Back to Quran

జుజ్

Juz 12

11:6 ... 12:52 · 170 ayahs

అనువాదకుడు Maulana Abder Rahim Ibn Muhammad

  1. Surah HudBegins here at 11:6

  2. 11:6

    ۞ وَمَا مِن دَآبَّةٍ فِى ٱلْأَرْضِ إِلَّا عَلَى ٱللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِى كِتَـٰبٍ مُّبِينٍ

    Wa-maa miñ daaabbatiñ fil ʹarḍi ʹillaa ʻalal laahi rizq̣uhaa wa-yaʻlamu mustaq̣arrahaa wa-mustawdaʻahaa: Kulluñ fee Kitaabim Mubeen.

    మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని నివాసం, నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు.[1] అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

  3. 11:7

    وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُۥ عَلَى ٱلْمَآءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِنۢ بَعْدِ ٱلْمَوْتِ لَيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ

    Wa-Huwal laẓee khalaq̣as samaawaati wal-ʹarḍa fee Sittati ʹayyaamiñw Wakaana ʻArshuhoo ʻalal Maaaʹi liyabluwakum ʹayyukum ʹaḥsanu ʻamalaa. Wa-laʹiñ q̣ulta ʹinnakum mabʻoos̤oona mim baʻdil mawti layaq̣oolannal laẓeena kafarooo ʹin haaẓaaa ʹillaa siḥrum mubeen!

    మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం (అర్ష్) నీటి మీద ఉండెను. మీలో మంచిపనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి (ఆయన ఇదంతా సృష్టించాడు). నీవు వారితో: "నిశ్చయంగా, మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు తప్పక అంటారు: "ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే."

  4. 11:8

    وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ ٱلْعَذَابَ إِلَىٰٓ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُۥٓ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

    Wa-laʹin ʹakhkharnaa ʻanhumul ʻaẓaaba ʹilaaa ʹummatim maʻdoodatil layaq̣oolunna maa- yaḥbisuh? ʹAlaa yawma yaʹteehim laysa maṣroofan ʻanhum waḥaaq̣a bihim maa kaanoo bihee yastahziʹoon!

    మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం[1] వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది.

  5. 11:9

    وَلَئِنْ أَذَقْنَا ٱلْإِنسَـٰنَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَـٰهَا مِنْهُ إِنَّهُۥ لَيَـُٔوسٌ كَفُورٌ

    Wa-laʹin ʹaẓaq̣nal ʹiñsaana minnaa Raḥmatañ s̤umma nazaʻnaahaa minhu, ʹinnahoo layaʹoosuñ kafoor.

    మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా, అతడు నిరాశ చెంది, కృతఘ్నుడవుతాడు.

  6. 11:10

    وَلَئِنْ أَذَقْنَـٰهُ نَعْمَآءَ بَعْدَ ضَرَّآءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ ٱلسَّيِّـَٔاتُ عَنِّىٓ ۚ إِنَّهُۥ لَفَرِحٌ فَخُورٌ

    Wa-laʹin ʹaẓaq̣naahu naʻmaaaʹa baʻda ḍarraaaʹa massathu layaq̣oolanna ẓahabas sayyiʹaatu ʻannee: ʹinnahoo lafariḥuñ fakhoor.

    కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచి చూపిస్తే: "నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి!" అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో, విర్రవీగుతాడు.

  7. 11:11

    إِلَّا ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ أُو۟لَـٰٓئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ

    Illal laẓeena ṣabaroo wa-ʻamiluṣ ṣaaliḥaat: ʹulaaaʹika lahum mag̣firatuñw waʹajruñ Kabeer.

    కాని ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.[1]

  8. 11:12

    فَلَعَلَّكَ تَارِكٌۢ بَعْضَ مَا يُوحَىٰٓ إِلَيْكَ وَضَآئِقٌۢ بِهِۦ صَدْرُكَ أَن يَقُولُوا۟ لَوْلَآ أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَآءَ مَعَهُۥ مَلَكٌ ۚ إِنَّمَآ أَنتَ نَذِيرٌ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ وَكِيلٌ

    Falaʻallaka taarikum baʻḍa maa- yooḥaaa ʹilayka wa-ḍaaaʹiq̣um bihee ṣadruka ʹañy yaq̣ooloo laaa-law ʹuñzila ʻalayhi kañzun ʹaw jaaaʹa maʻahoo malak? ʹInnamaaa ʹañta naẓeer! Wallaahu ʻalaa kulli shayʹiñw Wakeel!

    (ఓ ప్రవక్తా!) బహశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీ) లోని కొంత భాగాన్ని విడిచి పెట్టనున్నావేమో! మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమో! ఎందుకంటే, (సత్యతిరస్కారులు): "ఇతనిపై ఒక నిధి ఎందుకు దింప బడలేదు? లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు?" అని అంటున్నారని. నిశ్చయంగా, నీవైతే కేవలం హెచ్చరిక చేసే వాడవు మాత్రమే. మరియు అల్లాహ్ యే ప్రతిదాని కార్యసాధకుడు.[1]

  9. 11:13

    أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰهُ ۖ قُلْ فَأْتُوا۟ بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِۦ مُفْتَرَيَـٰتٍ وَٱدْعُوا۟ مَنِ ٱسْتَطَعْتُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمْ صَـٰدِقِينَ

    ʹAm yaq̣ooloonaf taraah. Q̣ul faʹtoo biʻashri Suwarim mis̤lihee muftarayaatiñw wadʻoo manis taṭaʻtum miñ doonil laahi ʹiñ kuñtum ṣaadiq̣een.

    లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"[1]

  10. 11:14

    فَإِلَّمْ يَسْتَجِيبُوا۟ لَكُمْ فَٱعْلَمُوٓا۟ أَنَّمَآ أُنزِلَ بِعِلْمِ ٱللَّهِ وَأَن لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ

    Faʹillam yastajeeboo lakum faʻlamooo annamaaa ʹuñzila biʻilmil laahi wa-ʹal laaa ʹilaaha ʹillaa Hoo! Fahal ʹañtum Muslimoon?

    ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక పోతే (సమాధాన మివ్వకపోతే) నిశ్చయంగా ఇది అల్లాహ్ జ్ఞానంతోనే అవతరింప జేయబడిందని తెలుసుకోండి. మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

  11. 11:15

    مَن كَانَ يُرِيدُ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَـٰلَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ

    Mañ kaana yureedul Ḥayaatad Dunyaa wa-zeenatahaa nuwaffi ʹilayhim ʹaʻmaalahum feehaa wa-hum feehaa laa- yubkhasoon.

    ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారి కెలాంటి లోపం జరుగదు.

  12. 11:16

    أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ لَيْسَ لَهُمْ فِى ٱلْـَٔاخِرَةِ إِلَّا ٱلنَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا۟ فِيهَا وَبَـٰطِلٌ مَّا كَانُوا۟ يَعْمَلُونَ

    ʹUlaaaʹikal laẓeena laysa lahum fil ʹAakhirati ʹillan Naar: Waḥabiṭa maa- ṣanaʻoo feehaa wa-baaṭilum maa kaanoo yaʻmaloon!

    అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో (ఈ లోకంలో) పాటు పడినదంతా వ్యర్థమయి పోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి.[1]

  13. 11:17

    أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِۦ وَيَتْلُوهُ شَاهِدٌ مِّنْهُ وَمِن قَبْلِهِۦ كِتَـٰبُ مُوسَىٰٓ إِمَامًا وَرَحْمَةً ۚ أُو۟لَـٰٓئِكَ يُؤْمِنُونَ بِهِۦ ۚ وَمَن يَكْفُرْ بِهِۦ مِنَ ٱلْأَحْزَابِ فَٱلنَّارُ مَوْعِدُهُۥ ۚ فَلَا تَكُ فِى مِرْيَةٍ مِّنْهُ ۚ إِنَّهُ ٱلْحَقُّ مِن رَّبِّكَ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يُؤْمِنُونَ

    ʹAfamañ kaa-na ʻalaa Bayyinatim mir Rabbihee wa-yatloohu Shaahidum minhu wa-miñ q̣ablihee Kitaabu Moosaaa ʹimaamañw Waraḥmah? ʹUlaaaʹika yuʹminoona bih. Wa-mañy yakfur bihee minal ʹAḥzaabi fan-naaru mawʻiduh. Falaa taku fee miryatim minh: ʹinnahul Ḥaq̣q̣u mir Rabbika wa-laakinna ʹaks̤aran naasi laa- yuʹminoon!

    ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్) సాక్ష్యం ఉందో![1] మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన, మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటి వాడు సత్యతిరస్కారులతో సమానుడా?) అలాంటి వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి[2] వాగ్దాన స్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు.[3]

  14. 11:18

    وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا ۚ أُو۟لَـٰٓئِكَ يُعْرَضُونَ عَلَىٰ رَبِّهِمْ وَيَقُولُ ٱلْأَشْهَـٰدُ هَـٰٓؤُلَآءِ ٱلَّذِينَ كَذَبُوا۟ عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّـٰلِمِينَ

    Wa-man ʹaz̤̣lamu mimmanif taraa ʻalal laahi kaẓibaa? ʹUlaaaʹika yuʻraḍoona ʻalaa Rabbihim wa-yaq̣oolul ʹashhaa Duhaaaʹulaaaʹil laẓeena kaẓaboo ʻalaa Rabbihim! ʹAlaa laʻnatul laahi ʻalaz̤̣ z̤̣aalimeen:

    మరియు అల్లాహ్ కు అబద్ధం అంటగట్టే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశ పెట్టబడతారు. అప్పుడు: "వీరే, తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు." అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా, అల్లాహ్ శాపం (బహిష్కారం) దుర్మార్గులపై ఉంటుంది.[1]

  15. 11:19

    ٱلَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِٱلْـَٔاخِرَةِ هُمْ كَـٰفِرُونَ

    ʹAllaẓeena yaṣuddoona ʻañ Sabeelil laahi wa-yabg̣oonahaa ʻiwajaa: wa-hum̃ bil ʹAakhiratihum kaafiroon!

    ఎవరు అల్లాహ్ మార్గం నుండి (ప్రజలను) అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటి వారు, వారే! పరలోక జీవితం ఉన్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు.[1]

  16. 11:20

    أُو۟لَـٰٓئِكَ لَمْ يَكُونُوا۟ مُعْجِزِينَ فِى ٱلْأَرْضِ وَمَا كَانَ لَهُم مِّن دُونِ ٱللَّهِ مِنْ أَوْلِيَآءَ ۘ يُضَـٰعَفُ لَهُمُ ٱلْعَذَابُ ۚ مَا كَانُوا۟ يَسْتَطِيعُونَ ٱلسَّمْعَ وَمَا كَانُوا۟ يُبْصِرُونَ

    ʹUlaaaʹika lam yakoonoo muʻjizeena fil ʹarḍi wa-maa kaana lahum miñ doonil laahi min ʹawliyaaaʹ! Yuḍaaʻafu lahumul ʻaẓaab! Maa- kaanoo yastaṭeeʻoonas samʻa wa-maa kaanoo yubṣiroon.

    అలాంటి వారు భూమిలో (అల్లాహ్ శిక్ష నుండి) తప్పించు కోలేరు. మరియు వారికి అల్లాహ్ తప్ప ఇతర సంరక్షకులు లేరు. వారి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. (ఇహలోకంలో వారు సత్యాన్ని) విన లేక పోయేవారు మరియు చూడలేక పోయేవారు.[1]

  17. 11:21

    أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

    ʹUlaaaʹikal laẓeena khasirooo ʹañfusahum wa-ḍalla ʻanhum maa kaanoo yaftaroon!

    అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని వీడి పోతాయి.[1]

  18. 11:22

    لَا جَرَمَ أَنَّهُمْ فِى ٱلْـَٔاخِرَةِ هُمُ ٱلْأَخْسَرُونَ

    Laa- jarama ʹannahum fil ʹAakhirati humul ʹakhsaroon!

    నిస్సందేహంగా పరలోక జీవితంలో వీరే అత్యధికంగా నష్టపోయేవారు.

  19. 11:23

    إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَأَخْبَتُوٓا۟ إِلَىٰ رَبِّهِمْ أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَـٰلِدُونَ

    ʹInnal laẓeena ʹaamanoo wa-ʻamiluṣ ṣaaliḥaati wa-ʹakhbatooo ʹilaa Rabbihim ʹulaaaʹika ʹAṣḥaabul Jannah, hum feehaa khaalidoon!

    నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమై పోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలోనే శాశ్వతంగా ఉంటారు.

  20. 11:24

    ۞ مَثَلُ ٱلْفَرِيقَيْنِ كَٱلْأَعْمَىٰ وَٱلْأَصَمِّ وَٱلْبَصِيرِ وَٱلسَّمِيعِ ۚ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ أَفَلَا تَذَكَّرُونَ

    Mas̤alul fareeq̣ayni kal-ʹaʻmaa wal-ʹaṣammi walbaṣeeri wassameeʻ. Hal yastawiyaani mas̤alaa? ʹAfalaa taẓakkaroon?

    ఈ ఉభయ పక్షాల వారిని, ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు! ఏమీ? పోలికలో వీరిరువురూ సమానులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా?[1]

  21. 11:25

    وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ إِنِّى لَكُمْ نَذِيرٌ مُّبِينٌ

    Wa-laq̣ad ʹarsalnaa Nooḥan ʹilaa Q̣awmih: ʹinnee lakum naẓeerum mubeen:

    మరియు వాస్తవానికి మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. (అతను వారితో అన్నాడు): "నిశ్చయంగా, నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే -

  22. 11:26

    أَن لَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ ۖ إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ

    ʹAl laa taʻbudooo ʹillal laah: ʹinneee ʹakhaafu ʻalaykum ʻAẓaaba Yawmin ʹAleem.

    మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని.[1] అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను."

  23. 11:27

    فَقَالَ ٱلْمَلَأُ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَوْمِهِۦ مَا نَرَىٰكَ إِلَّا بَشَرًا مِّثْلَنَا وَمَا نَرَىٰكَ ٱتَّبَعَكَ إِلَّا ٱلَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِىَ ٱلرَّأْىِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍۭ بَلْ نَظُنُّكُمْ كَـٰذِبِينَ

    Faq̣aalal Malaʹul laẓeena kafaroo miñ q̣awmihee maa- naraaka ʹillaa basharam mis̤lanaa wa-maa naraakat tabaʻaka ʹillal laẓeena hum ʹaraaẓilunaa baadiyar raʹy: wa-maa naraa lakum ʻalaynaa miñ faḍlim bal naz̤̣unnukum kaaẓibeen!

    అప్పుడు అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు: "నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప, నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు.[1] మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు.[2] మరియు మీలో మా కంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము." అని అన్నారు.

  24. 11:28

    قَالَ يَـٰقَوْمِ أَرَءَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَءَاتَىٰنِى رَحْمَةً مِّنْ عِندِهِۦ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنتُمْ لَهَا كَـٰرِهُونَ

    Q̣aala yaa-q̣awmi ʹaraʹaytum ʹiñ kuñtu ʻalaa Bayyinatim mir Rabbee wa-ʹaataanee Raḥmatam min ʻIñdihee faʻummiyat ʻalaykum? ʹAnulzimukumoohaa wa-ʹañtum lahaa kaarihoon?

    అతను (నూహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను (నిదర్శనాన్ని) అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించుకుంటున్నా, దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా?[1]

  25. 11:29

    وَيَـٰقَوْمِ لَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مَالًا ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَى ٱللَّهِ ۚ وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ ۚ إِنَّهُم مُّلَـٰقُوا۟ رَبِّهِمْ وَلَـٰكِنِّىٓ أَرَىٰكُمْ قَوْمًا تَجْهَلُونَ

    Wa-yaaq̣awmi laaa ʹasʹalukum ʻalayhi maalaa: ʹin ʹajriya ʹillaa ʻalal laahi wa-maaa ʹana biṭaaridil laẓeena ʹaamanoo: ʹinnahum mulaaq̣oo Rabbihim wa-laakinneee ʹaraakum q̣awmañ tajhaloon!

    "మరియు ఓ నా జాతి ప్రజలారా! నేను దాని కోసం మీ నుండి ధనాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గరనే ఉంది. మరియు నేను విశ్వసించిన వారిని త్రోసి వేయలేను.[1] నిశ్చయంగా, వారైతే తమ ప్రభువును కలుసుకుంటారు, కాని నిశ్చయంగా నేను మిమ్మల్ని మూఢ జనులుగా చూస్తున్నాను.

