوَلَّىٰ وَنُصْلِهِۦ جَهَنَّمَ ۖ وَسَآءَتْ مَصِيرًا
Wa-mañy yushaaq̣iq̣ir Rasoola mim baʹdi maa- tabayyana lahul hudaa wa-yattabiʻ g̣ayra sabeelil Muʹmineena nuwallihee maa- tawallaa wa-nuṣlihee Jahannam: wa-saaaʹat maṣeeraa!
మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసిన పిదప కూడా, ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గం గాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో! అతడు అవలంబించిన త్రోవ వైపునకే, అతనిని మరల్చుతాము మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం.[1]
-
4:116
إِنَّ ٱللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِۦ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ ۚ وَمَن يُشْرِكْ بِٱللَّهِ فَقَدْ ضَلَّ ضَلَـٰلًۢا بَعِيدًا
ʹInnal laaha laa- yag̣firu ʹañy yushraka bihee wayag̣firu maa- doona ẓaalika limañy yashaaaʹ. Wa-mañy yushrik billaahi faq̣ad ḍalla ḍalaalam baʻeedaa.
నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!
-
4:117
إِن يَدْعُونَ مِن دُونِهِۦٓ إِلَّآ إِنَـٰثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَـٰنًا مَّرِيدًا
ʹIñy yadʻoona miñ doonihee ʹillaaa ʹinaas̤aa: wa-ʹiñy yadʻoona ʹillaa Shayṭaanam mareedaa.
ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు[1]. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షైతాన్ నే ప్రార్థిస్తున్నారు. [2]
-
4:118
لَّعَنَهُ ٱللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا
Laʻanahul laah. Wa-q̣aala laʹattakhiẓanna min ʻibaadika naṣeebam mafrooḍaa;
అల్లాహ్ అతన్ని శపించాడు (బహిష్కరించాడు). మరియు అతడు (షైతాన్) ఇలా అన్నాడు: "నేను నిశ్చయంగా, నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను."
-
4:119
وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَـَٔامُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ ءَاذَانَ ٱلْأَنْعَـٰمِ وَلَـَٔامُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ ٱللَّهِ ۚ وَمَن يَتَّخِذِ ٱلشَّيْطَـٰنَ وَلِيًّا مِّن دُونِ ٱللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا
Wa-laʹuḍillannahum wa-laʹumanni-yannahum wa-la-aamurannahum falayubattikunna ʹaaẓaanal ʹanʻaami wa-laʹaamurannahum falayug̣ayeerunna khalq̣al laah. Wa-mañy yattakhiẓish Shayṭaana waliyyam miñ doonil laahi faq̣ad khasira khusraanam mubeenaa.
"మరియు నిశ్చయంగా, నేను వారిని మార్గభ్రష్టులుగా చేస్తాను; మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు.[1] మరియు ఎవడు అల్లాహ్ కు బదులుగా షైతాన్ ను తన రక్షకునిగా చేసుకుంటాడో! వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయిన వాడు!
-
4:120
يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ ٱلشَّيْطَـٰنُ إِلَّا غُرُورًا
Yaʻiduhum wa-yuman-neehim; wa-maa yaʻiduhumush Shayṭaanu ʹillaa g̣urooraa.
అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే.
-
4:121
أُو۟لَـٰٓئِكَ مَأْوَىٰهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا
ʹUlaaaʹika maʹwaahum jahannamu wa-laa yajidoona ʻanhaa maḥeeṣaa.
అలాంటి వారి ఆశ్రయం నరకమే; మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు.
-
4:122
وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ سَنُدْخِلُهُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۖ وَعْدَ ٱللَّهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ ٱللَّهِ قِيلًا
Wallaẓeena ʹaamanoo wa-ʻamiluṣ ṣaalihaati sanudkhiluhum Jannaatiñ tajree miñ taḥtihal ʹanhaaru khaalideena fihaaa ʹabadaa. Waʻdal laahi ḥaq̣q̣aa: wa-man ʹaṣdaq̣u minal laahi q̣eelaa?
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము; అందులో వారు శాశ్వతంగా కలకాల ముంటారు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. మరియు పలుకులలో అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు?
