Back to Quran

జుజ్

Juz 14

15:1 ... 16:128 · 227 ayahs

అనువాదకుడు Maulana Abder Rahim Ibn Muhammad

  1. Surah Al-HijrBegins here at 15:1

  2. 15:1

    الٓر ۚ تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ وَقُرْءَانٍ مُّبِينٍ

    ʹAlif-Laaam-Raa. Tilka ʹAayaatul Kitaabi wa-Q̣urʹaanim Mubeen.

    అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.[2]

  3. 15:2

    رُّبَمَا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْ كَانُوا۟ مُسْلِمِينَ

    Rubamaa yawaddul laẓeena kafaroo law kaanoo Muslimeen.

    సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు.

  4. 15:3

    ذَرْهُمْ يَأْكُلُوا۟ وَيَتَمَتَّعُوا۟ وَيُلْهِهِمُ ٱلْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ

    Ẓarhum yaʹkuloo wa-yatamattaʻoo wa-yulhihimul ʹamalu fasawfa yaʻlamoon.

    వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.

  5. 15:4

    وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ

    Wa-maaa ʹahlaknaa miñ q̣aryatin ʹillaa wa-lahaa kitaabum maʻloom.

    మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.[1]

  6. 15:5

    مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ

    Maa- tasbiq̣u min ʹummatin ʹAjalahaa wa-maa yastaʹkhiroon.

    ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు.[1]

  7. 15:6

    وَقَالُوا۟ يَـٰٓأَيُّهَا ٱلَّذِى نُزِّلَ عَلَيْهِ ٱلذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ

    Wa-q̣aaloo yaaaʹayyuhal laẓee nuzzila ʻalayhiẓ Ẓikru ʹinnaka lamajnoon.

    మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు.

  8. 15:7

    لَّوْ مَا تَأْتِينَا بِٱلْمَلَـٰٓئِكَةِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

    Law maa- taʹteenaa bil-malaaaʹikati ʹiñ kuñta minaṣ Ṣaadiq̣een?

    "నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు?"

  9. 15:8

    مَا نُنَزِّلُ ٱلْمَلَـٰٓئِكَةَ إِلَّا بِٱلْحَقِّ وَمَا كَانُوٓا۟ إِذًا مُّنظَرِينَ

    Maa- nunazzilul malaaaʹikata bil-Ḥaq̣q̣i illaa wa-maa kaanooo ʹiẓam muñz̤̣areen!

    మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు.[1]

  10. 15:9

    إِنَّا نَحْنُ نَزَّلْنَا ٱلذِّكْرَ وَإِنَّا لَهُۥ لَحَـٰفِظُونَ

    ʹInnaa Naḥnu nazzalnaẓ Ẓikra wa-ʹinnaa lahoo la-Ḥaafiz̤̣oon.

    నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.[1]

  11. 15:10

    وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِى شِيَعِ ٱلْأَوَّلِينَ

    Wa-laq̣ad ʹarsalnaa miñ q̣ablika fee shiyaʻil ʹawwaleen:

    మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము.

  12. 15:11

    وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

    Wa-maa yaʹteehim mir rasoolin ʹillaa kaanoo bihee yastahziʹoon.

    మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు.[1]

  13. 15:12

    كَذَٰلِكَ نَسْلُكُهُۥ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ

    Kaẓaalika naslukuhoo fee q̣uloobil mujrimeen―

    ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము.

  14. 15:13

    لَا يُؤْمِنُونَ بِهِۦ ۖ وَقَدْ خَلَتْ سُنَّةُ ٱلْأَوَّلِينَ

    Laa- yuʹminoona bihee wa-q̣ad khalat sunnatul ʹawwaleen.

    వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.

  15. 15:14

    وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ ٱلسَّمَآءِ فَظَلُّوا۟ فِيهِ يَعْرُجُونَ

    Wa-law fataḥnaa ʻalayhim baabam minas samaaaʹi faz̤̣alloo feehi yaʻrujoon.

    మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ!

  16. 15:15

    لَقَالُوٓا۟ إِنَّمَا سُكِّرَتْ أَبْصَـٰرُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ

    Laq̣aalooo ʹinnamaa sukkirat ʹabṣaarunaa bal naḥnu q̣awmum masḥooroon.

    ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది."[1]

  17. 15:16

    وَلَقَدْ جَعَلْنَا فِى ٱلسَّمَآءِ بُرُوجًا وَزَيَّنَّـٰهَا لِلنَّـٰظِرِينَ

    Wa-laq̣ad jaʻalnaa fis samaaaʹi Buroojañw Wazayyannaahaa linnaaz̤̣ireen;

    మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.

  18. 15:17

    وَحَفِظْنَـٰهَا مِن كُلِّ شَيْطَـٰنٍ رَّجِيمٍ

    Wa-hafiz̤̣naahaa miñ kulli Shayṭaanir rajeem:

    మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా [1]

  19. 15:18

    إِلَّا مَنِ ٱسْتَرَقَ ٱلسَّمْعَ فَأَتْبَعَهُۥ شِهَابٌ مُّبِينٌ

    ʹIllaa manis taraq̣as samʻa faʹatbaʻahoo shihaabum mubeen.

    కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది.[1]

  20. 15:19

    وَٱلْأَرْضَ مَدَدْنَـٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ شَىْءٍ مَّوْزُونٍ

    Wal-ʹarḍa madadnaahaa wa-ʹalq̣aynaa feehaa rawaasiya wa-ʹambatnaa feehaa miñ kulli shayʹim mawzoon.

    మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము.