  26. 11:30

    وَيَـٰقَوْمِ مَن يَنصُرُنِى مِنَ ٱللَّهِ إِن طَرَدتُّهُمْ ۚ أَفَلَا تَذَكَّرُونَ

    Wa-yaaq̣awmi mañy yañṣurunee minal laahi ʹiñ ṭarattuhum? ʹAfalaa taẓakkaroon!

    "మరియు ఓ నాజాతి ప్రజలారా! ఒకవేళ నేను వారిని (విశ్వాసులను) గెంటి వేస్తే నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి, ఎవడు కాపాడ గలడు? ఏమీ? మీరిది గ్రహించలేరా?

  27. 11:31

    وَلَآ أَقُولُ لَكُمْ عِندِى خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعْلَمُ ٱلْغَيْبَ وَلَآ أَقُولُ إِنِّى مَلَكٌ وَلَآ أَقُولُ لِلَّذِينَ تَزْدَرِىٓ أَعْيُنُكُمْ لَن يُؤْتِيَهُمُ ٱللَّهُ خَيْرًا ۖ ٱللَّهُ أَعْلَمُ بِمَا فِىٓ أَنفُسِهِمْ ۖ إِنِّىٓ إِذًا لَّمِنَ ٱلظَّـٰلِمِينَ

    Wa-laaa ʹaq̣oolu lakum ʻiñdee khazaaaʹinul laahi wa-laaa ʹaʻlamul g̣ayba wa-laaa ʹaq̣oolu ʹinnee malakuñw walaaa ʹaq̣oolu lillaẓeena tazdareee ʹaʻyunukum lañy yuʹtiyahumul laahu khayraa: ʹAllaahu ʹaʻlamu bimaa feee ʹañfusihim: ʹinneee ʹiẓal laminaz̤̣ z̤̣aalimeen.

    "మరియు నా వద్ద నిధులు ఉన్నాయని గానీ మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ నేను మీతో అనటం లేదు; మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు[1] మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్ కు బాగా తెలుసు. అలా అయితే! నిశ్చయంగా, నేను దుర్మార్గులలో చేరిన వాడనే!"

  28. 11:32

    قَالُوا۟ يَـٰنُوحُ قَدْ جَـٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

    Q̣aaloo yaa-Nooḥu q̣ad jaadaltanaa faʹaks̤arta jidaalanaa faʹtinaa bimaa taʻidunaaa ʹiñ kuñta minaṣ ṣaadiq̣een?

    వారు అన్నారు: "ఓ నూహ్! నీవు మాతో వాదించావు, చాలా వాదించావు,[1] ఇక నీవు సత్యవంతుడవే అయితే నీవు భయపెట్టే దానిని (ఆ శిక్షను) మాపై దింపు!"

  29. 11:33

    قَالَ إِنَّمَا يَأْتِيكُم بِهِ ٱللَّهُ إِن شَآءَ وَمَآ أَنتُم بِمُعْجِزِينَ

    Q̣aala ʹinnamaa yaʹteekum̃ bihil laahu ʹiñ shaaʹa wa-maaa ʹañtum̃ bimuʻjizeen!

    అతను (నూహ్) అన్నాడు: "అల్లాహ్ కోరితే నిశ్చయంగా, దానిని (ఆ శిక్షను) మీ పైకి తెస్తాడు మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు!

  30. 11:34

    وَلَا يَنفَعُكُمْ نُصْحِىٓ إِنْ أَرَدتُّ أَنْ أَنصَحَ لَكُمْ إِن كَانَ ٱللَّهُ يُرِيدُ أَن يُغْوِيَكُمْ ۚ هُوَ رَبُّكُمْ وَإِلَيْهِ تُرْجَعُونَ

    Wa-laa yañfaʻukum nuṣḥeee ʹin ʹarattu ʹan ʹañṣaḥa lakum ʹiñ kaanal laahu yureedu ʹañy yug̣wiyakum: Huwa Rabbukum! wa-ʹilayhi turjaʻoon!

    ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచి పెట్టాలని కోరితే, నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంత కోరినా, నా సలహా మీకు లాభదాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయన వైపునకే మీరంతా మరలి పోవలసి ఉన్నది."

  31. 11:35

    أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰهُ ۖ قُلْ إِنِ ٱفْتَرَيْتُهُۥ فَعَلَىَّ إِجْرَامِى وَأَنَا۠ بَرِىٓءٌ مِّمَّا تُجْرِمُونَ

    ʹAm yaq̣ooloonaf taraah? Q̣ul ʹinif taraytuhoo faʻalayya ʹijraamee wa-ʹana bareeeʹum mimmaa tujrimoon!

    ఏమీ? వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు" అని అంటున్నారా? వారితో ఇలా అను: "నేను దీనిని కల్పిస్తే దాని పాపం నాపై ఉంటుంది మరియు మీరు చేసే పాపాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు."

  32. 11:36

    وَأُوحِىَ إِلَىٰ نُوحٍ أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا۟ يَفْعَلُونَ

    Wa-ʹooḥiya ʹilaa Nooḥin ʹannahu lañy yuʹmina miñ q̣awmika ʹillaa mañ q̣ad ʹaamana falaa tabtaʹis bimaa kaanoo yafʻaloon.

    మరియు నూహ్ కు ఇలా సందేశం (వహీ) పంపబడింది: " నిశ్చయంగా, నీ జాతి వారిలో ఇంత వరకు విశ్వసించిన వారు తప్ప ఇతరులెవ్వరూ విశ్వసించరు, కావున వారు చేసే కార్యాలకు నీవు చింతించకు!

  33. 11:37

    وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَـٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۚ إِنَّهُم مُّغْرَقُونَ

    Waṣnaʻil Fulka biʹaʻyuninaa wa-Waḥyinaa wa-laa tukhaaṭibnee fil laẓeena z̤̣alamoo: ʹinnahum mug̣raq̣oon.

    మరియు నీవు మా సమక్షంలో, మా సందేశానుసారంగా, ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా, వారు ముంచి వేయ బడతారు."

  34. 11:38

    وَيَصْنَعُ ٱلْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِّن قَوْمِهِۦ سَخِرُوا۟ مِنْهُ ۚ قَالَ إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

    Wa-yaṣnaʻul Fulk: wa-kullamaa marra ʻalayhi malaʹum miñ q̣awmihee sakhiroo minh. Q̣aala ʹiñ taskharoo minnaa faʹinnaa naskharu miñkum kamaa taskharoon!

    మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు, ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను (నూహ్) వారితో అనేవాడు: "ఇప్పుడు మీరు మాతో పరిహాసాలాడుతున్నారు, నిశ్చయంగా, మీరు పరిహాసాలాడినట్లే, మేము కూడా మీతో పరిహాసాలాడుతాము.

  35. 11:39

    فَسَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ

    Fasawfa taʻlamoona mañy yaʹteehi ʻAẓaabuñy yukhzeehi wa-yaḥillu ʻalayhi ʻaẓaabum muq̣eem:

    అవమానకరమైన శిక్ష ఎవరి పైకి వస్తుందో మరియు శాశ్వతమైన శిక్ష ఎవరిపై పడుతుందో త్వరలోనే మీరు తెలుసుకుంటారు."

  36. 11:40

    حَتَّىٰٓ إِذَا جَآءَ أَمْرُنَا وَفَارَ ٱلتَّنُّورُ قُلْنَا ٱحْمِلْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ ٱثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ ٱلْقَوْلُ وَمَنْ ءَامَنَ ۚ وَمَآ ءَامَنَ مَعَهُۥٓ إِلَّا قَلِيلٌ

    Ḥattaaa ʹiẓaa jaaaʹa ʹAmrunaa wa-faarat tannooru q̣ulnaḥ mil feehaa miñ kulliñ zawjaynis̤ nayni wa-ʹahlaka ʹillaa mañ sabaq̣a ʻalayhil Q̣awlu wa-man ʹaaman. Wa-maaa ʹaamana maʻahooo ʹillaa q̣aleel.

    చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి).[1] అప్పుడు మేము (నూహ్ తో) అన్నాము: "ప్రతి జాతి (పశువుల) నుండి రెండు (ఆడ మగ) జంటలను మరియు నీ కుటుంబం వారిని - ఇది వరకే సూచించబడిన వాడు తప్ప - మరియు విశ్వసించిన వారిని, అందరినీ దానిలోకి (నావలోకి) ఎక్కించుకో!" అతనిని విశ్వసించిన వారు కొందరు మాత్రమే.

  37. 11:41

    ۞ وَقَالَ ٱرْكَبُوا۟ فِيهَا بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ ۚ إِنَّ رَبِّى لَغَفُورٌ رَّحِيمٌ

    Wa-q̣aalar kaboo feeha bismil laahi majraihaa wa-mursaahaa! ʹInna Rabbee la-G̣afoorur Raḥeem!

    మరియు (నూహ్) అన్నాడు: "ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీని పయనం మరియు దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."

  38. 11:42

    وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ وَنَادَىٰ نُوحٌ ٱبْنَهُۥ وَكَانَ فِى مَعْزِلٍ يَـٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَـٰفِرِينَ

    Wa-hiya tajree bihim fee mawjiñ kaljibaal. Wa-naadaa Nooḥunib nahoo wa-kaana fee maʻziliñy yaa-bunay yarkam maʻanaa wa-laa takum maʻal Kaafireen!

    మరియు అది వారిని పర్వతాల వలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూహ్ (పడవ నుండి) దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ (అన్నాడు): "ఓ నా కుమారా! మాతో పాటు (ఓడలోకి) ఎక్కు అవిశ్వాసులలో కలిసిపోకు!"[1]

  39. 11:43

    قَالَ سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ ۚ قَالَ لَا عَاصِمَ ٱلْيَوْمَ مِنْ أَمْرِ ٱللَّهِ إِلَّا مَن رَّحِمَ ۚ وَحَالَ بَيْنَهُمَا ٱلْمَوْجُ فَكَانَ مِنَ ٱلْمُغْرَقِينَ

    Q̣aala saʹaaweee ʹilaa jabaliñy yaʻṣimunee minal maaaʹ. Q̣aala laa- ʻaaṣimal yawma min ʹAmril laahi ʹillaa mar raḥim! Waḥaala baynahumal mawju fakaana minal mug̣raq̣een.

    మరియు అతడు (కుమారుడు) అన్నాడు: "నేను ఒక కొండ పైకి ఎక్కి శరణు పొందుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది." (నూహ్) అన్నాడు: "ఈ రోజు అల్లాహ్ తీర్పుకు విరుద్ధంగా కాపాడేవాడు ఎవ్వడూ లేడు, ఆయన (అల్లాహ్) యే కరుణిస్తే తప్ప!" అప్పుడే వారి మధ్య ఒక కెరటం రాగా అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసి పోయాడు.

  40. 11:44

    وَقِيلَ يَـٰٓأَرْضُ ٱبْلَعِى مَآءَكِ وَيَـٰسَمَآءُ أَقْلِعِى وَغِيضَ ٱلْمَآءُ وَقُضِىَ ٱلْأَمْرُ وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ ۖ وَقِيلَ بُعْدًا لِّلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

    Wa-q̣eela yaaaʹarḍub laʻee maaaʹaki wa-yaasamaaaʹu ʹaq̣liʻee wa-g̣eeḍal maaaʹu wa-q̣uḍiyal ʹamru wastawat ʻalal joodiyyi wa-q̣eela buʻdal lilq̣awmiz̤̣ z̤̣aalimeen!

    ఆ తరువాత ఆజ్ఞ వచ్చింది: "ఓ భూమీ! నీ నీళ్ళను మ్రింగివేయి. ఓ ఆకాశమా! (కురవటం) ఆపి వేయి!" అప్పుడు నీరు (భూమిలోకి) ఇంకి పోయింది. (అల్లాహ్) తీర్పు నెరవేరింది. ఓడ జూదీ కొండ మీద ఆగింది.[1] మరియు అప్పుడు: "దుర్మార్గుల జాతివారు దూరమై (నాశనమై) పోయారు!" అని అనబడింది.

  41. 11:45

    وَنَادَىٰ نُوحٌ رَّبَّهُۥ فَقَالَ رَبِّ إِنَّ ٱبْنِى مِنْ أَهْلِى وَإِنَّ وَعْدَكَ ٱلْحَقُّ وَأَنتَ أَحْكَمُ ٱلْحَـٰكِمِينَ

    Wa-naadaa Nooḥur Rabbahoo faq̣aala Rabbi ʹinnab Nee min ʹahlee wa-ʹinna waʻdakal ḥaq̣q̣u wa-ʹAñta ʹaḥkamul Ḥaakimeen!

    మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు! నీ వాగ్దానం సత్యమైనది మరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి."

  42. 11:46

    قَالَ يَـٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ ۖ إِنَّهُۥ عَمَلٌ غَيْرُ صَـٰلِحٍ ۖ فَلَا تَسْـَٔلْنِ مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌ ۖ إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَـٰهِلِينَ

    Q̣aala yaa-Nooḥu ʹinnahoo laysa min ʹahlik: ʹinnahoo ʻamalun g̣ayru ṣaaliḥ. Falaa tasʹalni maa- laysa laka bihee ʻilm! ʹInneee ʹaʻiz̤̣uka ʹañ takoona minal jaahileen!

    ఆయన (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఓ నూహ్! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు.[1] నిశ్చయంగా, అతడి పనులు మంచివి కావు.[2] కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు.[3] అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను."

  43. 11:47

    قَالَ رَبِّ إِنِّىٓ أَعُوذُ بِكَ أَنْ أَسْـَٔلَكَ مَا لَيْسَ لِى بِهِۦ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِى وَتَرْحَمْنِىٓ أَكُن مِّنَ ٱلْخَـٰسِرِينَ

    Q̣aala Rabbi ʹinneee ʹaʻooẓu bika ʹan ʹasʹalaka maa- laysa lee bihee ʻilm. Wa-ʹillaa tag̣fir lee wa-tarḥamnee ʹakum minal khaasireen!

    నూహ్ ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించక పోతే, నన్ను కరణించక పోతే, నేను నష్టపోయిన వారిలో చేరుతాను."

  44. 11:48

    قِيلَ يَـٰنُوحُ ٱهْبِطْ بِسَلَـٰمٍ مِّنَّا وَبَرَكَـٰتٍ عَلَيْكَ وَعَلَىٰٓ أُمَمٍ مِّمَّن مَّعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ

    Q̣eela yaa-Nooḥuh biṭ bi-Salaamim minnaa wa-Barakaatin ʻalayka wa-ʻalaaa ʹUmamim mimmam maʻak: wa-ʹumamuñ sanumattiʻuhum s̤umma yamassuhum minnaa ʻaẓaabun ʹaleem.

    ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది: "ఓ నూహ్! నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో (ఓడ /జూదీ పర్వతం నుండి) దిగండి. వారిలోని కొన్ని సంఘాలకు మేము కొంతకాలం వరకు సుఖసంతోషాలను ప్రసాదించగలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది."

  45. 11:49

    تِلْكَ مِنْ أَنۢبَآءِ ٱلْغَيْبِ نُوحِيهَآ إِلَيْكَ ۖ مَا كُنتَ تَعْلَمُهَآ أَنتَ وَلَا قَوْمُكَ مِن قَبْلِ هَـٰذَا ۖ فَٱصْبِرْ ۖ إِنَّ ٱلْعَـٰقِبَةَ لِلْمُتَّقِينَ

    Tilka min ʹambaaaʹil g̣aybi nooḥeehaaa ʹilayk: maa- kuñta taʻlamuhaaa ʹañta wa-laa q̣awmuka miñ q̣abli haaẓaa. Faṣbir ʹinnal ʻAaq̣ibata lil-Muttaq̣een.

    (ఓ ప్రవక్తా!) ఇవి అగోచర విషయాలు. వాటిని మేము నీకు మా సందేశం (వహీ) ద్వారా తెలుపు తున్నాము. వాటిని నీవు గానీ, నీ జాతి వారు గానీ ఇంతకు పూర్వం ఎరుగరు. కనుక సహనం వహించు! నిశ్చయంగా, మంచి ఫలితం దైవభీతి గల వారికే లభిస్తుంది.[1]

  46. 11:50

    وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ

    Wa-ʹilaa ʻAadin ʹakhaahum Hoodaa. Q̣aala yaa-q̣awmiʻ budul laaha maa- lakum min ʹilaahin g̣ayruh. ʹIn ʹañtum ʹillaa muftaroon!

    మరియు ఆద్ జాతివారి దగ్గరికి వారి సహోదరుడు హూద్ ను పంపాము. అతను ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీరు కేవలం అబద్ధాలు కల్పిస్తున్నారు!