-
4:123
لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَآ أَمَانِىِّ أَهْلِ ٱلْكِتَـٰبِ ۗ مَن يَعْمَلْ سُوٓءًا يُجْزَ بِهِۦ وَلَا يَجِدْ لَهُۥ مِن دُونِ ٱللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
Laysa biʹamaaniyyikum wa-laaa ʹamaaniyyi ʹAhlil Kitaab. Mañy yaʻmal soooʹañy yujza bihee wa-laa yajid lahoo miñ doonil laahi waliyyañw walaa naṣeeraa.
మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది; మరియు వాడు, అల్లాహ్ తప్ప మరొక రక్షకుడిని గానీ, సహాయకుడిని గానీ పొందలేడు!
-
4:124
وَمَن يَعْمَلْ مِنَ ٱلصَّـٰلِحَـٰتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُو۟لَـٰٓئِكَ يَدْخُلُونَ ٱلْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا
Wa-mañy yaʻmal minaṣ ṣaaliḥaati miñ ẓakarin ʹaw ʹuñs̤aa wa-huwa Muʹminuñ faʹulaaaʹika yadkhuloonal jannata wa-laa yuz̤̣lamoona naq̣eeraa.
మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.
-
4:125
وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُۥ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَٱتَّبَعَ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا ۗ وَٱتَّخَذَ ٱللَّهُ إِبْرَٰهِيمَ خَلِيلًا
wa-man ʹaḥsanu deenam mimman ʹaslama wajhahoo lillaahi wa-huwa Muḥsinuñw wattabaʻa Millata ʹIbraaheema Ḥaneefaa? Wattakhaẓal laahu ʹIbraaheema khaleelaa.
మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? [1] మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.
-
4:126
وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَىْءٍ مُّحِيطًا
Walillaahi maa- fis samaawaati wa-maa fil ʹarḍ: wa-kaanal laahu bikulli shayʹim Muḥeeṭaa.
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు.
-
4:127
وَيَسْتَفْتُونَكَ فِى ٱلنِّسَآءِ ۖ قُلِ ٱللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِى ٱلْكِتَـٰبِ فِى يَتَـٰمَى ٱلنِّسَآءِ ٱلَّـٰتِى لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلْوِلْدَٰنِ وَأَن تَقُومُوا۟ لِلْيَتَـٰمَىٰ بِٱلْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا۟ مِنْ خَيْرٍ فَإِنَّ ٱللَّهَ كَانَ بِهِۦ عَلِيمًا
Wa-yastaftoonaka fin nisaaaʹ. Q̣ulil laahu yufteekum feehinna wa-maa yutlaa ʻalaykum fil Kitaabi fee yataaman Nisaaaʹil laatee laa- tuʹtoonahunna maa- kutiba lahunna wa-targ̣aboona ʹañ tañkiḥoohunna wal-mustaḍʻa-feena minal wildaani wa-ʹañ taq̣oomoo lilyataamaa bilq̣isṭ. Wa-maa tafʻaloo min khayriñ faʹinnal laaha kaana bihee ʻAleemaa.
మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: 'అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.'[1] మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది."
-
4:128
وَإِنِ ٱمْرَأَةٌ خَافَتْ مِنۢ بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَآ أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَٱلصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ ٱلْأَنفُسُ ٱلشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا۟ وَتَتَّقُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
Wa-ʹinim raʹatun khaafat mim baʻlihaa nushoozan ʹaw ʹiʻraaḍañ falaa junaaḥa ʻalayhimaaa ʹañy yuṣliḥaa baynahumaa ṣulḥaa waṣ-Ṣulhu khayr; wa-ʹuḥḍiratil ʹañfusush shuḥḥ. Wa-ʹiñ tuḥsinoo wa-tattaq̣oo faʹinnal laaha kaana bimaa taʻmaloona Khabeeraa.
మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.