  21. 15:20

    وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَـٰيِشَ وَمَن لَّسْتُمْ لَهُۥ بِرَٰزِقِينَ

    Wa-jaʻalnaa lakum feehaa maʻaayisha wa-mal lastum lahoo biraaziq̣een.

    మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.[1]

  22. 15:21

    وَإِن مِّن شَىْءٍ إِلَّا عِندَنَا خَزَآئِنُهُۥ وَمَا نُنَزِّلُهُۥٓ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ

    Wa-ʹim miñ shayʹin ʹillaa ʻiñdanaa khazaaaʹinuh; wa-maa nunazziluhooo ʹillaa biq̣adarim maʻloom.

    మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.

  23. 15:22

    وَأَرْسَلْنَا ٱلرِّيَـٰحَ لَوَٰقِحَ فَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَسْقَيْنَـٰكُمُوهُ وَمَآ أَنتُمْ لَهُۥ بِخَـٰزِنِينَ

    Wa-ʹarsalnar riyaaḥa lawaaq̣iḥa faʹañzalnaa minas samaaaʹi maaaʹañ faʹasq̣aynaakumooh: wa-maaa ʹañtum lahoo bikhaazineen.

    మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!

  24. 15:23

    وَإِنَّا لَنَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَنَحْنُ ٱلْوَٰرِثُونَ

    Wa-ʹinnaa lanaḥnu nuḥyee wa-numeetu wa-naḥnul waaris̤oon.

    మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము.[1]

  25. 15:24

    وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَـْٔخِرِينَ

    Wa-laq̣ad ʻalimnal mustaq̣dimeena miñkum wa-laq̣ad ʻalimnal mustaʹkhireen.

    మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.[1]

  26. 15:25

    وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ ۚ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٌ

    Wa-ʹinna Rabbaka Huwa yaḥshuruhum: ʹinnahoo Ḥakeemun ʻAleem.

    మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.

  27. 15:26

    وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ مِن صَلْصَـٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ

    Wa-laq̣ad khalaq̣nal ʹiñsaana miñ ṣalṣaalim min ḥamaʹim masnoon:

    మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము.[1]

  28. 15:27

    وَٱلْجَآنَّ خَلَقْنَـٰهُ مِن قَبْلُ مِن نَّارِ ٱلسَّمُومِ

    Waljaaanna khalaq̣naahu miñ q̣ablu min naaris samoom.

    మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము.[1]

  29. 15:28

    وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَـٰٓئِكَةِ إِنِّى خَـٰلِقٌۢ بَشَرًا مِّن صَلْصَـٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ

    Wa-ʹiẓ q̣aala Rabbuka lilmalaaaʹikati ʹinnee khaaliq̣um basharam miñ ṣalṣaalim min ḥamaʹim masnoon;

    మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.

  30. 15:29

    فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَـٰجِدِينَ

    Faʹiẓaa sawwaytuhoo wa-nafakhtu feehi mir Rooḥee faq̣aʻoo lahoo saajideen.

    ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి."[1]

  31. 15:30

    فَسَجَدَ ٱلْمَلَـٰٓئِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ

    Fasajadal malaaaʹikatu kulluhum ʹajmaʻoon.

    అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు -

  32. 15:31

    إِلَّآ إِبْلِيسَ أَبَىٰٓ أَن يَكُونَ مَعَ ٱلسَّـٰجِدِينَ

    ʹIllaaa ʹIblees: ʹabaaa ʹañy yakoona maʻas Saajideen.

    ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు.[1]

  33. 15:32

    قَالَ يَـٰٓإِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ ٱلسَّـٰجِدِينَ

    Q̣aala yaaaʹIbleesu maa- laka ʹallaa takoona maʻas Saajideen?

    (అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు?"

  34. 15:33

    قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُۥ مِن صَلْصَـٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ

    Q̣aala lam ʹakul liʹasjuda libasharin khalaq̣tahoo miñ ṣalṣaalim min ḥamaʹim masnoon.

    (ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను."

  35. 15:34

    قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ

    Q̣aala fakhruj minhaa faʹinnaka rajeem.

    (అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు!

  36. 15:35

    وَإِنَّ عَلَيْكَ ٱللَّعْنَةَ إِلَىٰ يَوْمِ ٱلدِّينِ

    Wa-ʹinna ʻalaykal laʻnata ʹilaa Yawmid Deen.

    మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది."

  37. 15:36

    قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

    Q̣aala Rabbi faʹañz̤̣irneee ʹilaa Yawmi yubʻas̤oon.

    (ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు!"

  38. 15:37

    قَالَ فَإِنَّكَ مِنَ ٱلْمُنظَرِينَ

    Q̣aala faʹinnaka minal muñz̤̣areen―

    (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు!

  39. 15:38

    إِلَىٰ يَوْمِ ٱلْوَقْتِ ٱلْمَعْلُومِ

    ʹIlaa Yawmil Waq̣til Maʻloom.

    (నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు!"

  40. 15:39

    قَالَ رَبِّ بِمَآ أَغْوَيْتَنِى لَأُزَيِّنَنَّ لَهُمْ فِى ٱلْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ

    Q̣aala Rabbi bimaaa ʹag̣waytanee laʹuzayyinanna lahum fil ʹarḍi walaʹug̣wiyannahum ʹajmaʻeen,―

    (ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను.

  41. 15:40

    إِلَّا عِبَادَكَ مِنْهُمُ ٱلْمُخْلَصِينَ

    ʹIllaa ʻibaadaka minhumul Mukhlaṣeen.

    వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప!"

  42. 15:41

    قَالَ هَـٰذَا صِرَٰطٌ عَلَىَّ مُسْتَقِيمٌ

    Q̣aala haaẓaa Ṣiraaṭun ʻalayya Mustaq̣eem.