  47. 11:51

    يَـٰقَوْمِ لَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَى ٱلَّذِى فَطَرَنِىٓ ۚ أَفَلَا تَعْقِلُونَ

    Yaa-q̣awmi laaa ʹasʹalukum ʻalayhi ʹajraa. ʹIn ʹajriya ʹillaa ʻalal laẓee faṭaranee: ʹafalaa taʻq̣iloon?

    ఓ నా జాతి ప్రజలారా! (ఈ పనికి) నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం నన్ను సృజించిన ఆయన వద్దనే ఉంది. ఏమీ? మీరు బుద్దిని ఉపయోగించరా (అర్థం చేసుకోలేరా)?

  48. 11:52

    وَيَـٰقَوْمِ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا۟ مُجْرِمِينَ

    Wa-yaaq̣awmis tag̣firoo Rabbakum s̤umma toobooo ʹilayhi yursilis samaaaʹa ʻalaykum midraarañw wayazidkum q̣uwwatan ʹilaa q̣uwwatikum wa-laa tatawallaw mujrimeen!

    మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు క్షమాభిక్షను వేడుకోండి, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలండి, ఆయన మీ కొరకు ఆకాశం నుండి భారీ వర్షాలు కురిపిస్తాడు మరియు మీకు, మీ శక్తిపై మరింత శక్తిని ఇస్తాడు,[1] కావున మీరు నేరస్థులై వెనుదిరగకండి!"

  49. 11:53

    قَالُوا۟ يَـٰهُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِىٓ ءَالِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ

    Q̣aaloo yaa-Hoodu maa- jiʹtanaa bi-Bayyinatiñw wamaa naḥnu bitaarikeee ʹaalihatinaa ʻañ q̣awlika wa-maa naḥnu laka bi-Muʹmineen!

    వారు అన్నారు: "ఓ హూద్! నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకొని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము.

  50. 11:54

    إِن نَّقُولُ إِلَّا ٱعْتَرَىٰكَ بَعْضُ ءَالِهَتِنَا بِسُوٓءٍ ۗ قَالَ إِنِّىٓ أُشْهِدُ ٱللَّهَ وَٱشْهَدُوٓا۟ أَنِّى بَرِىٓءٌ مِّمَّا تُشْرِكُونَ

    ʹIn naq̣oolu ʹillaʻ taraaka baʻḍu ʹaalihatinaa bisoooʹ. Q̣aala ʹinneee ʹushhidul laaha washhadooo ʹannee bareeeʹum mimmaa tushrikoon.

    "మా దైవాలలో నుండి కొందరు నీకు కీడు కలిగించారు (నిన్ను పిచ్చికి గురి చేశారు) అని మాత్రమే మేము అనగలము!" అతను (హూద్) జవాబిచ్చాడు: "ఆయన (అల్లాహ్) తప్ప![1] మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా, నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి;

  51. 11:55

    مِن دُونِهِۦ ۖ فَكِيدُونِى جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ

    Miñ doonihee fakeedoonee jameeʻañ s̤umma laa- tuñz̤̣iroon.

    ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి.[1]

  52. 11:56

    إِنِّى تَوَكَّلْتُ عَلَى ٱللَّهِ رَبِّى وَرَبِّكُم ۚ مَّا مِن دَآبَّةٍ إِلَّا هُوَ ءَاخِذٌۢ بِنَاصِيَتِهَآ ۚ إِنَّ رَبِّى عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

    ʹInnee tawakkaltu ʻalal laahi Rabbee Wa-Rabbikum! Maa- miñ daaabbatin ʹillaa Huwa ʹaakhiẓum binaasiyatihaa. ʹInna Rabbee ʻalaa Ṣiraaṭim Mustaq̣eem.

    నిశ్చయంగా నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను! ఏ ప్రాణి జుట్టు కూడా ఆయన చేతిలో లేకుండా లేదు.[1] నిశ్చయంగా, నా ప్రభువే ఋజుమార్గంపై (సత్యంపై) ఉన్నాడు.

  53. 11:57

    فَإِن تَوَلَّوْا۟ فَقَدْ أَبْلَغْتُكُم مَّآ أُرْسِلْتُ بِهِۦٓ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّى قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُۥ شَيْـًٔا ۚ إِنَّ رَبِّى عَلَىٰ كُلِّ شَىْءٍ حَفِيظٌ

    Faʹiñ tawallaw faq̣ad ʹablag̣tukum maaa ʹursiltu biheee ʹilaykum. Wa-yastakhlifu Rabbee q̣awman g̣ayrakum, wa-laa taḍurroonahoo shayʹaa. ʹInna Rabbee ʻalaa kulli shayʹin Ḥafeez̤̣.

    "ఒకవేళ మీరు వెనుదిరిగితే (మీ ఇష్టం), వాస్తవానికి నేనైతే, నాకివ్వబడిన సందేశాన్ని మీకు అంద జేశాను. మరియు నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని మీకు వారసులుగా చేయగలడు మరియు మీరు ఆయనకు ఏ మాత్రం హాని చేయలేరు. నిశ్చయంగా, నా ప్రభువే ప్రతిదానికీ రక్షకుడు.[1]

  54. 11:58

    وَلَمَّا جَآءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَـٰهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

    Wa-lammaa jaaaʹa ʹamrunaa naj-jaynaa Hoodañw wallaẓeena ʹaamanoo maʻahoo bi-Raḥmatim minnaa: wa-najjaynaahum min ʻaẓaabin g̣aleez̤̣.

    మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు, మా కారుణ్యంతో హూద్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోరశిక్ష నుండి కాపాడాము![1]

  55. 11:59

    وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا۟ بِـَٔايَـٰتِ رَبِّهِمْ وَعَصَوْا۟ رُسُلَهُۥ وَٱتَّبَعُوٓا۟ أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ

    Wa-tilka ʻAaduñ jaḥadoo biʹAayaati Rabbihim wa-ʻaṣaw Rusulahoo wattabaʻooo ʹamra kulli jabbaarin ʻaneed.

    మరియు వీరే ఆద్ జాతివారు! వారు తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి (సత్య) విరోధి ఆజ్ఞలను అనుసరించారు![1]

  56. 11:60

    وَأُتْبِعُوا۟ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا لَعْنَةً وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ أَلَآ إِنَّ عَادًا كَفَرُوا۟ رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ

    Wa-ʹutbiʻoo fee haaẓihid dunyaa laʻnatañw wa-Yawmal Q̣iyaamah. ʹAlaaa ʹinna ʻAadañ kafaroo Rabbahum! ʹAlaa buʻdal liʻAadiñ Q̣awmi Hood!

    మరియు ఇహలోకంలో (అల్లాహ్) శాపం (బహిష్కారం) వారిని వెంబడింప జేయబడింది మరియు పునరుత్థాన దినమున కూడా (అల్లాహ్ శాపం వారిని వెంబడించగలదు).[1] వినండి! నిస్సందేహంగా, ఆద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా! హూద్ జాతి వారైన ఆద్ లు ఎలా (అల్లాహ్ కారుణ్యానికి) దూరమై పోయారో![2]

  57. 11:61

    ۞ وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَـٰلِحًا ۚ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥ ۖ هُوَ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَٱسْتَعْمَرَكُمْ فِيهَا فَٱسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ ۚ إِنَّ رَبِّى قَرِيبٌ مُّجِيبٌ

    Wa-ʹilaa S̤amooda ʹakhaahum Ṣaaliḥaa. Q̣aala yaa-q̣awmiʻ budul laaha maa- min lakum ʹilahin g̣ayruh. Huwa ʹañshaʹakum minal ʹarḍi wastaʻmarakum feehaa fastag̣firoohu s̤umma toobooo ʹilayh: ʹinna Rabbee Q̣areebum Mujeeb.

    ఇక సమూద్ వారి వద్దకు వారి సహోదరుడు సాలిహ్ ను పంపాము. అతను అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి,[1] దానిలో మిమ్మల్ని నివసింప జేశాడు.[2] కనుక మీరు ఆయన క్షమాభిక్ష వేడుకోండి, తరువాత ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. (మీ ప్రార్థనలకు) జవాబిస్తాడు."[3]

  58. 11:62

    قَالُوا۟ يَـٰصَـٰلِحُ قَدْ كُنتَ فِينَا مَرْجُوًّا قَبْلَ هَـٰذَآ ۖ أَتَنْهَىٰنَآ أَن نَّعْبُدَ مَا يَعْبُدُ ءَابَآؤُنَا وَإِنَّنَا لَفِى شَكٍّ مِّمَّا تَدْعُونَآ إِلَيْهِ مُرِيبٍ

    Q̣aaloo yaa-Ṣaaliḥu q̣ad kuñta feenaa marjuwwañ q̣abla haaẓaaa ʹatanhaanaaa ʹan naʻbuda maa- yaʻbudu ʹaabaaaʹunaa wa-ʹinnanaa lafee shakkim mimmaa tadʻoonaaa ʹilayhi mureeb.

    వారన్నారు: "ఓ సాలిహ్! ఇంతకు ముందు మేము నీపై ఆశలు పెట్టుకొని ఉన్నాము. ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధిస్తూ వచ్చిన వాటిని (దైవాలను) ఆరాధించకుండా, మమ్మల్ని ఆపదలచుకున్నావా? నీవు మాకు బోధించే (ధర్మం) విషయం గురించి వాస్తవంగా మాకు చాలా సందేహం ఉంది."

  59. 11:63

    قَالَ يَـٰقَوْمِ أَرَءَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَءَاتَىٰنِى مِنْهُ رَحْمَةً فَمَن يَنصُرُنِى مِنَ ٱللَّهِ إِنْ عَصَيْتُهُۥ ۖ فَمَا تَزِيدُونَنِى غَيْرَ تَخْسِيرٍ

    Q̣aala yaa-q̣awmi ʹaraʹaytum ʹiñ kuñtu ʻalaa Bayyinatim mir Rabbee wa-ʹaataanee minhu Raḥmatañ famañy yañṣurunee minal laahi ʹin ʻaṣaytuh? Famaa tazeedunanee g̣ayra takhseeer?

    (సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి సోదరులారా! ఏమీ? మీరు చూడరా (ఆలోచించరా)? నేను నా ప్రభువు యొక్క స్పష్టమైన (నిదర్శనంపై) ఉన్నాను. మరియు ఆయన నాకు తన కారణ్యాన్ని ప్రసాదించాడు. ఇక నేను ఆయన (అల్లాహ్) ఆజ్ఞను ఉల్లంఘిస్తే,[1] అల్లాహ్ కు విరుద్ధంగా నాకు ఎవడు సహాయ పడగలడు? మీరు నాకు నష్టం తప్ప మరేమీ అధికం చేయటం లేదు.

  60. 11:64

    وَيَـٰقَوْمِ هَـٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمْ ءَايَةً فَذَرُوهَا تَأْكُلْ فِىٓ أَرْضِ ٱللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ قَرِيبٌ

    Wa-yaaq̣awmi haaẓihee naaq̣atul laahi lakum ʹaayatañ faẓaroohaa taʹkul feee ʹarḍil laahi wa-laa tamassoohaa bisoooʹiñ fayaʹkhuẓakum ʻAẓaabuñ q̣areeb!

    "మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలి పెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు."[1]

  61. 11:65

    فَعَقَرُوهَا فَقَالَ تَمَتَّعُوا۟ فِى دَارِكُمْ ثَلَـٰثَةَ أَيَّامٍ ۖ ذَٰلِكَ وَعْدٌ غَيْرُ مَكْذُوبٍ

    Faʻaq̣aroohaa faq̣aala tamattaʻoo fee daarikum s̤alaas̤ata ʹay-yaam: ẓaalika waʻdun g̣ayru makẓoob!

    అయినా వారు దానిని, వెనుక కాలి మోకాలి నరం కోసి చంపారు. అప్పుడు అతను (సాలిహ్) వారితో అన్నాడు: "మీరు మీ ఇండ్లలో మూడు రోజులు మాత్రమే హాయిగా గడపండి. ఇదొక వాగ్దానం, ఇది అబద్ధం కాబోదు."

  62. 11:66

    فَلَمَّا جَآءَ أَمْرُنَا نَجَّيْنَا صَـٰلِحًا وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ بِرَحْمَةٍ مِّنَّا وَمِنْ خِزْىِ يَوْمِئِذٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ ٱلْقَوِىُّ ٱلْعَزِيزُ

    Falammaa jaaaʹa ʹAmrunaa najjaynaa Ṣaaliḥañw wal-laẓeena ʹaamanoo maʻahoo bi-Raḥmatim minnaa wa-min khizyi Yawmiʹiẓ. ʹInna Rabbaka Huwal Q̣awiyyul ʻAzeez.

    ఆ తరువాత మా ఆదేశం జారీ అయినప్పుడు, మేము సాలిహ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. వారిని ఆ దినపు అవమానం నుండి కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభువు! ఆయన మాత్రమే, మహా బలవంతుడు, సర్వ శక్తి సంపన్నుడు.

  63. 11:67

    وَأَخَذَ ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلصَّيْحَةُ فَأَصْبَحُوا۟ فِى دِيَـٰرِهِمْ جَـٰثِمِينَ

    Wa-ʹakhaẓal laẓeena z̤̣alamuṣ Ṣayḥatu faʹaṣbaḥoo fee diyaarihim jaas̤imeen.

    మరియు దుర్మార్గానికి పాల్పబడిన వారిపై ఒక పెద్ద అరుపు (ప్రేలుడు) పడి, వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడి పోయారు;[1]

  64. 11:68

    كَأَن لَّمْ يَغْنَوْا۟ فِيهَآ ۗ أَلَآ إِنَّ ثَمُودَا۟ كَفَرُوا۟ رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّثَمُودَ

    Kaʹal lam yag̣naw feehaa. ʹAlaaa ʹinna S̤amooda kafaroo Rabbahum! ʹAlaa buʻdal li-S̤amood.

    వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. చూడండి! వాస్తవానికి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. కాబట్టి చూశారా! సమూద్ వారెలా దూరమై పోయారో (నశించి పోయారో)!

  65. 11:69

    وَلَقَدْ جَآءَتْ رُسُلُنَآ إِبْرَٰهِيمَ بِٱلْبُشْرَىٰ قَالُوا۟ سَلَـٰمًا ۖ قَالَ سَلَـٰمٌ ۖ فَمَا لَبِثَ أَن جَآءَ بِعِجْلٍ حَنِيذٍ

    Wa-laq̣ad jaaaʹat Rusulunaaa ʹIbraaheema bilbushraa q̣aaloo Salaamaa! Q̣aala Salaamuñ famaa labis̤a ʹañ jaaaʻa ḥaneeẓ. biʻijlin

    మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకొని ఇబ్రాహీమ్ వద్దకు వచ్చారు. వారు అన్నారు: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అతను: "మీకూ శాంతి కలుగు గాక (సలాం)!" అని జవాబిచ్చాడు. తరువాత అతను అతి త్వరగా, వేపిన దూడను (వారి ఆతిథ్యానికి) తీసుకొని వచ్చాడు.

  66. 11:70

    فَلَمَّا رَءَآ أَيْدِيَهُمْ لَا تَصِلُ إِلَيْهِ نَكِرَهُمْ وَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۚ قَالُوا۟ لَا تَخَفْ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمِ لُوطٍ

    Falammaa raʹaaa ʹaydiyahum laa- taṣilu ʹilayhi nakirahum wa-ʹawjasa minhum kheefah. Q̣aaloo laa- takhaf ʹinnaaa ʹursilnaaa ʹilaa Q̣awmi Looṭ.

    కానీ వారి చేతులు దాని వైపు పోక పోవటం చూసి[1] వారిని గురించి అనుమానంలో పడ్డాడు మరియు వారి నుండి అపాయం కలుగు తుందేమోనని భయపడ్డాడు! వారన్నారు: "భయపడకు! వాస్తవానికి మేము లూత్ జాతి వైపునకు పంపబడినవారము (దూతలము)."[2]

  67. 11:71

    وَٱمْرَأَتُهُۥ قَآئِمَةٌ فَضَحِكَتْ فَبَشَّرْنَـٰهَا بِإِسْحَـٰقَ وَمِن وَرَآءِ إِسْحَـٰقَ يَعْقُوبَ

    Wamraʹatuhoo q̣aaaʹimatuñ faḍaḥikat fabashsharnaahaa biʹIsḥaaq̣a wa-miñw waraaaʹi ʹIs-ḥaaq̣a Yaʻq̣oob.