-
4:129
وَلَن تَسْتَطِيعُوٓا۟ أَن تَعْدِلُوا۟ بَيْنَ ٱلنِّسَآءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا۟ كُلَّ ٱلْمَيْلِ فَتَذَرُوهَا كَٱلْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا۟ وَتَتَّقُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
Wa-lañ tastaṭeeʻooo ʹañ taʻdiloo baynan Nisaaaʹi wa-law ḥaraṣtum falaa tameeloo kullal mayli fataẓaroohaa kalmuʻal-laq̣ah. Wa-ʹiñ tuṣliḥoo wa-tattaq̣oo faʹinnal laaha kaana G̣afoorar Raḥeemaa.
మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరి జేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
-
4:130
وَإِن يَتَفَرَّقَا يُغْنِ ٱللَّهُ كُلًّا مِّن سَعَتِهِۦ ۚ وَكَانَ ٱللَّهُ وَٰسِعًا حَكِيمًا
Wa-ʹiñy yatafarraq̣aa yug̣nil laahu kullam miñ saʻatih: wa-kaanal laahu Waasiʻan Ḥakeemaa.
కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృద్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్! సర్వవ్యాప్తి (సర్వోపగతుడు), మహా వివేచనాపరుడు.
-
4:131
وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ ٱتَّقُوا۟ ٱللَّهَ ۚ وَإِن تَكْفُرُوا۟ فَإِنَّ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ غَنِيًّا حَمِيدًا
Walillaahi maa- fis samaawaati wa-maa fil ʹarḍ. Wa-laq̣ad waṣṣaynal laẓeena ʹootul Kitaaba miñ q̣ablikum wa-ʹiyyaakum ʹanit taq̣ul laah. Wa-ʹin takfuroo faʹinna lillaahi maa- fis samaawaati wa-maa fil ʹarḍ; wa-kaanal laahu G̣aniyyan Ḥameedaa.
మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.
-
4:132
وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا
Walillaahi maa- fis samaawaati wa-maa fil ʹarḍ: wakafaa billaahi Wakeelaa.
మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు!
-
4:133
إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا ٱلنَّاسُ وَيَأْتِ بِـَٔاخَرِينَ ۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا
ʹIñy yashaʹ yuẓhibkum ʹay-yuhan naasu wa-yaʹti biʹaakhareen; wa-kaanal laahu ʻalaa ẓaalika Q̣adeeraa.
ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ ఇలా చేయగల సమర్ధుడు.[1]
-
4:134
مَّن كَانَ يُرِيدُ ثَوَابَ ٱلدُّنْيَا فَعِندَ ٱللَّهِ ثَوَابُ ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ ۚ وَكَانَ ٱللَّهُ سَمِيعًۢا بَصِيرًا
Mañ kaana yureedu s̤awaabad dunyaa faʻiñdal laahi s̤awaabud dunyaa wal-ʹAakhirah: wa-kaanal laahu Sameeʻam Baṣeeraa.
ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో, (వానికదే దొరుకుతుంది). కాని (కేవలం) అల్లాహ్ వద్దనే ఇహలోక మరియు పరలోక ఫలితాలున్నాయి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
-
4:135
۞ يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُونُوا۟ قَوَّٰمِينَ بِٱلْقِسْطِ شُهَدَآءَ لِلَّهِ وَلَوْ عَلَىٰٓ أَنفُسِكُمْ أَوِ ٱلْوَٰلِدَيْنِ وَٱلْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَٱللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا۟ ٱلْهَوَىٰٓ أَن تَعْدِلُوا۟ ۚ وَإِن تَلْوُۥٓا۟ أَوْ تُعْرِضُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
Yaaa-ʹayyuhal laaẓeena ʹaamanoo koonoo q̣awwaameena bilq̣isṭi shuhadaaaʹa lillaahi wa-law ʻalaaa ʹañfusikum ʹawil waalidayni wal-ʹaq̣rabeen, ʹiñy yakun g̣aniyyan ʹaw faq̣eeran fallaahu awlaa bihimaa. Falaa tattabiʻul hawaaa ʹañ taʻdiloo. wa-ʹiñ talwooo ʹaw tuʻriḍoo faʹinnal laaha kaana bimaa taʻmaloona Khabeeraa.
ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు.[1] మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.