    (అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.[1]

  43. 15:42

    إِنَّ عِبَادِى لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَـٰنٌ إِلَّا مَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْغَاوِينَ

    ʹInna ʻibaadee laysa laka ʻalayhim sulṭaanun ʹillaa manit tabaʻaka minal g̣aaween.

    నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప![1]

  44. 15:43

    وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ

    Wa-ʹinna Jahannama lamawʻiduhum ʹajmaʻeen!

    మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే!

  45. 15:44

    لَهَا سَبْعَةُ أَبْوَٰبٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ

    Lahaa sabʻatu ʹAbwaab: likulli Baabim minhum juzʹum maq̣soom.

    దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి.[1] వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు.

  46. 15:45

    إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّـٰتٍ وَعُيُونٍ

    ʹInnal Muttaq̣eena fee Jannaatiñw Waʻuyoon.

    నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు.

  47. 15:46

    ٱدْخُلُوهَا بِسَلَـٰمٍ ءَامِنِينَ

    ʹUdkhuloohaa bi-Salaamin ʹAamineen.

    వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు.

  48. 15:47

    وَنَزَعْنَا مَا فِى صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَٰنًا عَلَىٰ سُرُرٍ مُّتَقَـٰبِلِينَ

    Wanazaʻnaa maa- fee ṣudoorihim min g̣illin ʹikhwaanan ʻalaa sururim mutaq̣aabileen.

    వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు.[1]

  49. 15:48

    لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ

    Laa- yamassuhum feehaa naṣabuñw wamaa hum minhaa bimukhrajeen.

    అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు."

  50. 15:49

    ۞ نَبِّئْ عِبَادِىٓ أَنِّىٓ أَنَا ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

    Nabbiʹ ʻibaadeee ʹanneee ʹan al-G̣afoorur Raḥeem;

    నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.[1]

  51. 15:50

    وَأَنَّ عَذَابِى هُوَ ٱلْعَذَابُ ٱلْأَلِيمُ

    Wa-ʹanna ʻAẓaabee huwal ʻAẓaabul ʹaleem.

    మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష!

  52. 15:51

    وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَٰهِيمَ

    Wa-nabbiʹhum ʻañ ḍayfi ʹIbraaheem.

    మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు.[1]

  53. 15:52

    إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَـٰمًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ

    ʹIẓ dakhaloo ʻalayhi faq̣aaloo Salaamaa! Q̣aala ʹinnaa miñkum wajiloon!

    వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది."[1]

  54. 15:53

    قَالُوا۟ لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَـٰمٍ عَلِيمٍ

    Q̣aaloo laa- tawjal ʹinnaa nubashshiruka big̣ulaamin ʻaleem.

    వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము."

  55. 15:54

    قَالَ أَبَشَّرْتُمُونِى عَلَىٰٓ أَن مَّسَّنِىَ ٱلْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ

    Q̣aala ʹabashshartumoonee ʻalaaa ʹam massaniyal kibaru fabima tubashshiroon?

    (ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు?"

  56. 15:55

    قَالُوا۟ بَشَّرْنَـٰكَ بِٱلْحَقِّ فَلَا تَكُن مِّنَ ٱلْقَـٰنِطِينَ

    Q̣aaloo bashsharnaaka bilḥaq̣q̣i falaa takum minal q̣aaniṭeen!

    వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు."

  57. 15:56

    قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ

    Q̣aala wa-mañy yaq̣naṭu mir Raḥmati Rabbiheee ʹillaḍ ḍaaalloon?

    (ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?"

  58. 15:57

    قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ

    Q̣aala famaa khaṭbukum ʹayyuhal Mursaloon?

    (ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?"

  59. 15:58

    قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ

    Q̣aalooo ʹinnaaa ʹursilnaaa ʹilaa q̣awmim mujrimeen.

    వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము [1] -

  60. 15:59

    إِلَّآ ءَالَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ

    ʹIllaa ʹAala Looṭ: ʹinnaa lamunajjoohum ʹajmaʻeen,―

    లూత్ ఇంటివారు[1] తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము;

  61. 15:60

    إِلَّا ٱمْرَأَتَهُۥ قَدَّرْنَآ ۙ إِنَّهَا لَمِنَ ٱلْغَـٰبِرِينَ

    ʹIllam raʹatahoo q̣addarnaaa ʹinnahaa laminal g̣aabireen.

    అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."[1]

  62. 15:61

    فَلَمَّا جَآءَ ءَالَ لُوطٍ ٱلْمُرْسَلُونَ

    Falammaa jaaaʹa ʹAala Looṭinil mursaloon.

    తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు;

  63. 15:62

    قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ

    Q̣aala ʹinnakum q̣awmum muñkaroon.

    (లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."[1]

  64. 15:63

    قَالُوا۟ بَلْ جِئْنَـٰكَ بِمَا كَانُوا۟ فِيهِ يَمْتَرُونَ

    Q̣aaloo bal jiʹnaaka bimaa kaanoo feehi yamtaroon.

    వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.[1]

  65. 15:64

    وَأَتَيْنَـٰكَ بِٱلْحَقِّ وَإِنَّا لَصَـٰدِقُونَ

    Wa-ʹataynaaka bil-Ḥaq̣q̣i wa-ʹinnaa laṣaadiq̣oon.

    మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.

  66. 15:65

    فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ ٱلَّيْلِ وَٱتَّبِعْ أَدْبَـٰرَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَٱمْضُوا۟ حَيْثُ تُؤْمَرُونَ

    Faʹasri biʹahlika biq̣iṭʻim minal layli wattabiʻ adbaarahum wa-laa yaltafit miñkum ʹaḥaduñw wamḍoo ḥays̤u tuʹmaroon.

    కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి."

  67. 15:66

    وَقَضَيْنَآ إِلَيْهِ ذَٰلِكَ ٱلْأَمْرَ أَنَّ دَابِرَ هَـٰٓؤُلَآءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ

    Wa-q̣aḍaynaaa ʹilayhi ẓaalikal ʹamra ʹanna daabira haaaʹulaaaʹi maq̣ṭooʻum muṣbiḥeen.

    మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు."

  68. 15:67

    وَجَآءَ أَهْلُ ٱلْمَدِينَةِ يَسْتَبْشِرُونَ

    Wa-jaaaʹa ʹahlul Madeenati yastabshiroon.

    మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు.

  69. 15:68

    قَالَ إِنَّ هَـٰٓؤُلَآءِ ضَيْفِى فَلَا تَفْضَحُونِ

    Q̣aala ʹinna haaaʹulaaaʹi ḍayfee falaa tafḍaḥoon:

    (లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.[1]

  70. 15:69

    وَٱتَّقُوا۟ ٱللَّهَ وَلَا تُخْزُونِ

    Wattaq̣ul laaha wa-laa tukhzoon.

    మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి."

  71. 15:70

    قَالُوٓا۟ أَوَلَمْ نَنْهَكَ عَنِ ٱلْعَـٰلَمِينَ

    Q̣aalooo ʹawalam nanhaka ʻanil ʻaalameen?

    వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా?"[1]

  72. 15:71

    قَالَ هَـٰٓؤُلَآءِ بَنَاتِىٓ إِن كُنتُمْ فَـٰعِلِينَ

    Q̣aala haaaʹulaaaʹi banaateee ʹiñ kuñtum faaʻileen.

    (లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు."[1]

  73. 15:72

    لَعَمْرُكَ إِنَّهُمْ لَفِى سَكْرَتِهِمْ يَعْمَهُونَ

    Laʻamruka ʹinnahum lafee sakratihim yaʻmahoon.

    "నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు."[1] (అని దైవదూతలు అన్నారు.)

  74. 15:73

    فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ

    Faʹakhaẓathumuṣ Ṣayḥatu mushriq̣een.

    ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది.

  75. 15:74

    فَجَعَلْنَا عَـٰلِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ

    Fajaʻalnaa ʻaaliyahaa saafilahaa wa-ʹamṭarnaa ʻalayhim ḥijaaratam miñ sijjeel.

    తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము.

  76. 15:75

    إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّلْمُتَوَسِّمِينَ

    ʹInna fee ẓaalika laʹAayaatil lilmutawassimeen.

    నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి.

  77. 15:76

    وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ

    Wa-ʹinnahaa labisabeelim muq̣eem.

    మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది.

  78. 15:77

    إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ

    ʹInna fee ẓaalika laʹAayatal lil-Muʹmineen.

    నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది.

  79. 15:78

    وَإِن كَانَ أَصْحَـٰبُ ٱلْأَيْكَةِ لَظَـٰلِمِينَ

    Wa-ʹiñ kaana ʹAṣḥaabul ʹAykati laz̤̣aalimeen.

    మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.[1]

  80. 15:79

    فَٱنتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ

    Fañtaq̣amnaa minhum. Wa-ʹinnahumaa labiʹimaamim mubeen.

    కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి.[1]

  81. 15:80

    وَلَقَدْ كَذَّبَ أَصْحَـٰبُ ٱلْحِجْرِ ٱلْمُرْسَلِينَ

    Wa-laq̣ad kaẓẓaba ʻAṣḥaabul ḤIJRIL mursaleen:

    మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.[1]

  82. 15:81

    وَءَاتَيْنَـٰهُمْ ءَايَـٰتِنَا فَكَانُوا۟ عَنْهَا مُعْرِضِينَ

    Wa-ʹaataynaahum ʹAayaatinaa fakaanoo ʻanhaa muʻriḍeen.

    మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు. [1]

  83. 15:82

    وَكَانُوا۟ يَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا ءَامِنِينَ

    Wa-kaanoo yanḥitoona minal jibaali buyootan ʹaamineen.

    మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు,[1] సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!

  84. 15:83

    فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُصْبِحِينَ

    Faʹakhaẓathumuṣ Ṣayḥatu muṣbiḥeen.

    చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది.

  85. 15:84

    فَمَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

    Famaaa ʹag̣naa ʻanhum maa kaanoo yaksiboon!

    అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది.

  86. 15:85

    وَمَا خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ ۗ وَإِنَّ ٱلسَّاعَةَ لَـَٔاتِيَةٌ ۖ فَٱصْفَحِ ٱلصَّفْحَ ٱلْجَمِيلَ

    Wa-maa khalaq̣nas samaawaati wal-ʹarḍa wa-maa baynahumaaa ʹillaa bilḥaq̣q̣. Wa-ʹinnas Saaʻata laʹaatiyatuñ faṣfaḥiṣ ṣafḥal jameel.

    మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే[1] సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు!

  87. 15:86

    إِنَّ رَبَّكَ هُوَ ٱلْخَلَّـٰقُ ٱلْعَلِيمُ

    ʹInna Rabbaka Huwal Khallaaq̣ul ʻAleem.

    నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త,[1] సర్వజ్ఞుడు.[2]

  88. 15:87

    وَلَقَدْ ءَاتَيْنَـٰكَ سَبْعًا مِّنَ ٱلْمَثَانِى وَٱلْقُرْءَانَ ٱلْعَظِيمَ

    Wa-laq̣ad ʹaataynaaka Sabʻam minal mas̤aanee wal-Q̣urʹaanal ʻAz̤̣eem.

    మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.[1]

  89. 15:88

    لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَٱخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ

    Laa- tamuddanna ʻaynayka ʹilaa maa- mattaʻnaa biheee ʹazwaajam minhum wa-laa taḥzan ʻalayhim wakhfiḍ janaaḥaka lil-Muʹmineen.

    వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు.[1]

  90. 15:89

    وَقُلْ إِنِّىٓ أَنَا ٱلنَّذِيرُ ٱلْمُبِينُ

    Wa-q̣ul ʹinneee ʹanan naẓeerul mubeen,―

    మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే!"

  91. 15:90

    كَمَآ أَنزَلْنَا عَلَى ٱلْمُقْتَسِمِينَ

    Kamaaa ʹañzalnaa ʻalal muq̣tasimeen,―

    ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో![1]

  92. 15:91

    ٱلَّذِينَ جَعَلُوا۟ ٱلْقُرْءَانَ عِضِينَ

    ʹAllaẓeena jaʻalul Q̣urʹaana ʻi-ḍeen.

    ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో!

  93. 15:92

    فَوَرَبِّكَ لَنَسْـَٔلَنَّهُمْ أَجْمَعِينَ

    Fawa-Rabbika lanasʹalannahum ʹajmaʻeen.

    నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము;

  94. 15:93

    عَمَّا كَانُوا۟ يَعْمَلُونَ

    ʻAmmaa kaanoo yaʻmaloon.

    వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి.

  95. 15:94

    فَٱصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ ٱلْمُشْرِكِينَ

    Faṣdaʻ bimaa tuʹmaru wa-ʹaʻriḍ ʻanil mushrikeen.

    కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు.[1] మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు.

  96. 15:95

    إِنَّا كَفَيْنَـٰكَ ٱلْمُسْتَهْزِءِينَ

    ʹInnaa kafaynaakal mustahziʹeen.

    నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు!

  97. 15:96

    ٱلَّذِينَ يَجْعَلُونَ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ

    ʹAllaẓeena yajʻaloona maʻal laahi ʹilaahan ʹaakhar: fasawfa yaʻlamoon.

    ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు.

  98. 15:97

    وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ

    Wa-laq̣ad naʻlamu ʹannaka yaḍeeq̣u ṣadruka bimaa yaq̣ooloon.

    మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు.

  99. 15:98

    فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ ٱلسَّـٰجِدِينَ

    Fasabbiḥ biḥamdi Rabbika wa-kum minas Saajideen.

    కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు.

  100. 15:99

    وَٱعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ ٱلْيَقِينُ

    Waʻbud Rabbaka ḥattaa yaʹtiyakal yaq̣een.

    మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.[1]

  101. Surah An-NahlBegins here at 16:1

  102. 16:1

    أَتَىٰٓ أَمْرُ ٱللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

    ʹAtaaa ʹAmrul laahi falaa tastaʻjilooh: Subḥaanahoo wa-taʻaalaa ʻammaa yushrikoon.

    అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాములకు అత్యున్నతుడు.

  103. 16:2

    يُنَزِّلُ ٱلْمَلَـٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنْ أَمْرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ أَنْ أَنذِرُوٓا۟ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ

    Yunazzilul malaaaʹikata birrooḥi min ʹAmrihee ʻalaa mañy yashaaaʹu min ʻibaadiheee ʹan ʹañẓirooo ʹannahoo Laaa ʹilaaha ʹillaaa ʹana fattaq̣oon.

    ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) [1]తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు,[2] వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: "నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి!"

  104. 16:3

    خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۚ تَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

    Khalaq̣as samaawaati wal-ʹarḍa bilḥaq̣q̣: Taʻaalaa ʻammaa yushrikoon!

    ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు.[1]

  105. 16:4

    خَلَقَ ٱلْإِنسَـٰنَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ

    Khalaq̣al ʹiñsaana min nuṭfatiñ faʹiẓaa huwa khaṣeemum mubeen!

    ఆయన మానవుణ్ణి ఇంద్రియ (వీర్య) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు.

  106. 16:5

    وَٱلْأَنْعَـٰمَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَـٰفِعُ وَمِنْهَا تَأْكُلُونَ

    Wal-ʹanʻaama khalaq̣ahaa lakum feehaa difʹuñw wamanaafiʻu wa-minhaa taʹkuloon.

    మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు.

  107. 16:6

    وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ

    Wa-lakum feehaa jamaalun ḥeena tureeḥoona waḥeena tasraḥoon.

    మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోసుకొని పోయేటప్పుడు, వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది.

  108. 16:7

    وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا۟ بَـٰلِغِيهِ إِلَّا بِشِقِّ ٱلْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ

    Wa-taḥmilu ʹas̤q̣aalakum ʹilaa baladil lam takoonoo baalig̣eehi ʹillaa bishiq̣q̣il ʹañfus: ʹinna Rabbakum la-Raʹoofur Raḥeem.

    మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - తీసుకుపోతాయి. నిశ్చంయగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.

  109. 16:8

    وَٱلْخَيْلَ وَٱلْبِغَالَ وَٱلْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ

    Walkhayla wal-big̣aala wal-ḥameera litarkaboohaa wa-zeenah; wa-yakhluq̣u maa laa- taʻlamoon.

    మరియు ఆయన గుర్రాలను[1], కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టించాడు[2].