    అతని (ఇబ్రాహీమ్) భార్య (అక్కడే) నిలబడి ఉండెను; అప్పుడామె నవ్వింది; పిదప మేము ఆమెకు ఇస్ హాఖ్ యొక్క మరియు ఇస్ హాఖ్ తరువాత యఅఖూబ్ యొక్క శుభవార్తను ఇచ్చాము.[1]

  68. 11:72

    قَالَتْ يَـٰوَيْلَتَىٰٓ ءَأَلِدُ وَأَنَا۠ عَجُوزٌ وَهَـٰذَا بَعْلِى شَيْخًا ۖ إِنَّ هَـٰذَا لَشَىْءٌ عَجِيبٌ

    Q̣aalat yaa-waylataaa ʹaʹalidu wa-ʹana ʻajoozuñw Wahaaẓaa baʻlee shaykhaa? ʹInna haaẓaa lashayʹun ʻajeeb!

    ఆమె (ఆశ్చర్యంతో) అన్నది: "నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డ పుడతాడా? నేను ముసలిదానిని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. (అలా అయితే) నిశ్చయంగా, ఇది చాలా విచిత్రమైన విషయమే!"

  69. 11:73

    قَالُوٓا۟ أَتَعْجَبِينَ مِنْ أَمْرِ ٱللَّهِ ۖ رَحْمَتُ ٱللَّهِ وَبَرَكَـٰتُهُۥ عَلَيْكُمْ أَهْلَ ٱلْبَيْتِ ۚ إِنَّهُۥ حَمِيدٌ مَّجِيدٌ

    Q̣aalooo ʹataʻjabeena min ʹAmril laahi Raḥmatul laahi wa-Barakaatuhoo ʻalaykum ʹAhlal Bayt! ʹInnahoo Ḥameedum Majeed!

    వారన్నారు: "అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా![1] మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహత్వపూర్ణుడు.[2]

  70. 11:74

    فَلَمَّا ذَهَبَ عَنْ إِبْرَٰهِيمَ ٱلرَّوْعُ وَجَآءَتْهُ ٱلْبُشْرَىٰ يُجَـٰدِلُنَا فِى قَوْمِ لُوطٍ

    Falammaa ẓahaba ʻan ʹIbraaheemar rawʻu wa-jaaaʹat hul-bushraa yujaadilunaa fee Q̣awmi Looṭ.

    అప్పుడు ఇబ్రాహీమ్ భయం దూరమై, అతనికి (సంతానపు) శుభవార్త అందిన తరువాత, అతను లూత్ జాతి వారి కొరకు మాతో వాదించసాగాడు.[1]

  71. 11:75

    إِنَّ إِبْرَٰهِيمَ لَحَلِيمٌ أَوَّٰهٌ مُّنِيبٌ

    ʹInna ʹIbraaheema laḥaleemun ʹawwaahum muneeb.

    (ఎందుకంటే) వాస్తవానికి ఇబ్రాహీమ్ సహనశీలుడు, మృదు హృదయుడు (నమ్రతతో అల్లాహ్ ను అర్థించేవాడు) మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలేవాడు!

  72. 11:76

    يَـٰٓإِبْرَٰهِيمُ أَعْرِضْ عَنْ هَـٰذَآ ۖ إِنَّهُۥ قَدْ جَآءَ أَمْرُ رَبِّكَ ۖ وَإِنَّهُمْ ءَاتِيهِمْ عَذَابٌ غَيْرُ مَرْدُودٍ

    YaaaʹIbraaheemu ʹaʻriḍ ʻan haaẓaa. ʹInnahoo q̣ad jaaaʹa ʹamru Rabbik: wa-ʹinnahum ʹaateehim ʻaẓaabun g̣ayru mardood!

    (వారన్నారు): "ఓ ఇబ్రాహీమ్! దీనిని (నీ మధ్యవర్తిత్వాన్ని) మానుకో! నిశ్చయంగా, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చి వున్నది. మరియు నిశ్చయంగా, వారిపై ఆ శిక్ష పడటం తప్పదు; అది నివారించబడదు."

  73. 11:77

    وَلَمَّا جَآءَتْ رُسُلُنَا لُوطًا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَـٰذَا يَوْمٌ عَصِيبٌ

    Wa-lammaa jaaaʹat Rusulunaa Looṭañ seeeʹa bihim wa-ḍaaq̣a bihim ẓarʻañw waq̣aala haaẓaa yawmun ʻaṣeeb.

    మరియు మా దూతలు లూత్ వద్దకు వచ్చినపుడు, వారి రాకకు అతను, (వారిని కాపాడలేనని) దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగిపోయింది. అతను: "ఈ దినం చాలా ఆందోళనకరమైనది." అని వాపోయాడు.

  74. 11:78

    وَجَآءَهُۥ قَوْمُهُۥ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا۟ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ ۚ قَالَ يَـٰقَوْمِ هَـٰٓؤُلَآءِ بَنَاتِى هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَلَا تُخْزُونِ فِى ضَيْفِىٓ ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ

    Wa-jaaaʹahoo q̣awmuhoo yuhraʻoona ʹilayh. Wa-miñ q̣ablu kaanoo yaʻmaloonas sayyiʹaat. Q̣aala yaa-q̣awmi haaaʹulaaaʹi banaatee hunna ʹaṭharu lakum fattaq̣ul laaha wa-laa tukhzooni fee ḍayfee! ʹAlaysa miñkum rajulur rasheed?

    మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. అతను (లూత్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! ఇదిగో నా ఈ కుమార్తెలు (నా జాతి స్త్రీలు) ఉన్నారు.[1] వీరు మీ కొరకు చాలా శ్రేష్ఠమైన వారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమీ? మీలో ఒక్కడైనా నీతిపరుడు లేడా?" [2]

  75. 11:79

    قَالُوا۟ لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِى بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ

    Q̣aaloo laq̣ad ʻalimta maa- lanaa fee banaatika min ḥaq̣q̣: wa-ʹinnaka lataʻlamu maa- nureed!

    వారన్నారు: "నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా! మరియు నిశ్చయంగా, మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు!"

  76. 11:80

    قَالَ لَوْ أَنَّ لِى بِكُمْ قُوَّةً أَوْ ءَاوِىٓ إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

    Q̣aala law ʹanna lee bikum q̣uwwatan ʹaw aaweee ʹilaa rukniñ shadeed.

    అతను (లూత్) అన్నాడు: "మిమ్మల్ని ఎదుర్కొనే బలం నాకుంటే, లేక శరణు పొందటానికి పటిష్ఠమైన ఆధారమైనా ఉండి ఉంటే ఎంత బాగుండేది?"[1]

  77. 11:81

    قَالُوا۟ يَـٰلُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَن يَصِلُوٓا۟ إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ ٱلَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ إِلَّا ٱمْرَأَتَكَ ۖ إِنَّهُۥ مُصِيبُهَا مَآ أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ ٱلصُّبْحُ ۚ أَلَيْسَ ٱلصُّبْحُ بِقَرِيبٍ

    Q̣aaloo Yaa-Looṭu ʹinnaa Rusulu Rabbika lañy yaṣilooo ʹilayk: faʹasri biʹahlika biq̣iṭʻim minal layli wa-laa yaltafit miñkum ʹaḥadun ʹillam raʹatak: ʹinnahoo muṣeebuhaa maaa ʹaṣaabahum. ʹInna mawʻidahumuṣ ṣubḥ. ʹAlaysaṣ ṣubḥu biq̣areeb?

    వారు (దైవదూతలు) అన్నారు: "ఓ లూత్! నిశ్చయంగా మేము నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన దూతలము! వారు ఏ మాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు - నీ భార్య తప్ప - మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడగూడదు. నిశ్చయంగా, వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె (నీ భార్య) కూ సంభవిస్తుంది.[1] నిశ్చయంగా, వారి నిర్ణీత కాలం ఉదయపు సమయం. ఏమీ? ఉదయం సమీపంలోనే లేదా?

  78. 11:82

    فَلَمَّا جَآءَ أَمْرُنَا جَعَلْنَا عَـٰلِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِّن سِجِّيلٍ مَّنضُودٍ

    Falammaa jaaaʹa ʹamrunaa jaʻalnaa ʻaaliyahaa saafilahaa wa-ʹamṭarnaa ʻalayhaa ḥijaaratam miñ sijjeelim mañḍood,―

    మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.[1]

  79. 11:83

    مُّسَوَّمَةً عِندَ رَبِّكَ ۖ وَمَا هِىَ مِنَ ٱلظَّـٰلِمِينَ بِبَعِيدٍ

    Musawwamatan ʻiñda Rabbik: wa-maa hiya minaz̤̣ z̤̣aalimeena bibaʻeed!

    అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు.

  80. 11:84

    ۞ وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥ ۖ وَلَا تَنقُصُوا۟ ٱلْمِكْيَالَ وَٱلْمِيزَانَ ۚ إِنِّىٓ أَرَىٰكُم بِخَيْرٍ وَإِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُّحِيطٍ

    Wa-ʹilaa Madyana ʹakhaahum Shuʻaybaa: q̣aala yaa-q̣awmiʻ budul laaha maa- lakum min ʹilaahin g̣ayruh. Wa-laa tañq̣uṣul mikyaala walmeezaana ʹinneee ʹaraakum̃ bikhayriñw waʹinneee ʹakhaafu ʻalaykum ʻaẓaaba Yawmim Muḥeeṭ.

    ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము.[1] అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆరోజు చుట్టు ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను.

  81. 11:85

    وَيَـٰقَوْمِ أَوْفُوا۟ ٱلْمِكْيَالَ وَٱلْمِيزَانَ بِٱلْقِسْطِ ۖ وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

    Wayaaq̣awmi ʹawful mikyaala walmeezaana bilq̣isṭi wa-laa tabkhasun naasa ʹashyaaaʹahum wa-laa taʻs̤aw fil ʹarḍi mufsideen.

    "మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువ జేసి ఇవ్వకండి.[1] మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోల్లాన్ని వ్యాపింపజేయకండి.

  82. 11:86

    بَقِيَّتُ ٱللَّهِ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ۚ وَمَآ أَنَا۠ عَلَيْكُم بِحَفِيظٍ

    Baq̣eeyatul laahi khayrul lakum ʹiñ kuñtum Muʹmineen! Wa-maaa ʹana ʻalaykum̃ bi-Ḥafeez̤̣!

    "మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది.[1] మరియు నేను మీ రక్షకుడను కాను."[2]

  83. 11:87

    قَالُوا۟ يَـٰشُعَيْبُ أَصَلَوٰتُكَ تَأْمُرُكَ أَن نَّتْرُكَ مَا يَعْبُدُ ءَابَآؤُنَآ أَوْ أَن نَّفْعَلَ فِىٓ أَمْوَٰلِنَا مَا نَشَـٰٓؤُا۟ ۖ إِنَّكَ لَأَنتَ ٱلْحَلِيمُ ٱلرَّشِيدُ

    Q̣aaloo yaa-Shuʻaybu ʹaṣalaatuka taʹmuruka ʹan natruka maa- yaʻbudu ʹaabaaaʹunaaa ʹaw ʹan nafʻala feee ʹamwaalinaa maa- nashaaaʹ? ʹInnaka laʹañtal ḥaleemur Rasheed!

    వారు (వ్యంగంగా) అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదలిపెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయాలని, నీకు నీ నమాజ్ నేర్పుతుందా?[1] (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు!"[2]

  84. 11:88

    قَالَ يَـٰقَوْمِ أَرَءَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَرَزَقَنِى مِنْهُ رِزْقًا حَسَنًا ۚ وَمَآ أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَىٰ مَآ أَنْهَىٰكُمْ عَنْهُ ۚ إِنْ أُرِيدُ إِلَّا ٱلْإِصْلَـٰحَ مَا ٱسْتَطَعْتُ ۚ وَمَا تَوْفِيقِىٓ إِلَّا بِٱللَّهِ ۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ

    Q̣aala yaaq̣awmi ʹaraʹaytum ʹiñ kuñtu ʻalaa Bayyinatim mir Rabbee wa-razaq̣anee minhu rizq̣an ḥasanaa? Wa-maaa ʹureedu ʹan ʹukhaalifakum ʹilaa maaa ʹanhaakum ʻanh. ʹIn ʹureedu ʹillal ʹiṣlaaḥa mas taṭaʻt; wa-maa tawfeeq̣eee ʹillaa billaah. ʻAlayhi tawakkaltu wa-ʹilayhi ʹuneeb.

    అప్పుడు అతను (షుఐబ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా) ? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినపుడు (నేను ఇలా కాకుండా మరేమి అనగలను)? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయ దలచుకోలేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించ దలచుకున్నాను. నా కార్యసిద్ధి కేవలం అల్లాహ్ పైననే ఆధారపడి వుంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను.

  85. 11:89

    وَيَـٰقَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِىٓ أَن يُصِيبَكُم مِّثْلُ مَآ أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَـٰلِحٍ ۚ وَمَا قَوْمُ لُوطٍ مِّنكُم بِبَعِيدٍ

    Wa-yaaq̣awmi laa- yajrimannakum shiq̣aaq̣eee ʹañy yuṣeebakum mis̤lu maaa ʹaṣaaba q̣awma Nooḥin ʹaw q̣awma Hoodin ʹaw q̣awma Ṣaaliḥ: wa-maa q̣awmu Looṭim miñkum̃ bibaʻeed!

    "మరియు ఓ నా జాతి ప్రజలారా! నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూహ్ జాతి వారిపై, హూద్ జాతి వారిపై లేక సాలిహ్ జాతి వారిపై పడినటువంటి శిక్షకు గురి చేయకూడదు సుమా! మరియు లూత్ జాతివారు మీకు ఎంతో దూరం వారు కారు కదా![1]

  86. 11:90

    وَٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ ۚ إِنَّ رَبِّى رَحِيمٌ وَدُودٌ

    Wastag̣firoo Rabbakum s̤ummaa toobooo ʹilayh: ʹinna Rabbee Raḥeemuñw wadood.

    "మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు అపార కరుణా ప్రదాత, వాత్సల్యుడు."[1]

  87. 11:91

    قَالُوا۟ يَـٰشُعَيْبُ مَا نَفْقَهُ كَثِيرًا مِّمَّا تَقُولُ وَإِنَّا لَنَرَىٰكَ فِينَا ضَعِيفًا ۖ وَلَوْلَا رَهْطُكَ لَرَجَمْنَـٰكَ ۖ وَمَآ أَنتَ عَلَيْنَا بِعَزِيزٍ

    Q̣aaloo yaa-Shuʻaybu maa- nafq̣ahu kas̤eeram mimmaa taq̣oolu wa-ʹinnaa lanaraaka feenaa ḍaʻeefaa! Wa-lawlaa rahṭuka larajamnaak! Wa-maaa ʹañta ʻalaynaa biʻazeez!

    వారన్నారు: "ఓ షుఐబ్! నీవు చెప్పే మాటలు చాలా వరకు మేము గ్రహించ లేక పోతున్నాము.[1] మరియు నిశ్చయంగా, నీవు మాలో బలహీనుడివిగా పరిగణించ బడుతున్నావు. మరియు నీ కుటుంబం వారే గనక లేకుంటే! మేము నిశ్చయంగా, నిన్ను రాళ్ళు రువ్వి చంపేవారం. మరియు నీవు మా కంటే శక్తి శాలివి కావు."

  88. 11:92

    قَالَ يَـٰقَوْمِ أَرَهْطِىٓ أَعَزُّ عَلَيْكُم مِّنَ ٱللَّهِ وَٱتَّخَذْتُمُوهُ وَرَآءَكُمْ ظِهْرِيًّا ۖ إِنَّ رَبِّى بِمَا تَعْمَلُونَ مُحِيطٌ

    Q̣aala yaa-q̣awmi ʹarahṭeee ʹaʻazzu ʻalaykum minal laah? Wattakhaẓtumoohu waraaaʹakum z̤̣ihriyyaa. ʹInna Rabbee bimaa taʻmaloona Muḥeeṭ!

    అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? నా కుటుంబం మీకు అల్లాహ్ కంటే ఎక్కువ గౌరవనీయమైనదా? మరియు మీరు ఆయన (అల్లాహ్) ను మీ వీపుల వెనుకకు నెట్టుతారా? నిశ్చయంగా, నా ప్రభువు మీరు చేసే పనులను ఆవరించి ఉన్నాడు.

  89. 11:93

    وَيَـٰقَوْمِ ٱعْمَلُوا۟ عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّى عَـٰمِلٌ ۖ سَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَمَنْ هُوَ كَـٰذِبٌ ۖ وَٱرْتَقِبُوٓا۟ إِنِّى مَعَكُمْ رَقِيبٌ

    Wa-yaaq̣awmiʻ maloo ʻalaa makaanatikum ʹinnee ʻaamil: sawfa taʻlamoona mañy yaʹteehi ʻaẓaabuñy yukhzeehi wa-man huwa kaaẓib! Wartaq̣ibooo ʹinnee maʻakum raq̣eeb.