-
4:136
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ ءَامِنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلْكِتَـٰبِ ٱلَّذِى نَزَّلَ عَلَىٰ رَسُولِهِۦ وَٱلْكِتَـٰبِ ٱلَّذِىٓ أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِٱللَّهِ وَمَلَـٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ فَقَدْ ضَلَّ ضَلَـٰلًۢا بَعِيدًا
Yaaaʹayyuhal laẓeena ʹaamanooo ʹaaminoo billaahi wa-Rasoolihee wal-Kitaabil laẓee nazzala ʻalaa Rasoolihee wal-Kitaabil laẓeee ʹañzala miñ q̣abl. Wa-mañy yakfur billaahi wa-malaaaʹikatihee wa-Kutubihee wa-Rusulihee wal-Yawmil ʹAakhiri faq̣ad ḍalla ḍalaalam baʹeedaa.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి.[1] అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!
-
4:137
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ ثُمَّ كَفَرُوا۟ ثُمَّ ءَامَنُوا۟ ثُمَّ كَفَرُوا۟ ثُمَّ ٱزْدَادُوا۟ كُفْرًا لَّمْ يَكُنِ ٱللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًۢا
ʹInnal laẓeena ʹaamanoo s̤umma kafaroo s̤umma ʹaamanoo s̤umma kafaroo s̤ummaz daadoo kufral lam yakunil laahu liyag̣fira lahum wa-laa liyahdiyahum Sabeelaa.
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు!
-
4:138
بَشِّرِ ٱلْمُنَـٰفِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
Bashshiril Munaafiq̣eena biʹanna lahum ʻaẓaaban ʹaleemaa;―
కపట విశ్వాసులకు, నిశ్చయంగా! బాధాకరమైన శిక్ష ఉందని తెలుపు.
-
4:139
ٱلَّذِينَ يَتَّخِذُونَ ٱلْكَـٰفِرِينَ أَوْلِيَآءَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ ٱلْعِزَّةَ فَإِنَّ ٱلْعِزَّةَ لِلَّهِ جَمِيعًا
ʹAllaẓeena yattakhiẓoonal kaafireena ʹawliyaaaʹa miñ doonil Muʹmineen: ʹa-yabtag̣oona ʻiñdahumul ʻizzata faʹinnal ʻizzata lillaahi jameeʻaa?
ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారో! అలాంటి వారు, వారి (అవిశ్వాసుల) నుండి, గౌరవాన్ని పొందగోరు తున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్ కే చెందినది.[1]
-
4:140
وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِى ٱلْكِتَـٰبِ أَنْ إِذَا سَمِعْتُمْ ءَايَـٰتِ ٱللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا۟ مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا۟ فِى حَدِيثٍ غَيْرِهِۦٓ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ ٱللَّهَ جَامِعُ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْكَـٰفِرِينَ فِى جَهَنَّمَ جَمِيعًا
Wa-q̣ad nazzala ʻalaykum fil Kitaabi ʹan ʹiẓaa samiʻtum ʹAayaatil laahi yukfaru bihaa wa-yustahzaʹu bihaa falaa taq̣ʻudoo maʻahum ḥattaa yakhooḍoo fee ḥadees̤in g̣ayrih. Innakum ʹiẓam mis̤luhum. ʹInnal laha jaamiʻul Munaafiq̣eena wal-kaafireena fee jahannama jameeʻaa;―
మరియు వాస్తవానికి, (అల్లాహ్) మీ కొరకు ఈ గ్రంథంలో (ఈ విధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: "ఒకవేళ మీరు అల్లాహ్ సూక్తులను గురించి తిరస్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసేవారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!" అలా చేస్తే నిశ్చయంగా, మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు.