  110. 16:9

    وَعَلَى ٱللَّهِ قَصْدُ ٱلسَّبِيلِ وَمِنْهَا جَآئِرٌ ۚ وَلَوْ شَآءَ لَهَدَىٰكُمْ أَجْمَعِينَ

    Wa-ʻalal laahi q̣aṣdus Sabeeli wa-minhaa jaaaʹir: wa-law shaaaʹa lahadaakum ʹajmaʻeen.

    మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం[1] మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు[2].

  111. 16:10

    هُوَ ٱلَّذِىٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ

    Huwal laẓeee ʹañzala minas samaaaʹi maaaʹal lakum minhu sharaabuñw waminhu shajaruñ feehi tuseemoon.

    ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది.

  112. 16:11

    يُنۢبِتُ لَكُم بِهِ ٱلزَّرْعَ وَٱلزَّيْتُونَ وَٱلنَّخِيلَ وَٱلْأَعْنَـٰبَ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

    Yumbitu lakum̃ bihiz zarʻa wazzaytoona wannakheela wal-ʹaʻnaaba wa-miñ kullis̤ s̤amaraat: ʹinna fee ẓaalika laʹAayatal liq̣awmiñy yatafakkaroon.

    ఆయన దీని (నీటి) ద్వారా మీ కొరకు పంటలను, జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా, ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన (నిదర్శనం) ఉంది.

  113. 16:12

    وَسَخَّرَ لَكُمُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ وَٱلنُّجُومُ مُسَخَّرَٰتٌۢ بِأَمْرِهِۦٓ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ

    Wa-sakhkhara lakumul layla wannahaara washshamsa walq̣amar; wannujoomu musakhkharaatum biʹAmrih: ʹinna fee ẓaalika laʹAayaatil liq̣awmiñy yaʻq̣iloon.

    మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను, మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి[1]. నిశ్చయంగా, బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి.

  114. 16:13

    وَمَا ذَرَأَ لَكُمْ فِى ٱلْأَرْضِ مُخْتَلِفًا أَلْوَٰنُهُۥٓ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ

    Wa-maa ẓaraʹa lakum fil ʹarḍi mukhtalifan ʹalwaanuh: ʹinna fee ẓaalika laʹaayatal liq̣awmiñy yaẓẓakkaroon.

    మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చయంగా, హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది.

  115. 16:14

    وَهُوَ ٱلَّذِى سَخَّرَ ٱلْبَحْرَ لِتَأْكُلُوا۟ مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا۟ مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى ٱلْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

    Wa-Huwal laẓee sakhkharal baḥra litaʹkuloo minhu laḥmañ ṭariyyañw watastakhrijoo minhu ḥilyatañ talbasoonahaa: wa-taral fulka mawaakhira feehi wa-litabtag̣oo miñ faḍlihee wa-laʻallakum tashkuroon.

    మరియు ఆయన సముద్రాన్ని - తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి - మీకు ఉపయుక్తమైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు).

  116. 16:15

    وَأَلْقَىٰ فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَـٰرًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ

    Wa-ʹalq̣aa fil ʹarḍi rawaasiya ʹañ tameeda bikum wa-ʹanhaarañw wasubulal laʻallakum tahtadoon:

    మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు[1]. మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు. బహుశా మీరు మార్గం పొందుతారని!

  117. 16:16

    وَعَلَـٰمَـٰتٍ ۚ وَبِٱلنَّجْمِ هُمْ يَهْتَدُونَ

    Wa-ʻalaamaat; wa-binnajmi hum yahtadoon.

    మరియు (భూమిలో మార్గం చూపే) సంకేతాలను పెట్టాడు. మరియు వారు (ప్రజలు) నక్షత్రాల ద్వారా కూడా తమ మార్గాలు తెలుసుకుంటారు.

  118. 16:17

    أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ

    ʹAfamañy yakhluq̣u kamal laa yakhluq̣? ʹAfalaa taẓakkaroon?

    సృష్టించేవాడూ అసలు ఏమీ సృష్టించలేని వాడూ సమానులా? ఇది మీరెందుకు గమనించరు?

  119. 16:18

    وَإِن تَعُدُّوا۟ نِعْمَةَ ٱللَّهِ لَا تُحْصُوهَآ ۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٌ رَّحِيمٌ

    Wa-ʹiñ taʻuddoo niʻmatal laahi laa- tuḥṣoohaa: ʹinnal laaha la-G̣afoorur Raḥeem.

    మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

  120. 16:19

    وَٱللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ

    Wallaahu yaʻlamu maa- tusirroona wa-maa tuʻlinoon.

    మరియు అల్లాహ్ కు మీరు దాచేవి మరియు మీరు వెలిబుచ్చేవి అన్నీ తెలుసు.

  121. 16:20

    وَٱلَّذِينَ يَدْعُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَخْلُقُونَ شَيْـًٔا وَهُمْ يُخْلَقُونَ

    Wallaẓeena yadʻoona miñ doonil laahi laa- yakhluq̣oona shayʹañw wahum yukhlaq̣oon.

    మరియు ఎవరినైతే వారు (ప్రజలు), అల్లాహ్ ను వదలి ప్రార్థిస్తున్నారో, వారు ఏమీ సృష్టించలేరు మరియు స్వయంగా వారే సృష్టించబడి ఉన్నారు.

  122. 16:21

    أَمْوَٰتٌ غَيْرُ أَحْيَآءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

    ʹAmwaatun g̣ayru ʹaḥyaaaʹ: wa-maa yashʻuroona ʹayyaana yubʻas̤oon.

    వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణం లేనివారు[1]. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు.

  123. 16:22

    إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَٰحِدٌ ۚ فَٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ

    ʹIlaahukum ʹIlaahuñw Waaḥid: fallaẓeena laa- yuʹminoona bil-ʹAakhirati q̣uloobuhum muñkiratuñw wahum mustakbiroon.