    "మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి, నిశ్చయంగా, (నా శక్తి మేరకు) నేను కూడా చేస్తాను. అవమాన కరమైన శిక్ష ఎవరికి పడుతుందో అసత్యవాది ఎవడో మీరు మున్ముందు తెలుసుకోగలరు. మరియు మీరు నిరీక్షించండి, నిశ్చయంగా, మీతో బాటు నేను కూడా నిరీక్షిస్తాను."

  90. 11:94

    وَلَمَّا جَآءَ أَمْرُنَا نَجَّيْنَا شُعَيْبًا وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ بِرَحْمَةٍ مِّنَّا وَأَخَذَتِ ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلصَّيْحَةُ فَأَصْبَحُوا۟ فِى دِيَـٰرِهِمْ جَـٰثِمِينَ

    Wa-lammaa jaaaʹa ʹamrunaa najjaynaa Shuʻaybañw wal-laẓeena ʹaamanoo maʻahoo bi-Raḥmatim minnaa wa-ʹakhaẓatil laẓeena z̤̣alamuṣ Ṣayhatu faʹaṣbaḥoo fee diyaarihim jaas̤imeen,―

    చివరకు మా ఆదేశం వచ్చినప్పుడు, మేము షుఐబ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. మరియు దుర్మార్గులైన వారిపై ఒక తీవ్రమైన అరుపు (ధ్వని) విరుచుకు పడింది. కాబట్టి వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడిపోయారు -

  91. 11:95

    كَأَن لَّمْ يَغْنَوْا۟ فِيهَآ ۗ أَلَا بُعْدًا لِّمَدْيَنَ كَمَا بَعِدَتْ ثَمُودُ

    Kaʹal lam yag̣naw feehaa! ʹAlaa buʻdal li-Madyana kamaa baʻidat S̤amood!

    వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు, మద్ యన్ జాతివారు కూడా లేకుండా (నశించి) పోయారు![1]

  92. 11:96

    وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِـَٔايَـٰتِنَا وَسُلْطَـٰنٍ مُّبِينٍ

    Wa-laq̣ad ʹarsalnaa Moosaa biʹAayaatinaa wa-sulṭaanim mubeen.

    మరియు నిశ్చయంగా, మేము మూసాను కూడా మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము -

  93. 11:97

    إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَٱتَّبَعُوٓا۟ أَمْرَ فِرْعَوْنَ ۖ وَمَآ أَمْرُ فِرْعَوْنَ بِرَشِيدٍ

    ʹIlaa firʻawna wa-malaʹihee fattabaʻooo ʹamra Firʻawna, wa-maaa ʹamru Firʻawna bi-Rasheed.

    ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు! కానీ వారు ఫిర్ఔన్ ఆజ్ఞలనే అనుసరించారు. మరియు ఫిర్ఔన్ ఆజ్ఞ సరైనది కాదు.

  94. 11:98

    يَقْدُمُ قَوْمَهُۥ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فَأَوْرَدَهُمُ ٱلنَّارَ ۖ وَبِئْسَ ٱلْوِرْدُ ٱلْمَوْرُودُ

    Yaq̣dumu q̣awmahoo Yawmal Q̣iyaamati faʹawradahumun Naar: wa-biʹsal wirdul mawrood!

    పునరుత్థాన దినమున అతడు (ఫిర్ఔన్) తన జాతి వారికి మున్ముందుగా ఉండి, వారిని నరకాగ్నిలోకి తీసుకొని పోతాడు మరియు అది ప్రవేశించే వారికి ఎంత చెడ్డ గమ్యస్థానం.

  95. 11:99

    وَأُتْبِعُوا۟ فِى هَـٰذِهِۦ لَعْنَةً وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ ۚ بِئْسَ ٱلرِّفْدُ ٱلْمَرْفُودُ

    Wa-ʹutbiʻoo fee haaẓihee laʻnatañw wa-Yawmal Q̣iyaamah: biʹsar rifdul marfood!

    మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుత్థాన దినమున కూడా (బహిష్కరించబడతారు). ఎంత చెడ్డ బహుమానం (వారికి) బహూకరించ బడుతుంది.

  96. 11:100

    ذَٰلِكَ مِنْ أَنۢبَآءِ ٱلْقُرَىٰ نَقُصُّهُۥ عَلَيْكَ ۖ مِنْهَا قَآئِمٌ وَحَصِيدٌ

    Ẓaalika min ʹambaaaʹil q̣uraa naq̣uṣṣuhoo ʻalayka minhaa q̣aaaʹimuñw waḥaṣeed.

    ఇవి కొన్ని (ప్రాచీన) పట్టణాల గాథలు వీటిని మేము నీకు వినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి (మిగిలి) ఉన్నాయి. మరికొన్ని పంటపొలాల మాదిరిగా కోయబడ్డాయి (నిర్మూలించబడ్డాయి).

  97. 11:101

    وَمَا ظَلَمْنَـٰهُمْ وَلَـٰكِن ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ ۖ فَمَآ أَغْنَتْ عَنْهُمْ ءَالِهَتُهُمُ ٱلَّتِى يَدْعُونَ مِن دُونِ ٱللَّهِ مِن شَىْءٍ لَّمَّا جَآءَ أَمْرُ رَبِّكَ ۖ وَمَا زَادُوهُمْ غَيْرَ تَتْبِيبٍ

    Wa-maa z̤̣alamnaahum wa-laakiñ z̤̣alamooo ʹañfusahum famaaa ʹag̣nat ʻanhum ʹaalihatuhumul latee yadʻoona miñ doonil laahi miñ shayʹil lammaa jaaaʹa ʹamru Rabbik: wa-maa zaadoohum g̣ayra tatbeeb!

    మరియు మేము వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఆజ్ఞ వచ్చినప్పుడు - అల్లాహ్ ను వదలి - వారు ఏ దేవతలనైతే ప్రార్థించేవారో! వారు, వారికి ఏ విధంగానూ సహాయపడ లేక పోయారు. మరియు వారు, వారి వినాశం తప్ప మరేమీ అధికం చేయలేదు.

  98. 11:102

    وَكَذَٰلِكَ أَخْذُ رَبِّكَ إِذَآ أَخَذَ ٱلْقُرَىٰ وَهِىَ ظَـٰلِمَةٌ ۚ إِنَّ أَخْذَهُۥٓ أَلِيمٌ شَدِيدٌ

    Wa-Kaẓaalika ʹakhẓu Rabbika ʹiẓaaa ʹakhaẓal q̣uraa wa-hiya z̤̣aalimah: ʹinna ʹakhẓahooo ʹaleemuñ shadeed.

    మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) పట్టుకొన (శిక్షించ) దలచితే, ఇలాగే పట్టుకుంటాడు (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధారకమైనది, ఎంతో తీవ్రమైనది.

  99. 11:103

    إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّمَنْ خَافَ عَذَابَ ٱلْـَٔاخِرَةِ ۚ ذَٰلِكَ يَوْمٌ مَّجْمُوعٌ لَّهُ ٱلنَّاسُ وَذَٰلِكَ يَوْمٌ مَّشْهُودٌ

    ʹInna fee ẓaalika laʹAayatal liman khaafa ʻaẓaabal ʹAakhirah: ẓaalika Yawmum majmooʻul lahun naasu waẓaalika Yawmum Mashhood.

    నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశ పరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు.

  100. 11:104

    وَمَا نُؤَخِّرُهُۥٓ إِلَّا لِأَجَلٍ مَّعْدُودٍ

    Wa-maa nuʹakhkhiruhooo ʹillaa liʹajalim maʻdood.

    మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము.

  101. 11:105

    يَوْمَ يَأْتِ لَا تَكَلَّمُ نَفْسٌ إِلَّا بِإِذْنِهِۦ ۚ فَمِنْهُمْ شَقِىٌّ وَسَعِيدٌ

    Yawma yaʹti laa- takallamu nafsun ʹillaa biʹiẓnih: faminhum shaq̣iyyuñw wasaʻeed.

    ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతులుంటారు.

  102. 11:106

    فَأَمَّا ٱلَّذِينَ شَقُوا۟ فَفِى ٱلنَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ

    Faʹammal laẓeena shaq̣oo fafin naari lahum feehaa zafeeruñw washaheeq̣.

    దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు.

  103. 11:107

    خَـٰلِدِينَ فِيهَا مَا دَامَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ إِلَّا مَا شَآءَ رَبُّكَ ۚ إِنَّ رَبَّكَ فَعَّالٌ لِّمَا يُرِيدُ

    Khaalideena feehaa maa- daamatis samaawaatu wal-ʹarḍu ʹillaa maa- shaaaʹa Rabbuk: ʹinna Rabbaka faʻ-ʻaalul limaa yureed.

    వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు.[1] నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు.

  104. 11:108

    ۞ وَأَمَّا ٱلَّذِينَ سُعِدُوا۟ فَفِى ٱلْجَنَّةِ خَـٰلِدِينَ فِيهَا مَا دَامَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ إِلَّا مَا شَآءَ رَبُّكَ ۖ عَطَآءً غَيْرَ مَجْذُوذٍ

    Wa-ʹammal laẓeena suʻidoo fafil Jannati khaalideena feehaa maa- daamatis samaawaatu wal-ʹarḍu ʹillaa maa- shaaaʹa Rabbuk: ʻaṭaaaʹan g̣ayra majẓooẓ.

    ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! ఇదొక ఎడతెగని బహుమానం. [1]

  105. 11:109

    فَلَا تَكُ فِى مِرْيَةٍ مِّمَّا يَعْبُدُ هَـٰٓؤُلَآءِ ۚ مَا يَعْبُدُونَ إِلَّا كَمَا يَعْبُدُ ءَابَآؤُهُم مِّن قَبْلُ ۚ وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ مَنقُوصٍ

    Falaa taku fee miryatim mimmaa yaʻbudu haaaʹulaaaʹ. Maa- yaʻbudoona ʹillaa kamaa yaʻbudu ʹaabaaaʹuhum miñ q̣abl: wa-ʹinnaa lamuwaffoohum naṣeebahum g̣ayra mañq̣ooṣ.

    కావున (ఓ ప్రవక్తా!) వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాతముత్తాతలు ఆరాధించినట్లుగానే వారు కూడా (అంధులై) ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా, వారి భాగపు (శిక్షను) ఏ మాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము.

  106. 11:110

    وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ فَٱخْتُلِفَ فِيهِ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِىَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِى شَكٍّ مِّنْهُ مُرِيبٍ

    Wa-laq̣ad ʹaataynaa Moosal Kitaaba fakhtulifa feeh: wa-lawlaa kalimatuñ sabaq̣at mir Rabbika laq̣uḍiya baynahum: wa-ʹinnahum lafee shakkim minhu mureeb.

    మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు మాట (ఆజ్ఞ) ముందుగానే నిర్ణయించబడి ఉండకుంటే, వారి తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా, వారు దీనిని గురించి సంశయంలో, సందేహంలో పడి వున్నారు.

  107. 11:111

    وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَـٰلَهُمْ ۚ إِنَّهُۥ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ

    Wa-ʹinna kullal lammaa layuwaffiyannahum Rabbuka ʹaʻmaalahum: ʹinnahoo bimaa yaʻmaloona Khabeer.

    మరియు నిశ్చయంగా, నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చి వేస్తాడు. నిశ్చయంగా ఆయన వారి కర్మలను బాగా ఎరుగును.

  108. 11:112

    فَٱسْتَقِمْ كَمَآ أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا۟ ۚ إِنَّهُۥ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

    Fastaq̣im kamaaa ʹumirta wa-mañ taaba maʻaka wa-laa taṭg̣aw: ʹinnahoo bimaa taʻmaloona Baṣeer.

    కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాప పడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి, హద్దు మీరకండి. నిశ్చయంగా, ఆయన మీ కర్మలన్నీ చూస్తున్నాడు.

  109. 11:113

    وَلَا تَرْكَنُوٓا۟ إِلَى ٱلَّذِينَ ظَلَمُوا۟ فَتَمَسَّكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِنْ أَوْلِيَآءَ ثُمَّ لَا تُنصَرُونَ

    Wa-laa tarkanooo ʹilal laẓeena z̤̣alamoo fatamassakumun Naaru,― wa-maa lakum miñ doonil laahi min ʹawliyaaaʹa s̤umma laa- tuñṣaroon.

    దుర్మార్గుల వైపునకు మీరు మొగ్గకండి. నరకాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్ తప్ప మరెవ్వరూ మీకు సంరక్షకులూ ఉండరు. అప్పుడు మీకెవ్వరి సహాయమూ లభించదు.

  110. 11:114

    وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَىِ ٱلنَّهَارِ وَزُلَفًا مِّنَ ٱلَّيْلِ ۚ إِنَّ ٱلْحَسَنَـٰتِ يُذْهِبْنَ ٱلسَّيِّـَٔاتِ ۚ ذَٰلِكَ ذِكْرَىٰ لِلذَّٰكِرِينَ

    Wa-ʹaq̣imiṣ Ṣalaata ṭarafayin nahaari wa-zulafam minal layl: ʹinnal ḥasanaati yuẓhibnas sayyiʹaat: ẓaalika ẓikraa liẓ-ẓaakireen:

    మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి.[1] నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).

  111. 11:115

    وَٱصْبِرْ فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ

    Waṣbir faʹinnal laaha laa- yuḍeeʻu ʹajral Muḥsineen.

    మరియు సహనం వహించు; నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు.

  112. 11:116

    فَلَوْلَا كَانَ مِنَ ٱلْقُرُونِ مِن قَبْلِكُمْ أُو۟لُوا۟ بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ ٱلْفَسَادِ فِى ٱلْأَرْضِ إِلَّا قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ ۗ وَٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَآ أُتْرِفُوا۟ فِيهِ وَكَانُوا۟ مُجْرِمِينَ

    Falawlaa kaana minal q̣urooni miñ q̣ablikum ʹUloo baq̣iyyatiñy yanhawna ʻanil fasaadi fil ʹarḍi ʹillaa q̣aleelam mimman ʹañjaynaa minhum? Wattabaʻal laẓeena z̤̣alamoo maaa ʹutrifoo feehi wa-kaanoo mujrimeen.

    మీకు పూర్వం గతించిన తరాల వారిలో, భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకు లేరు? కాని అలాంటి వారు కొందరు మాత్రమే ఉండేవారు! వారిని మేము అలాంటి వారి (దుర్మార్గుల) నుండి కాపాడాము. మరియు దుర్మార్గులైన వారు ఐహిక సుఖాలకు లోనయ్యారు మరియు వారు అపరాధులు.

  113. 11:117

    وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ ٱلْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ

    Wa-maa kaana Rabbuka liyuhlikal q̣uraa biz̤̣ulmiñw waʹahluhaa muṣliḥoon.

    మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంత వరకు, అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు.

  114. 11:118

    وَلَوْ شَآءَ رَبُّكَ لَجَعَلَ ٱلنَّاسَ أُمَّةً وَٰحِدَةً ۖ وَلَا يَزَالُونَ مُخْتَلِفِينَ

    Wa-law shaaaʹa Rabbuka lajaʻal annaasa ʹUmmatañw waa-ḥidatañw walaa yazaaloona mukhtalifeen.

    మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు[1] -

  115. 11:119

    إِلَّا مَن رَّحِمَ رَبُّكَ ۚ وَلِذَٰلِكَ خَلَقَهُمْ ۗ وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ

    ʹIllaa mar raḥima Rabbuk: wa-liẓaalika khalaq̣ahum: wa-tammat Kalimatu Rabbika laʹamlaʹanna Jahannama minal jinnati wannaasi ʹajmaʻeen.

    నీ ప్రభువు కరుణించినవాడు తప్ప![1] మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు.[2] మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.[3]

  116. 11:120

    وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنۢبَآءِ ٱلرُّسُلِ مَا نُثَبِّتُ بِهِۦ فُؤَادَكَ ۚ وَجَآءَكَ فِى هَـٰذِهِ ٱلْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ

    Wa-kullan naq̣uṣṣu ʻalayka min ʹambaaaʹir rusuli maa- nus̤abbitu bihee fuʹaadak: wa-jaaaʹaka fee haaẓihil Ḥaq̣q̣u wa-mawʻiz̤̣atuñw waẓikraa lil-Muʹmineen.

    మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు ఇందు (ఈ సూరహ్) లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక.