-
4:141
ٱلَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ ٱللَّهِ قَالُوٓا۟ أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَـٰفِرِينَ نَصِيبٌ قَالُوٓا۟ أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ ٱلْمُؤْمِنِينَ ۚ فَٱللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ وَلَن يَجْعَلَ ٱللَّهُ لِلْكَـٰفِرِينَ عَلَى ٱلْمُؤْمِنِينَ سَبِيلًا
ʹAllaẓeena yatarabbaṣoona bikum: faʹiñ kaana lakum fatḥum minal laahi q̣aalooo ʹalam nakum maʻakum? Wa-ʹiñ kaana lilkaafireena naṣeebuñ q̣aalooo ʹalam nastaḥwiẓ ʻalaykum wa-namnaʻkum minal Muʹmineen? Fallaahu yaḥkumu baynakum Yawmal Q̣iyaamah. Wa-lañy yajʻalal laahu lilkaafireena ʻalal Muʹmineena sabeelaa.
వారు (కపట విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: "ఏమీ? మేము మీతో కలిసి లేమా?" కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: "ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?" కాని అల్లాహ్ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్! ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గం చూపడు.[1]
-
4:142
إِنَّ ٱلْمُنَـٰفِقِينَ يُخَـٰدِعُونَ ٱللَّهَ وَهُوَ خَـٰدِعُهُمْ وَإِذَا قَامُوٓا۟ إِلَى ٱلصَّلَوٰةِ قَامُوا۟ كُسَالَىٰ يُرَآءُونَ ٱلنَّاسَ وَلَا يَذْكُرُونَ ٱللَّهَ إِلَّا قَلِيلًا
ʹInnal Munaafiq̣eena yukhaadiʻoonal laaha wa-Huwa khaadiʻuhum. Wa-ʹiẓaa q̣aamooo ʹilaṣ Ṣalaati q̣aamoo kusaalaa yuraaaʹoonan naasa wa-laa yaẓkuroonal laaha ʹillaa q̣aleelaa;
నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు.[1] మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు.[2] మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!
-
4:143
مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَآ إِلَىٰ هَـٰٓؤُلَآءِ وَلَآ إِلَىٰ هَـٰٓؤُلَآءِ ۚ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ سَبِيلًا
Muẓabẓabeena bayna ẓaalika, Laaa ʹilaa haaaʹulaaaʹi wa-laaa ʹilaa haaaʹulaaaʹ. Wa-mañy yuḍlilil laahu falañ tajida lahoo Sabeelaa.
వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు.[1]
-
4:144
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوا۟ ٱلْكَـٰفِرِينَ أَوْلِيَآءَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا۟ لِلَّهِ عَلَيْكُمْ سُلْطَـٰنًا مُّبِينًا
Yaaaʹayoohal laẓeena ʹaamanoo laa- tattakhiẓul kaafireena ʹawliyaaaʹa miñ doonil Muʹmineen. Atureedoona ʹañ tajʻaloo lillaahi ʻalaykum sulṭaanam mubeenaa?
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా?
-
4:145
إِنَّ ٱلْمُنَـٰفِقِينَ فِى ٱلدَّرْكِ ٱلْأَسْفَلِ مِنَ ٱلنَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا
ʹInnal Munaafiq̣eena fid darkil ʹasfali minan naar: wa-lan tajida lahum naṣeeraa;
నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు.[1] మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.
-
4:146
إِلَّا ٱلَّذِينَ تَابُوا۟ وَأَصْلَحُوا۟ وَٱعْتَصَمُوا۟ بِٱللَّهِ وَأَخْلَصُوا۟ دِينَهُمْ لِلَّهِ فَأُو۟لَـٰٓئِكَ مَعَ ٱلْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ ٱللَّهُ ٱلْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا
ʹIllal laẓeena taaboo wa-ʹaṣlaḥoo waʻtaṣamoo billaahi wa-ʹakhlaṣoo deenahum lillaahi faʹulaaaʹika maʻal Muʹmineen. Wa-sawfa yuʹtil laahul Muʹmineena ʹajran ʻaz̤̣eemaa.
కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు.[1] మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు.
-
4:147
مَّا يَفْعَلُ ٱللَّهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَءَامَنتُمْ ۚ وَكَانَ ٱللَّهُ شَاكِرًا عَلِيمًا
Maa- yafʻalul laahu biʻaẓaabikum ʹiñ shakartum wa-ʹaamañtum? Wa-kaanal laahu Shaakiran ʻAleema.
మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు,[1] సర్వజ్ఞుడు.