    మీ ఆరాధ్య దైవం కేవలం (అల్లాహ్) ఒక్కడే! పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు (ఈ సత్యాన్ని) తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు[1].

  124. 16:23

    لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْتَكْبِرِينَ

    Laa- jarama ʹannal laaha yaʻlamu maa- yusirroona wa-maa yuʻlinoon: ʹinnahoo laa- yuḥibbul mustakbireen.

    నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా దురహంకారులంటే[1] ఆయన ఇష్టపడడు.

  125. 16:24

    وَإِذَا قِيلَ لَهُم مَّاذَآ أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوٓا۟ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ

    Wa-ʹiẓaa q̣eela lahum maaẓaaa ʹañzala Rabbukum q̣aalooo ʹasaaṭeerul ʹawwaleen?

    మరియు: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని వారిని అడిగినప్పుడు, వారు: "అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే!" అని జవాబిస్తారు.

  126. 16:25

    لِيَحْمِلُوٓا۟ أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۙ وَمِنْ أَوْزَارِ ٱلَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَآءَ مَا يَزِرُونَ

    Liyaḥmilooo ʹawzaarahum kaamilatañy Yawmal Q̣iyaamati wa-min ʹawzaaril laẓeena yuḍilloonahum̃ big̣ayri ʻilm. ʹAlaa saaaʹa maa- yaziroon!

    కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంతభాగాన్ని కూడా మోస్తారు[1]. వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి!

  127. 16:26

    قَدْ مَكَرَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى ٱللَّهُ بُنْيَـٰنَهُم مِّنَ ٱلْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ ٱلسَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَىٰهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ

    Q̣ad makaral laẓeena miñ q̣ablihim faʹatal laahu bunyaanahum minal q̣awaaʻidi fakharra ʻalayhimus saq̣fu miñ fawq̣ihim wa-ʹataahumul ʻaẓaabu min ḥays̤u laa- yashʻuroon.

    వాస్తవానికి, వారి కంటే పూర్వం గతించిన వారు కూడా (అల్లాహ్ సందేశాలకు వ్యతిరేకంగా) కుట్రలు పన్నారు. కాని అల్లాహ్ వారి (పన్నాగపు) కట్టడాలను వాటి పునాదులతో సహా పెకలించాడు. దానితో వాటి కప్పులు వారి మీద పడ్డాయి మరియు వారిపై, వారు ఊహించని వైపు నుండి శిక్ష వచ్చి పడింది.

  128. 16:27

    ثُمَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تُشَـٰٓقُّونَ فِيهِمْ ۚ قَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ إِنَّ ٱلْخِزْىَ ٱلْيَوْمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلْكَـٰفِرِينَ

    S̤umma Yawmal Q̣iyaamati yukhzeehim wa-yaq̣oolu ʹayna shurakaaaʹiyal laẓeena kuñtum tushaaaq̣q̣oona feehim? Q̣aalal laẓeena ʹootul ʻilma ʹinnal khizyal yawma wassoooʹa ʻalal kaafireen,―

    తరువాత పునరుత్థాన దినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: "మీరు నాకు సాటి కల్పించిన వారు - ఎవరిని గురించి అయితే మీరు (విశ్వాసులతో) వాదులాడేవారో - ఇప్పుడు ఎక్కడున్నారు?" జ్ఞానం ప్రసాదించబడిన వారు అంటారు: "నిశ్చయంగా, ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్యతిరస్కారుల కొరకే!"

  129. 16:28

    ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ ظَالِمِىٓ أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا۟ ٱلسَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوٓءٍۭ ۚ بَلَىٰٓ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

    ʹAllaẓeena tatawaffaahumul malaaaʹikatu z̤̣aalimeee ʹañfusihim. Faʹalq̣awus salama maa- kunnaa naʻmalu miñ soooʹ. Balaaa ʹInnal laaha ʻAleemum bimaa kuntum taʻmaloon.

    "వారిపై, ఎవరైతే, తమను తాము దుర్మార్గంలో ముంచుకొని ఉన్నప్పుడు, దేవదూతలు వారి ప్రాణాలు తీస్తారో!" అప్పుడు వారు (సత్యతిరస్కారులు) లొంగి పోయి: "మేము ఎలాంటి పాపం చేయలేదు."[1] అని అంటారు. (దేవదూతలు వారితో ఇలా అంటారు): "అలా కాదు! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు."

  130. 16:29

    فَٱدْخُلُوٓا۟ أَبْوَٰبَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى ٱلْمُتَكَبِّرِينَ

    Fadkhulooo ʹabwaaba Jahannama khaalideena feeha. Falabiʹsa mas̤wal mutakabbireen.

    "కావున నరక ద్వారాలలో ప్రవేశించండి. అక్కడ శాశ్వతంగా ఉండటానికి! గర్విష్ఠులకు లభించే నివాసం ఎంత చెడ్డది!"

  131. 16:30

    ۞ وَقِيلَ لِلَّذِينَ ٱتَّقَوْا۟ مَاذَآ أَنزَلَ رَبُّكُمْ ۚ قَالُوا۟ خَيْرًا ۗ لِّلَّذِينَ أَحْسَنُوا۟ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ ٱلْـَٔاخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ ٱلْمُتَّقِينَ

    Wa-q̣eela lillaẓeenat taq̣aw maaẓaaa ʹañzala Rabbukum? Q̣aaloo khayraa. Lillaẓeena ʹaḥsanoo fee haaẓihid dunyaa ḥasanah. Wa-la-Daarul ʹAakhirati khayr. Wa-laniʻma Daarul Muttaq̣een,―

    మరియు దైవభీతి గలవారితో: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని అడిగినప్పుడు, వారు: "అత్యుత్తమమైనది." అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీని కంటే ఉత్తమమైంది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది.