  117. 11:121

    وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ ٱعْمَلُوا۟ عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَـٰمِلُونَ

    Waq̣ul lillaẓeena laa- yuʹminoo naʻmaloo ʻalaa makaanatikum: ʹinnaa ʻaamiloon;

    మరియు విశ్వసించని వారితో ఇలా అను: "మీరు మీ శక్తి మేరకు మీ పనులు చేయండి. నిశ్చయంగా, మేము కూడా మా శక్తి మేరకు మా పనులు చేస్తాము.

  118. 11:122

    وَٱنتَظِرُوٓا۟ إِنَّا مُنتَظِرُونَ

    Wañtaz̤̣iroo! ʹinnaa muñ-taz̤̣iroon.

    మరియు మీరు వేచి చూడండి; మేము కూడా వేచి ఉంటాము."

  119. 11:123

    وَلِلَّهِ غَيْبُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ ٱلْأَمْرُ كُلُّهُۥ فَٱعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ ۚ وَمَا رَبُّكَ بِغَـٰفِلٍ عَمَّا تَعْمَلُونَ

    Wa-lillaahi g̣aybus samaawaati wal-ʹarḍi wa-ʹilayhi yurjaʻul ʹamru kulluhoo faʻbudhu wa-tawakkal ʻalayh: wa-maa Rabbuka big̣aafilin ʻammaa taʻmaloon.

    మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్ కే తెలుసు.[1] మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడతాయి కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు.

  120. Surah YusufBegins here at 12:1

  121. 12:1

    الٓر ۚ تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ

    Alif-Laaam-Raa. Tilka ʹAayaatul kitaabil Mubeen.

    అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు.

  122. 12:2

    إِنَّآ أَنزَلْنَـٰهُ قُرْءَٰنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ

    ʹInnaaa ʹañzalnaahu Q̣urʹaanan ʻArabiyyal laʻallakum taʻq̣iloon.

    వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము.[1]

  123. 12:3

    نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ ٱلْقَصَصِ بِمَآ أَوْحَيْنَآ إِلَيْكَ هَـٰذَا ٱلْقُرْءَانَ وَإِن كُنتَ مِن قَبْلِهِۦ لَمِنَ ٱلْغَـٰفِلِينَ

    Naḥnu naq̣uṣṣu ʻalayka ʹaḥsanal q̣aṣaṣi bimaaa ʹawḥaynaaa ʹilayka haaẓal Q̣urʹaan: wa-ʹiñ kuñta miñ q̣ablihee laminal g̣aafileen.

    (ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు.[1]

  124. 12:4

    إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَـٰٓأَبَتِ إِنِّى رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ رَأَيْتُهُمْ لِى سَـٰجِدِينَ

    ʹIẓ q̣aala Yoosufu liʹabeehi yaaaʹabati ʹinnee raʹaytu ʹaḥada ʻashara kawkabañw washshamsa walq̣amara raʹaytuhum lee saajideen.

    (జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: "ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు!

  125. 12:5

    قَالَ يَـٰبُنَىَّ لَا تَقْصُصْ رُءْيَاكَ عَلَىٰٓ إِخْوَتِكَ فَيَكِيدُوا۟ لَكَ كَيْدًا ۖ إِنَّ ٱلشَّيْطَـٰنَ لِلْإِنسَـٰنِ عَدُوٌّ مُّبِينٌ

    Q̣aala yaa-bunayya laa- taq̣ṣuṣ ruʹyaaka ʻalaaa ʹikhwatika fayakeedoo laka kaydaa! ʹInnash shayṭaana lil-ʹiñsaani ʻaduwwum mubeen!

    (అతని తండ్రి) అన్నాడు: "ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు![1] నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు.

  126. 12:6

    وَكَذَٰلِكَ يَجْتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأْوِيلِ ٱلْأَحَادِيثِ وَيُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكَ وَعَلَىٰٓ ءَالِ يَعْقُوبَ كَمَآ أَتَمَّهَا عَلَىٰٓ أَبَوَيْكَ مِن قَبْلُ إِبْرَٰهِيمَ وَإِسْحَـٰقَ ۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٌ

    Wa-kaẓaalika yajtabeeka Rabbuka wa-yuʻallimuka miñ taʹweelil ʹaḥaadees̤i wa-yutimmu niʻmatahoo ʻalayka wa-ʻalaaa ʹaali Yaʻq̣ooba kamaaa ʹatammahaa ʻalaaa ʹabawayka miñ q̣ablu ʹIbraaheema wa-ʹisḥaaq̣! ʹInna Rabbaka ʻAleemun Ḥakeem.

    "మరియు ఆ విధంగానే జరుగుతుంది! నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు మరియు నీకు సంఘటనల (స్వప్నాల) గూడార్థ వివరణ కూడా నేర్పుతాడు మరియు నీ పూర్వీకులైన (తాతముత్తాతలైన), ఇబ్రాహీమ్ మరియు ఇస్ హాఖ్ లకు ప్రసాదించినట్లు నీకూ మరియు యఅఖూబ్ సంతతి వారికి సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

  127. 12:7

    ۞ لَّقَدْ كَانَ فِى يُوسُفَ وَإِخْوَتِهِۦٓ ءَايَـٰتٌ لِّلسَّآئِلِينَ

    Laq̣ad kaana fee yoosufa wa-ʹikhwatihee ʹAayaatul lissaaaʹileen.

    వాస్తవానికి, యూసుఫ్ మరియు అతని సోదరుల (గాథలో) అడిగే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి.

  128. 12:8

    إِذْ قَالُوا۟ لَيُوسُفُ وَأَخُوهُ أَحَبُّ إِلَىٰٓ أَبِينَا مِنَّا وَنَحْنُ عُصْبَةٌ إِنَّ أَبَانَا لَفِى ضَلَـٰلٍ مُّبِينٍ

    ʹIẓ q̣aaloo la-Yoosufu wa-ʹakhoohu ʹaḥabbu ʹilaaa ʹabeenaa minnaa wa-naḥnu ʻuṣbah! ʹInna ʹabaanaa lafee ḍalaalim mubeen!

    అప్పుడు వారు (యూసుఫ్ సోదరులు) పరస్పరం ఇలా అనుకున్నారు: "మనది ఒక బలమైన వర్గం, అయినప్పటికీ యూసుఫ్ మరియు అతన సోదరుడు (బెన్యామీన్) అంటే మన తండ్రికి మన కంటే ఎక్కువ ప్రేమ.[1] నిశ్చయంగా, మన తండ్రి స్పష్టమైన తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు."

  129. 12:9

    ٱقْتُلُوا۟ يُوسُفَ أَوِ ٱطْرَحُوهُ أَرْضًا يَخْلُ لَكُمْ وَجْهُ أَبِيكُمْ وَتَكُونُوا۟ مِنۢ بَعْدِهِۦ قَوْمًا صَـٰلِحِينَ

    ʹUq̣tuloo Yoosufa ʹawiṭra ḥoohu ʹarḍañy yakhlu lakum wajhu ʹabeekum wa-takoonoo mim baʻdihee q̣awmañ ṣaaliḥeen!

    (వారిలో ఒకడు ఇలా అన్నాడు): "యూసుఫ్ ను చంపండి, లేదా అతణ్ణి ఎక్కడైనా ఒంటరిగా వదలి పెట్టండి. ఇలా చేసినట్లయితే మీ తండ్రి ధ్యాస (ప్రేమ) కేవలం మీ వైపునకే మరలుతుంది. ఆ తరువాత మీరు (ప్రాయశ్చిత్తం చేసి) సద్వర్తనులుగా ప్రవర్తించండి."

  130. 12:10

    قَالَ قَآئِلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوا۟ يُوسُفَ وَأَلْقُوهُ فِى غَيَـٰبَتِ ٱلْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ ٱلسَّيَّارَةِ إِن كُنتُمْ فَـٰعِلِينَ

    Q̣aala q̣aaaʹilum minhum laa- taq̣tuloo Yoosufa wa-ʹalq̣oohu fee g̣ayaabatil jubbi yaltaq̣iṭhu baʻḍus say-yaarati ʹiñ kuñtum faa-ʻileen.

    వారిలో మరొకడు అన్నాడు: "యూసుఫ్ ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక లోతైన బావిలో పడవేయండి,[1] ఎవరైనా బాటసారులు అతనిని తీసుకొని పోవచ్చు!"

  131. 12:11

    قَالُوا۟ يَـٰٓأَبَانَا مَا لَكَ لَا تَأْمَ۫نَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُۥ لَنَـٰصِحُونَ

    Q̣aaloo yaaaʹabaanaa maa- laka laa- taʹmannaa ʻalaa Yoosufa wa-ʹinnaa lahoo lanaaṣiḥoon?

    వారు అన్నారు: "నాన్నా! నీవు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మవు? వాస్తవానికి మేము అతని శ్రేయోభిలాషులము!

  132. 12:12

    أَرْسِلْهُ مَعَنَا غَدًا يَرْتَعْ وَيَلْعَبْ وَإِنَّا لَهُۥ لَحَـٰفِظُونَ

    ʹArsilhu maʻanaa g̣adañy yartaʻwa- yalʻab wa-ʹinnaa lahoo laḥaafiz̤̣oon.

    రేపు అతనిని మా వెంట పంపండి, అతడు అక్కడ ఆడుకొని సంతోషపడతాడు. మరియు మేము తప్పక అతనికి రక్షకులముగా ఉంటాము."

  133. 12:13

    قَالَ إِنِّى لَيَحْزُنُنِىٓ أَن تَذْهَبُوا۟ بِهِۦ وَأَخَافُ أَن يَأْكُلَهُ ٱلذِّئْبُ وَأَنتُمْ عَنْهُ غَـٰفِلُونَ

    Q̣aala ʹinnee layaḥzununeee ʹañ taẓhaboo bihee wa-ʹakhaafu ʹañy yaʹkulahuẓ ẓiʹbu wa-ʹañtum ʻanhu g̣aafiloon.

    (వారి తండ్రి యఅఖూబ్) అన్నాడు: "మీరు అతనిని తీసుకొని పోవటం నిశ్చయంగా నన్ను చింతాక్రాంతునిగా చేస్తోంది. మీరు అతని విషయంలో ఏమరు పాటులో ఉన్నప్పుడు, అతనిని ఏదైనా తోడేలు తిని వేస్తుందేమోనని నేను భయపడుతున్నాను."

  134. 12:14

    قَالُوا۟ لَئِنْ أَكَلَهُ ٱلذِّئْبُ وَنَحْنُ عُصْبَةٌ إِنَّآ إِذًا لَّخَـٰسِرُونَ

    Q̣aaloo laʹin ʹakalahuẓ ẓiʹbu wa-naḥnu ʻuṣbatun ʹinnaaa ʹiẓal lakhaasiroon!

    వారన్నారు: "మేము ఇంత పెద్ద బలగం ఉన్నప్పటికీ అతనిని తోడేలు తినివేస్తే! నిశ్చయంగా మేము పనికిరాని (చేతకాని) వారమే కదా!"

  135. 12:15

    فَلَمَّا ذَهَبُوا۟ بِهِۦ وَأَجْمَعُوٓا۟ أَن يَجْعَلُوهُ فِى غَيَـٰبَتِ ٱلْجُبِّ ۚ وَأَوْحَيْنَآ إِلَيْهِ لَتُنَبِّئَنَّهُم بِأَمْرِهِمْ هَـٰذَا وَهُمْ لَا يَشْعُرُونَ

    Falammaa ẓahaboo bihee wa-ʹajmaʻooo ʹañy yajʻaloohu fee g̣ayaabatil jubb: wa-ʹawḥaynaaa ʹilayhi latunabbiʹannahum̃ biʹamrihim haaẓaa wahum laa- yashʻuroon.

    ఆ పిదప వారు అతనిని తీసుకొని పోయి ఒక లోతు బావిలో పడ వేద్దామని నిర్ణయించుకున్నారు. అప్పుడు మేము అతనికి దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలిపాము: "నీవు (ఒక రోజు) వారికి ఈ కార్యాన్ని జ్ఞప్తికి తెచ్చే సమయం వస్తుంది మరియు వారు నిన్ను గుర్తుపట్టలేరు."[1]

  136. 12:16

    وَجَآءُوٓ أَبَاهُمْ عِشَآءً يَبْكُونَ

    Wa-jaaaʹooo ʹabaahum ʻishaaaʹañy yabkoon.

    మరియు ఇషా సమయంలో (చీకటి పడ్డ తరువాత) వారు తమ తండ్రి వద్దకు ఏడ్చుకుంటూ వచ్చారు.

  137. 12:17

    قَالُوا۟ يَـٰٓأَبَانَآ إِنَّا ذَهَبْنَا نَسْتَبِقُ وَتَرَكْنَا يُوسُفَ عِندَ مَتَـٰعِنَا فَأَكَلَهُ ٱلذِّئْبُ ۖ وَمَآ أَنتَ بِمُؤْمِنٍ لَّنَا وَلَوْ كُنَّا صَـٰدِقِينَ

    Q̣aaloo yaaaʹabaanaaa ʹinnaa ẓahabnaa nastabiq̣u wa-taraknaa Yoosufa ʻiñda mataaʻinaa faʹakalahuẓ ẓiʹb. Wa-maaa ʹañta bimuʹminil lanaa wa-law kunnaa ṣaadiq̣een.

    వారన్నారు: "ఓ నాన్నా! మేము పరుగు పందాలలో మునిగి పోయాము. మరియు యూసుఫ్ ను మేము మా సామాగ్రి వద్ద విడిచి వెళ్లాము; అప్పుడు ఒక తోడేలు అతనిని తిని పోయింది. మరియు మేము సత్యం పలికినా నీవు మా మాట నమ్మకపోవచ్చు!"

  138. 12:18

    وَجَآءُو عَلَىٰ قَمِيصِهِۦ بِدَمٍ كَذِبٍ ۚ قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ أَنفُسُكُمْ أَمْرًا ۖ فَصَبْرٌ جَمِيلٌ ۖ وَٱللَّهُ ٱلْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ

    Wa-jaaaʹoo ʻalaa q̣ameeṣihee bidamiñ kaẓib. Q̣aala bal sawwalat lakum ʹañfusukum ʹamraa. Faṣabruñ jameel: wallaahul Mustaʻaanu ʻalaa maa- taṣifoon.

    వారు అతని అంగికి బూటకపు రక్తాన్ని పూసి తెచ్చారు. (వారి తండ్రి) అన్నాడు: "మీ ఆత్మ మిమ్మల్ని (ఒక ఘోర) కార్యాన్ని (విషయాన్ని), తేలికైనదిగా అనిపించేటట్లు చేసింది. ఇక (నా కొరకు) సహనమే మేలైనది. మరియు మీరు చెప్పే విషయంలో అల్లాహ్ సహాయమే నేను కోరేది!"

  139. 12:19

    وَجَآءَتْ سَيَّارَةٌ فَأَرْسَلُوا۟ وَارِدَهُمْ فَأَدْلَىٰ دَلْوَهُۥ ۖ قَالَ يَـٰبُشْرَىٰ هَـٰذَا غُلَـٰمٌ ۚ وَأَسَرُّوهُ بِضَـٰعَةً ۚ وَٱللَّهُ عَلِيمٌۢ بِمَا يَعْمَلُونَ

    Wa-jaaaʹat sayyaaratuñ faʹarsaloo waaridahum faʹadlaa dalwah. Q̣aala yaa-bushraa haaẓaa g̣ulaam! Wa-ʹasarroohu biḍaaʻah! Wallaahu ʻaleemum bimaa yaʻmaloon!

    మరియు అటు వైపునకు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు తమ నీరు తెచ్చే మనిషిని పంపారు, అతడు (బావిలో) బొక్కెనను దింపాడు. (అతనికి బావిలో ఒక బాలుడు కనిపించగా) అన్నాడు: "ఇదిగో శుభవార్త! ఇక్కడ ఒక బాలుడున్నాడు." వారు అతనిని ఒక వ్యాపార సరుకుగా (బానిసగా) భావించి దాచుకున్నారు. మరియు వారు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

  140. 12:20

    وَشَرَوْهُ بِثَمَنٍۭ بَخْسٍ دَرَٰهِمَ مَعْدُودَةٍ وَكَانُوا۟ فِيهِ مِنَ ٱلزَّٰهِدِينَ

    Wa-sharawhu bis̤amanim bakhsiñ daraahima maʻdoodah: wa-kaanoo feehi minaz zaahideen!

    మరియు వారు స్వల్ప ధరకు, కొన్ని దిర్హములకు మాత్రమే అతనిని అమ్ముకున్నారు.[1] మరియు అసలు వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు.

  141. 12:21

    وَقَالَ ٱلَّذِى ٱشْتَرَىٰهُ مِن مِّصْرَ لِٱمْرَأَتِهِۦٓ أَكْرِمِى مَثْوَىٰهُ عَسَىٰٓ أَن يَنفَعَنَآ أَوْ نَتَّخِذَهُۥ وَلَدًا ۚ وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِى ٱلْأَرْضِ وَلِنُعَلِّمَهُۥ مِن تَأْوِيلِ ٱلْأَحَادِيثِ ۚ وَٱللَّهُ غَالِبٌ عَلَىٰٓ أَمْرِهِۦ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

    Wa-q̣aalal laẓish taraahu mim Miṣra limraʹatiheee ʹakrimee mas̤waahu ʻasaaa ʹañy yañfaʻanaaa ʹaw nattakhiẓahoo waladaa. Wa-kaẓaalika mak-kannaa li-Yoosufa fil ʹarḍi, wa-linuʻallimahoo miñ taʹweelil ʹaḥaadees̤. Wallaahu g̣aalibun ʻalaaa ʹamrihee wa-laakinna ʹaks̤aran naasi laa yaʻlamoon.

    మరియు అతనిని కొన్న ఈజిప్టు (మిస్ర్) వాసి తన భార్యతో[1] అన్నాడు: "ఇతనిని గౌరవంగా ఉంచుకో! బహుశా ఇతను మనకు లాభదాయకుడు కావచ్చు! లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు!" మరియు ఈ విధంగా మేము యూసుఫ్ ను భూమిపై స్థానమిచ్చి అతనికి సంఘనల గూఢార్థాన్ని (స్వప్నాల భావాన్ని) తెలియజేసే (విద్యను) నేర్పాము. అల్లాహ్ తన కార్యాన్ని పూర్తి చేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని చాలా మందికి ఇది తెలియదు.

  142. 12:22

    وَلَمَّا بَلَغَ أَشُدَّهُۥٓ ءَاتَيْنَـٰهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

    Wa-lammaa balag̣a ʹashuddahooo ʹaataynaahu ḥukmañw waʻilmaa: wa-kaẓaalika najzil Muḥsineen.

    మరియు అతను తన నిండు యవ్వనానికి చేరుకున్నపుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలము నొసంగుతాము.

  143. 12:23

    وَرَٰوَدَتْهُ ٱلَّتِى هُوَ فِى بَيْتِهَا عَن نَّفْسِهِۦ وَغَلَّقَتِ ٱلْأَبْوَٰبَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ ٱللَّهِ ۖ إِنَّهُۥ رَبِّىٓ أَحْسَنَ مَثْوَاىَ ۖ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّـٰلِمُونَ

    Wa-raawadat-hul latee huwa fee baytihaa ʻan nafsihee wa-g̣allaq̣atil ʹabwaaba wa-q̣aalat hayta lak! Q̣aala maʻaaẓal laahi ʹinnahoo rabbeee ʹaḥsana mas̤waay! Innahoo laa- yufliḥuz̤̣ z̤̣aalimoon!

    మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు మూసి, అతనితో: "(నా వద్దకు) రా!" అని పిలిచింది. అతను : "నేను అల్లాహ్ శరణు గోరుతున్నాను! నిశ్చయంగా ఆయన! నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు." అని పలికాడు.

  144. 12:24

    وَلَقَدْ هَمَّتْ بِهِۦ ۖ وَهَمَّ بِهَا لَوْلَآ أَن رَّءَا بُرْهَـٰنَ رَبِّهِۦ ۚ كَذَٰلِكَ لِنَصْرِفَ عَنْهُ ٱلسُّوٓءَ وَٱلْفَحْشَآءَ ۚ إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُخْلَصِينَ

    Wa-laq̣ad hammat bihee wa-hamma bihaa laaa-law ʹar raʹaa burhaana Rabbih: Kaẓaalika linaṣrifa ʻanhus soooʹa wal-faḥshaaaʹ: ʹinnahoo min ʻibaadinal Mukhlaṣeen.

    మరియు వాస్తవానికి, ఆమె అతనిని ఆశించింది. మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే! ఒకవేల అతను తన ప్రభువు యొక్క నిదర్శనాన్ని చూసి ఉండక పోతే! ఈ విధంగా జరిగింది, మేము పాపం మరియు అశ్లీలతను అతని నుండి దూరంగా ఉంచటానికి. నిశ్చయంగా, అతను మేము ఎన్నుకున్న దాసులలో ఒకడు.

  145. 12:25

    وَٱسْتَبَقَا ٱلْبَابَ وَقَدَّتْ قَمِيصَهُۥ مِن دُبُرٍ وَأَلْفَيَا سَيِّدَهَا لَدَا ٱلْبَابِ ۚ قَالَتْ مَا جَزَآءُ مَنْ أَرَادَ بِأَهْلِكَ سُوٓءًا إِلَّآ أَن يُسْجَنَ أَوْ عَذَابٌ أَلِيمٌ

    Wastabaq̣al baaba wa-q̣addat q̣ameeṣahoo miñ duburiñw waʹalfayaa sayyidahaa ladal baab. Q̣aalat maa- jazaaaʹu man ʹaraada biʹahlika soooʹan ʹillaaa ʹañy yusjana ʹaw ʻaẓaabun ʹaleem?

    మరియు వారిద్దరు (ఒకరి వెనుక ఒకరు) తలుపు వైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక నుండి లాగి చించింది. వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను చూశారు. ఆమె (తన భర్తతో) అన్నది: "నీ భార్యను చెరుపాలని తలచిన వానికి చెరసాలలో ఉంచటం, లేదా బాధాకరమైన శిక్ష విధించటం తప్ప, మరొక శిక్ష ఏముంటుంది?"

  146. 12:26

    قَالَ هِىَ رَٰوَدَتْنِى عَن نَّفْسِى ۚ وَشَهِدَ شَاهِدٌ مِّنْ أَهْلِهَآ إِن كَانَ قَمِيصُهُۥ قُدَّ مِن قُبُلٍ فَصَدَقَتْ وَهُوَ مِنَ ٱلْكَـٰذِبِينَ

    Q̣aala hiya raawadatnee ʻan nafsee wa-shahida shaahidum min ʹahlihaa: ʹiñ kaana q̣ameeṣuhoo q̣udda miñ q̣ubuliñ faṣadaq̣at wa-huwa minal kaaẓibeen!

    (యూసుఫ్) అన్నాడు: "ఈమెనే, నన్ను మోహింప జేయగోరింది!" ఆమె కుటుంబం వారిలో నుండి అక్కడ ఉన్న ఒకడు ఇలా సాక్ష్యమిచ్చాడు: "ఒకవేళ అతని అంగి, ముందు నుండి చినిగి ఉంటే ఆమె పలికేది సత్యం మరియు అతను అసత్యుడు!

  147. 12:27

    وَإِن كَانَ قَمِيصُهُۥ قُدَّ مِن دُبُرٍ فَكَذَبَتْ وَهُوَ مِنَ ٱلصَّـٰدِقِينَ

    Wa-ʹiñ kaana q̣ameeṣuhoo q̣udda miñ duburiñ fakaẓabat wa-huwa minaṣ ṣaadiq̣een!

    కానీ ఒకవేళ అతని అంగి వెనుక నుండి చినిగి ఉంటే! ఆమె పలికేది అబద్ధం మరియు అతను సత్యవంతుడు!"

  148. 12:28

    فَلَمَّا رَءَا قَمِيصَهُۥ قُدَّ مِن دُبُرٍ قَالَ إِنَّهُۥ مِن كَيْدِكُنَّ ۖ إِنَّ كَيْدَكُنَّ عَظِيمٌ

    Falammaa raʹaa q̣ameeṣahoo q̣udda miñ duburiñ q̣aala ʹinnahoo miñ kaydikunna! ʹInna kaydakunna ʻaz̤̣eem!

    అతని అంగి వెనుక నుండి చినిగి ఉండటాన్ని చూసి (ఆమె భర్త) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, ఇది మీ స్త్రీల పన్నాగం. నిశ్చయంగా మీ పన్నాగం ఎంతో భయంకరమైనది!

  149. 12:29

    يُوسُفُ أَعْرِضْ عَنْ هَـٰذَا ۚ وَٱسْتَغْفِرِى لِذَنۢبِكِ ۖ إِنَّكِ كُنتِ مِنَ ٱلْخَاطِـِٔينَ

    Yoosufu ʹaʻriḍ ʻan haaẓaa wastag̣firee liẓambiki ʹinnaki kuñti minal khaaṭiʹeen!

    ఓ యూసుఫ్! ఈ విషయాన్ని పోనివ్వు!" (తన భార్యతో అన్నాడు): "నీవు నీ పాపానికి క్షమాపణ కోరుకో, నిశ్చయంగా నీవే తప్పు చేసిన దానవు."

  150. 12:30

    ۞ وَقَالَ نِسْوَةٌ فِى ٱلْمَدِينَةِ ٱمْرَأَتُ ٱلْعَزِيزِ تُرَٰوِدُ فَتَىٰهَا عَن نَّفْسِهِۦ ۖ قَدْ شَغَفَهَا حُبًّا ۖ إِنَّا لَنَرَىٰهَا فِى ضَلَـٰلٍ مُّبِينٍ

    Wa-q̣aala niswatuñ fil Madeenatim raʹatul ʻAzeezi turaawidu fataahaa ʻan nafsih: q̣ad shag̣afahaa ḥubbaa: ʹinnaa lanaraahaa fee ḍalaalim mubeen.

    మరియు నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. "అజీజ్ భార్య తన యువ బానిసను మోహింపగోరింది. నిశ్చయంగా ఆమె గాఢమైన ప్రేమలో పడి ఉంది. నిశ్చయంగా, ఆమె స్పష్టమైన పొరపాటులో ఉన్నట్లు మేము చూస్తున్నాము."

  151. 12:31

    فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ أَرْسَلَتْ إِلَيْهِنَّ وَأَعْتَدَتْ لَهُنَّ مُتَّكَـًٔا وَءَاتَتْ كُلَّ وَٰحِدَةٍ مِّنْهُنَّ سِكِّينًا وَقَالَتِ ٱخْرُجْ عَلَيْهِنَّ ۖ فَلَمَّا رَأَيْنَهُۥٓ أَكْبَرْنَهُۥ وَقَطَّعْنَ أَيْدِيَهُنَّ وَقُلْنَ حَـٰشَ لِلَّهِ مَا هَـٰذَا بَشَرًا إِنْ هَـٰذَآ إِلَّا مَلَكٌ كَرِيمٌ

    Falammaa samiʻat bimakrihinna ʹarsalat ʹilayhinna wa-ʹaʻtadat lahunna muttakaʹañw waʹaatat kulla waaḥidatim min-hunna sikkeenañw waq̣aalatikh ruj ʻalayhinn. Falammaa raʹaynahooo ʹakbarnahoo wa-q̣aṭṭaʻna ʹaydiyahunna wa-q̣ulna ḥaasha lillaahi maa- haaẓaa basharaa! ʹIn haaẓaaa ʹillaa malakuñ kareem!

    ఆమె వారి నిందారోపణలు విని, వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కత్తి ఇచ్చి, (యూసుఫ్ తో): "వారి ముందుకు రా!" అని అన్నది. ఆ స్త్రీలు అతనిని చూడగానే నివ్వెరపోయారు మరియు (ఆశ్చర్యంతో చేతులలో ఉన్న కత్తులతో) తమ చేతులను కోసుకున్నారు. (అప్రయత్నంగా) అన్నారు: "అల్లాహ్ మహిమ! (హాషలిల్లాహ్) ఇతను మానవుడు మాత్రం కాడు! ఇతను గొప్ప దేవదూతయే కాగలడు!"

  152. 12:32

    قَالَتْ فَذَٰلِكُنَّ ٱلَّذِى لُمْتُنَّنِى فِيهِ ۖ وَلَقَدْ رَٰوَدتُّهُۥ عَن نَّفْسِهِۦ فَٱسْتَعْصَمَ ۖ وَلَئِن لَّمْ يَفْعَلْ مَآ ءَامُرُهُۥ لَيُسْجَنَنَّ وَلَيَكُونًا مِّنَ ٱلصَّـٰغِرِينَ

    Q̣aalat faẓaalikunnal laẓee lumtunnanee feeh! Wa-laq̣ad raawattuhoo ʻan nafsihee fastaʻṣam! Wa-laʹil lam yafʻal maaa ʹaamuruhoo layusjananna wa-layakoonam minaṣ ṣaag̣ireen!

    ఆమె అన్నది: "ఇతనే ఆ మనిషి! ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి నేనే ఇతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను, కాని ఇతను తప్పించుకున్నాడు. కాని ఇతను ఇక నేను చెప్పింది చేయకుంటే తప్పక చెరసాల పాలు కాగలడు, లేదా తీవ్ర అవమానానికి గురి కాగలడు!"

  153. 12:33

    قَالَ رَبِّ ٱلسِّجْنُ أَحَبُّ إِلَىَّ مِمَّا يَدْعُونَنِىٓ إِلَيْهِ ۖ وَإِلَّا تَصْرِفْ عَنِّى كَيْدَهُنَّ أَصْبُ إِلَيْهِنَّ وَأَكُن مِّنَ ٱلْجَـٰهِلِينَ

    Q̣aala Rabbis sijnu ʹaḥabbu ʹilayya mimmaa yadʻoonaneee ʹilayh: wa-ʹillaa taṣrif ʻannee kaydahunna ʹaṣbu ʹilayhinna wa-ʹakum minal jaahileen.

    (యూసుఫ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! ఈ స్త్రీలు నన్ను పిలిచే విషయాని కంటే నాకు చెరసాలయే ప్రియమైనది. నీవు వారి ఎత్తుగడల నుండి నన్ను తప్పించక పోతే, నేను వారి వలలో చిక్కిపోయే వాడిని మరియు అజ్ఞానులలో చేరి పోయేవాడిని."

  154. 12:34

    فَٱسْتَجَابَ لَهُۥ رَبُّهُۥ فَصَرَفَ عَنْهُ كَيْدَهُنَّ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

    Fastajaaba lahoo Rabbuhoo faṣarafa ʻanhu kaydahunn: ʹinnahoo Huwas Sameeʻul ʻAleem.

    అప్పుడు అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని ఆ స్త్రీల పన్నాగాల నుండి తప్పించాడు. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

  155. 12:35

    ثُمَّ بَدَا لَهُم مِّنۢ بَعْدِ مَا رَأَوُا۟ ٱلْـَٔايَـٰتِ لَيَسْجُنُنَّهُۥ حَتَّىٰ حِينٍ

    S̤umma badaa lahum mim baʻdi maa- raʹawul ʹAayaati layasjununnahoo ḥattaa ḥeen.

    ఆ తరువాత వారికి - (అతను నిర్దోషి అనే) సూచనలు కనిపించినా - అతనిని కొంత కాలం చెరసాలలో ఉంచాలని అనిపించింది.

  156. 12:36

    وَدَخَلَ مَعَهُ ٱلسِّجْنَ فَتَيَانِ ۖ قَالَ أَحَدُهُمَآ إِنِّىٓ أَرَىٰنِىٓ أَعْصِرُ خَمْرًا ۖ وَقَالَ ٱلْـَٔاخَرُ إِنِّىٓ أَرَىٰنِىٓ أَحْمِلُ فَوْقَ رَأْسِى خُبْزًا تَأْكُلُ ٱلطَّيْرُ مِنْهُ ۖ نَبِّئْنَا بِتَأْوِيلِهِۦٓ ۖ إِنَّا نَرَىٰكَ مِنَ ٱلْمُحْسِنِينَ

    Wa-dakhala maʻa hussijna fatayaan. Q̣aala ʹaḥaduhumaaa ʹinneee ʹaraaneee ʹaʻṣiru khamraa. Wa-q̣aalal ʹaakharu ʹinneee ʹaraaneee ʹaḥmilu fawq̣a raʹsee khubzañ taʹkuluṭ ṭayru minh. Nabbiʹnaa bitaʹweelih: ʹinnaa naraaka minal Muḥsineen.

    మరియు అతనితో బాటు ఇద్దరు యువకులు కూడా చెరసాలలో ప్రవేశించారు. వారిలో ఒకడు అన్నాడు: "నేను సారాయి పిండుతూ ఉన్నట్లు కల చూశాను!" రెండో వాడు అన్నాడు: "నేను నా తలపై రొట్టెలు మోస్తున్నట్లు, వాటిని పక్షులు తింటున్నట్లు కలలో చూశాను." (ఇద్దరూ కలిసి అన్నారు): "మాకు దీని భావాన్ని తెలుపు. నిశ్చయంగా, మేము నిన్ను సజ్జనునిగా చూస్తున్నాము."

  157. 12:37

    قَالَ لَا يَأْتِيكُمَا طَعَامٌ تُرْزَقَانِهِۦٓ إِلَّا نَبَّأْتُكُمَا بِتَأْوِيلِهِۦ قَبْلَ أَن يَأْتِيَكُمَا ۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِى رَبِّىٓ ۚ إِنِّى تَرَكْتُ مِلَّةَ قَوْمٍ لَّا يُؤْمِنُونَ بِٱللَّهِ وَهُم بِٱلْـَٔاخِرَةِ هُمْ كَـٰفِرُونَ

    Q̣aala laa- yaʹteekumaa ṭaʻaamuñ turzaq̣aaniheee ʹillaa nabbaʹtukumaa bitaʹweelihee q̣abla ʹañy yaʹtiyakumaa: ẓaalikumaa mimmaa ʻallamanee Rabbee. ʹInnee taraktu millata q̣awmil laa yuʹminoona billaahi wa-hum̃ bil-ʹAakhirati hum kaafiroon.

    (యూసుఫ్) అన్నాడు: "మీరిద్దరికి తినటానికి ఇవ్వబడే భోజనం వస్తుంది కదా! అది రాకముందే నేను వీటి (మీ కలల) భావాన్ని మీ ఇద్దరికి తెలుపుతాను. ఇది నా ప్రభువు నేర్పిన విద్యలలోనిదే. నిశ్చయంగా నేను అల్లాహ్ ను విశ్వసించనివారి మరియు పరలోకాన్ని తిరస్కరించేవారి ధర్మాన్ని వదలి పెట్టాను.

  158. 12:38

    وَٱتَّبَعْتُ مِلَّةَ ءَابَآءِىٓ إِبْرَٰهِيمَ وَإِسْحَـٰقَ وَيَعْقُوبَ ۚ مَا كَانَ لَنَآ أَن نُّشْرِكَ بِٱللَّهِ مِن شَىْءٍ ۚ ذَٰلِكَ مِن فَضْلِ ٱللَّهِ عَلَيْنَا وَعَلَى ٱلنَّاسِ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَشْكُرُونَ

    Wattabaʻtu Millata ʹaabaaaʹeee ʹIbraaheema wa-ʹIsḥaaq̣a wa-Yaʻq̣oob; maa- kaana lanaaa ʹan nushrika billaahi miñ shayʹ: ẓaalika miñ faḍlil laahi ʻalaynaa wa-ʻalan naasi wa-laakinna ʹaks̤aran naasi laa- yashkuroon.

    మరియు నేను నా తండ్రి తాతలైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ ల యొక్క ధర్మాన్ని అవలంబించాము. అల్లాహ్ కు ఎవడినైనా సాటి కల్పించటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది మాపై మరియు సర్వ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహం. కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు.

  159. 12:39

    يَـٰصَـٰحِبَىِ ٱلسِّجْنِ ءَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ ٱللَّهُ ٱلْوَٰحِدُ ٱلْقَهَّارُ

    Yaa-ṣaaḥibayis sijni ʹaʹarbaabum mutafarriq̣oona khayrun ʹamil laahul Waaḥidul Q̣ahhaar?

    ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, తన సృష్టిపై సంపూర్ణాధికారం గల అద్వితీయుడైన[1] అల్లాహ్ మేలా?

  160. 12:40

    مَا تَعْبُدُونَ مِن دُونِهِۦٓ إِلَّآ أَسْمَآءً سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَـٰنٍ ۚ إِنِ ٱلْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

    Maa- taʻbudoona miñ dooniheee ʹillaaa ʹasmaaaʹañ sammaytumoohaaa ʹañtum wa-ʹaabaaaʹukum maaa ʹañzalal laahu bihaa miñ sulṭaan: ʹinil Ḥukmu ʹillaa lillaah: ʹamara ʹallaa taʻbudooo ʹillaaa ʹiyyaah: ẓaalikad Deenul Q̣ayyimu wa-laakinna ʹaks̤aran naasi laa- yaʻlamoon.

    ఆయన (అల్లాహ్) ను వదలి మీరు ఆరాధిస్తున్నవి - మీరు మరియు మీ తండ్రి తాతలు కల్పించుకున్న - పేర్లు మాత్రమే! దాని కొరకు అల్లాహ్ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింప జేయలేదు. నిశ్చయంగా ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనను తప్ప మరొకరిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు. ఇదే సరైన ధర్మం, కానీ చాలా మందికి ఇది తెలియదు. [1]

  161. 12:41

    يَـٰصَـٰحِبَىِ ٱلسِّجْنِ أَمَّآ أَحَدُكُمَا فَيَسْقِى رَبَّهُۥ خَمْرًا ۖ وَأَمَّا ٱلْـَٔاخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ ٱلطَّيْرُ مِن رَّأْسِهِۦ ۚ قُضِىَ ٱلْأَمْرُ ٱلَّذِى فِيهِ تَسْتَفْتِيَانِ

    Yaa-ṣaaḥibayis sijni ʹammaaa ʹaḥadukumaa fayasq̣ee rabbahoo khamraa: wa-ʹammal ʹaakharu fayuṣlabu fataʹkuluṭ ṭayru mir raʹsih. Q̣uḍiyal ʹamrul laẓee feehi tastaftiyaan.

    ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! మీలో ఒకడు తన యజమానికి మద్యపానం (సారాయి) త్రాగిస్తూ ఉంటాడు. ఇక రెండవ వాడు సిలువపై ఎక్కించబడతాడు మరియు అతని నెత్తిపై నుండి పక్షులు తింటూ ఉంటాయి. మీరు అడుగుతున్న (కలల) విషయం గురించి ఈ విధమైన తీర్పు ఇవ్వబడుతోంది!"

  162. 12:42

    وَقَالَ لِلَّذِى ظَنَّ أَنَّهُۥ نَاجٍ مِّنْهُمَا ٱذْكُرْنِى عِندَ رَبِّكَ فَأَنسَىٰهُ ٱلشَّيْطَـٰنُ ذِكْرَ رَبِّهِۦ فَلَبِثَ فِى ٱلسِّجْنِ بِضْعَ سِنِينَ

    Wa-q̣aala lillaẓee z̤̣anna ʹannahoo naajim minhumaẓ kurnee ʻiñda rabbik. Faʹañsaahush Shayṭaanu ẓikra rabbihee falabis̤a fis sijni biḍʻa sineen.

    మరియు వారిద్దరిలో విడుదల పొందుతాడని భావించని వాడితో (యూసుఫ్) అన్నాడు: "నీ స్వామి దగ్గర నా ప్రస్తావన చెయ్యి." కాని అతనిని తన స్వామి దగ్గర ప్రస్తావన చేయటాన్ని షైతాన్ మరపింప జేశాడు, కావున (యూసుఫ్) చెరసాలలో మరికొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు.[1]

  163. 12:43

    وَقَالَ ٱلْمَلِكُ إِنِّىٓ أَرَىٰ سَبْعَ بَقَرَٰتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعَ سُنۢبُلَـٰتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَـٰتٍ ۖ يَـٰٓأَيُّهَا ٱلْمَلَأُ أَفْتُونِى فِى رُءْيَـٰىَ إِن كُنتُمْ لِلرُّءْيَا تَعْبُرُونَ

    Wa-q̣aalal maliku ʹinneee ʹaraa sabʻa baq̣araatiñ simaaniñy yaʹkuluhunna sabʻun ʻijaafuñw Wasabʻa sumbulaatin khuḍriñw waʹukhara yaabisaat. Yaaaʹayyuhal malaʹu ʹaftoonee fee ruʹyaaya ʹiñ kuñtum lirruʹyaa taʻburoon.

    (ఒకరోజు) రాజు అన్నాడు: "వాస్తవానికి నేను (కలలో) ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన (ఆవులు) తిని వేస్తున్నట్లు మరియు ఏడు పచ్చి వెన్నులను మరొక ఏడు ఎండిపోయిన వాటిని చూశాను. ఓ సభాసదులారా! మీకు స్వప్నాల భావం తెలిస్తే నా స్వప్నాల భావాన్ని తెలుపండి!"

  164. 12:44

    قَالُوٓا۟ أَضْغَـٰثُ أَحْلَـٰمٍ ۖ وَمَا نَحْنُ بِتَأْوِيلِ ٱلْأَحْلَـٰمِ بِعَـٰلِمِينَ

    Q̣aalooo ʹaḍg̣aas̤u ʹaḥlaam: Wa-maa naḥnu bitaʹweelil ʹaḥlaami biʻaalimeen.

    వారన్నారు: "ఇవి పీడకలలు. మరియు మాకు కలల గూఢర్థం తెలుసుకునే నైపుణ్యం లేదు!"

  165. 12:45

    وَقَالَ ٱلَّذِى نَجَا مِنْهُمَا وَٱدَّكَرَ بَعْدَ أُمَّةٍ أَنَا۠ أُنَبِّئُكُم بِتَأْوِيلِهِۦ فَأَرْسِلُونِ

    Wa-q̣aalal laẓee najaa minhumaa waddakara baʻda ʹummatin ʹana ʹunabbiʹukum̃ bitaʹweelihee faʹarsiloon.

    ఆ ఇద్దరు బందీలలో నుండి విడుదల పొందిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడా విషయం గుర్తుకు వచ్చింది.[1] అతడు అన్నాడు: "నేను దీని గూఢార్థాన్ని మీకు తెలుపుతాను, దానికి నన్ను (యూసుఫ్ వద్దకు) పంపడి."

  166. 12:46

    يُوسُفُ أَيُّهَا ٱلصِّدِّيقُ أَفْتِنَا فِى سَبْعِ بَقَرَٰتٍ سِمَانٍ يَأْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَسَبْعِ سُنۢبُلَـٰتٍ خُضْرٍ وَأُخَرَ يَابِسَـٰتٍ لَّعَلِّىٓ أَرْجِعُ إِلَى ٱلنَّاسِ لَعَلَّهُمْ يَعْلَمُونَ

    Yoosufu ʹayyuhaṣ Ṣiddeeq̣u ʹaftinaa fee sabʻi baq̣araatiñ simaaniñy yaʹkuluhunna sabʻun ʻijaafuñw Wasabʻi sumbulaatin khuḍriñw waʹukhara yaabisaatil laʻalleee ʹarjiʻu ʹilan naasi laʻallahum yaʻlamoon.

    (అతడు అన్నాడు): "యూసుఫ్! సత్యవంతుడా! నాకు - ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన ఆవులు తిని వేయటాన్ని; మరియు ఏడు పచ్చి వెన్నుల మరి ఏడు ఎండిపోయిన (వెన్నుల) - గూఢార్థమేమిటో చెప్పు. నేను (రాజసభలోని) ప్రజల వద్దకు పోయి (చెబుతాను), వారు దానిని తెలుసుకుంటారు."

  167. 12:47

    قَالَ تَزْرَعُونَ سَبْعَ سِنِينَ دَأَبًا فَمَا حَصَدتُّمْ فَذَرُوهُ فِى سُنۢبُلِهِۦٓ إِلَّا قَلِيلًا مِّمَّا تَأْكُلُونَ

    Q̣aala tazraʻoona sabʻa sineena daʹabaa: famaa ḥaṣattum faẓaroohu fee sumbuliheee ʹillaa q̣aleelam mimmaa taʹkuloon.

    (యూసుఫ్) అన్నాడు: "మీరు యథాప్రకారంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మాత్రమే తినటానికి ఉపయోగించుకొని, మిగిలినదంతా, వెన్నులతోనే కొట్లలో ఉంచి (భద్రపరచండి).

  168. 12:48

    ثُمَّ يَأْتِى مِنۢ بَعْدِ ذَٰلِكَ سَبْعٌ شِدَادٌ يَأْكُلْنَ مَا قَدَّمْتُمْ لَهُنَّ إِلَّا قَلِيلًا مِّمَّا تُحْصِنُونَ

    S̤umma yaʹtee mim baʻdi ẓaalika sabʻuñ shidaaduñy yaʹkulna maa- q̣addamtum lahunna ʹillaa q̣aleelam mimmaa tuḥṣinoon.

    ఆ తరువాత చాలా కఠినమైన ఏడు సంవత్సరాలు వస్తాయి, వాటిలో మీరు ముందే నిలువ చేసి ఉంచిన దానిని తింటారు. మీరు (విత్తనాని కోసం) భద్రంగా ఉంచుకున్న కొంతభాగం తప్ప! [1]

  169. 12:49

    ثُمَّ يَأْتِى مِنۢ بَعْدِ ذَٰلِكَ عَامٌ فِيهِ يُغَاثُ ٱلنَّاسُ وَفِيهِ يَعْصِرُونَ

    S̤umma yaʹtee mim baʻdi ẓaalika ʻaamuñ feehi yug̣aas̤un naasu wa-feehi yaʻṣiroon.

    ఆ తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులో ప్రజలకు పుష్కలమైన వర్షాలు కురుస్తాయి. అందులో వారు (రసం/నూనె) తీస్తారు (పిండుతారు)."

  170. 12:50

    وَقَالَ ٱلْمَلِكُ ٱئْتُونِى بِهِۦ ۖ فَلَمَّا جَآءَهُ ٱلرَّسُولُ قَالَ ٱرْجِعْ إِلَىٰ رَبِّكَ فَسْـَٔلْهُ مَا بَالُ ٱلنِّسْوَةِ ٱلَّـٰتِى قَطَّعْنَ أَيْدِيَهُنَّ ۚ إِنَّ رَبِّى بِكَيْدِهِنَّ عَلِيمٌ

    Wa-q̣aalal malikuʹ toonee bih. Falammaa jaaaʹahur rasoolu q̣aalar jiʻ ʹilaa rabbika fasʹalhu maa- baalun niswatil laatee q̣aṭṭaʻna ʹaydiyahunn? ʹInna Rabbee bikaydihinna ʻAleem.

    రాజు ఇలా అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకు రండి!" రాజదూత అతని వద్దకు వచ్చినపుడు (యూసుఫ్) అన్నాడు: "నీవు తిరిగి పోయి నీ స్వామిని అడుగు: 'తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయం ఏమిటి?'[1] నిశ్చయంగా, నా ప్రభువుకు వారి కుట్ర గురించి బాగా తెలుసు."

  171. 12:51

    قَالَ مَا خَطْبُكُنَّ إِذْ رَٰوَدتُّنَّ يُوسُفَ عَن نَّفْسِهِۦ ۚ قُلْنَ حَـٰشَ لِلَّهِ مَا عَلِمْنَا عَلَيْهِ مِن سُوٓءٍ ۚ قَالَتِ ٱمْرَأَتُ ٱلْعَزِيزِ ٱلْـَٔـٰنَ حَصْحَصَ ٱلْحَقُّ أَنَا۠ رَٰوَدتُّهُۥ عَن نَّفْسِهِۦ وَإِنَّهُۥ لَمِنَ ٱلصَّـٰدِقِينَ

    Q̣aala maa- khaṭbukunna ʹiẓ raawattunna Yoosufa ʻan nafsih? Q̣ulna Ḥaasha lillaahi maa- ʻalimnaa ʻalayhi miñ soooʹ! Q̣aalatim raʹatul ʻAzeezil ʹaana ḥaṣḥaṣal ḥaq̣q̣: ʹana raawattuhoo ʻan nafsihee wa-ʹinnahoo laminaṣ Ṣaadiq̣een.

    (రాజు స్త్రీలను) విచారించాడు: "మీరు యూసుఫ్ ను మోహింప జేయటానికి ప్రయత్నించిన విషయమేమిటి?" వారందరూ (ఒకేసారిగా) అన్నారు: "అల్లాహ్ రక్షించుగాక! మేము అతనిలో ఏ పాపాన్ని చూడలేదు!" అజీజ్ భార్య అన్నది: "ఇప్పుడు సత్యం బయటపడింది. నేనే అతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను. మరియు నిశ్చయంగా, అతను సత్యవంతుడు."

  172. 12:52

    ذَٰلِكَ لِيَعْلَمَ أَنِّى لَمْ أَخُنْهُ بِٱلْغَيْبِ وَأَنَّ ٱللَّهَ لَا يَهْدِى كَيْدَ ٱلْخَآئِنِينَ

    Ẓaalika liyaʻlama ʹannee lam ʹakhunhu bilg̣aybi wa-ʹannal laaha laa- yahdee kaydal khaaaʹineen.

    (అప్పుడు యూసుఫ్) అన్నాడు: "నేను ఇదంతా చేసింది నిశ్చయంగా, నేను (అజీజ్ కు) గోప్యంగా ఎలాంటి నమ్మకద్రోహం చేయలేదని తెలుపటానికే మరియు నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహుల కుట్రను సాగనివ్వడు.