  132. 16:31

    جَنَّـٰتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَآءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِى ٱللَّهُ ٱلْمُتَّقِينَ

    Jannaatu ʻAdniñy yadkhuloonahaa tajree miñ taḥtihal ʹanhaaru lahum feehaa maa- yashaaaʹoon: kaẓaalika yajzil laahul Muttaq̣een,―

    వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు.

  133. 16:32

    ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَـٰمٌ عَلَيْكُمُ ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

    ʹAllaẓeena tatawaffaahumul malaaaʹikatu ṭayyibeena yaq̣ooloona Salaamun ʻalaykumud khulul Jannata bimaa kuñtum taʻmaloon.

    ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: "మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు[1].

  134. 16:33

    هَلْ يَنظُرُونَ إِلَّآ أَن تَأْتِيَهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ أَوْ يَأْتِىَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

    Hal yañz̤̣uroona ʹillaaa ʹañ taʹtiyahumul malaaaʹikatu ʹaw yaʹtiya ʹAmru Rabbik? Kaẓaalika faʻalal laẓeena miñ q̣ablihim. Wa-maa z̤̣alamahumul laahu wa-laakiñ kaanooo ʹañfusahum yaz̤̣limoon.

    ఏమీ? వారు (సత్యతిరస్కారులు) తమ వద్దకు దేవదూతల రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ (తీర్పు) కోసం ఎదురు చూస్తున్నారా?[1] వారికి పూర్వం ఉన్నవారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

  135. 16:34

    فَأَصَابَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

    Faʹaṣaabahum sayyiʹaatu maa- ʻamiloo waḥaaq̣a bihim maa kaanoo bihee yastahziʹoon.

    అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంది.[1]

  136. 16:35

    وَقَالَ ٱلَّذِينَ أَشْرَكُوا۟ لَوْ شَآءَ ٱللَّهُ مَا عَبَدْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍ نَّحْنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

    Wa-q̣aalal laẓeena ʹashrakoo law shaaaʹal laahu maa- ʻabadnaa miñ doonihee miñ shayʹin naḥnu wa-laaa ʹaabaaaʹunaa wa-laa ḥarramnaa miñ doonihee miñ shayyʹ. Kaẓaalika faʻalal laẓeena miñ q̣ablihim Fahal ʻalar rusuli ʹillal Balaag̣ul Mubeen?

    మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రితాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు."[1] వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి?

  137. 16:36

    وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّـٰغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى ٱللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ ٱلضَّلَـٰلَةُ ۚ فَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ

    Wa-laq̣ad baʻas̤naa fee kulli ʹummatir rasoolan ʹaniʻ budul laaha wajtanibuṭ Ṭaag̣oot; faminhum man hadal laahu wa-minhum man ḥaq̣q̣at ʻalayhiḍ ḍalaalah. Faseeroo fil ʹarḍi fañz̤̣uroo kayfa kaana ʻaaq̣ibatul mukaẓẓibeen.

    మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు. మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమై పోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమయిందో!

  138. 16:37

    إِن تَحْرِصْ عَلَىٰ هُدَىٰهُمْ فَإِنَّ ٱللَّهَ لَا يَهْدِى مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ

    ʹIñ taḥriṣ ʻalaa hudaahum faʹinnal laaha laa- yahdee mañy yuḍillu wa-maa lahum min naaṣireen.

    ఇక (ఓ ముహమ్మద్!) నీవు వారిని సన్మార్గానికి తేవాలని ఎంత కోరుకున్నా! నిశ్చయంగా, అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వానికి సన్మార్గం చూపడు[1]. వారికి సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు.

  139. 16:38

    وَأَقْسَمُوا۟ بِٱللَّهِ جَهْدَ أَيْمَـٰنِهِمْ ۙ لَا يَبْعَثُ ٱللَّهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

    Wa-ʹaq̣samoo billaahi jahda ʹaymaanihim laa- yabʻas̤ul laahu mañy yamoot: balaa waʻdan ʻalayhi ḥaq̣q̣añw walaakinna ʹaks̤aran naasi laa- yaʻlamoon.

    మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: "మరణించిన వానిని అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపడు!" ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది);

  140. 16:39

    لِيُبَيِّنَ لَهُمُ ٱلَّذِى يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّهُمْ كَانُوا۟ كَـٰذِبِينَ

    Liyubayyina lahumul laẓee yakhtalifoona feehi wa-liyaʻlamal laẓeena kafarooo ʹannahum kaanoo kaaẓibeen.

    వారు వాదిస్తూ ఉండిన దానిని గురించి వారికి తెలుపటానికి మరియు సత్యతిరస్కారులు తాము నిశ్చయంగా, అబద్ధమాడుతున్నారని తెలుసుకోవటానికి.

  141. 16:40

    إِنَّمَا قَوْلُنَا لِشَىْءٍ إِذَآ أَرَدْنَـٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ

    ʹInnamaa q̣awlunaa lishayʹin ʹiẓaaa ʹaradnaahu ʹan naq̣oola lahoo Kuñ Fayakoon.

    నిశ్చయంగా, మేము ఏదైనా వస్తువును ఉనికిలోనికి తీసుకురాదలచి నపుడు దానిని మేము: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాము. అంతే! అది అయిపోతుంది.[1]

  142. 16:41

    وَٱلَّذِينَ هَاجَرُوا۟ فِى ٱللَّهِ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ لَنُبَوِّئَنَّهُمْ فِى ٱلدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

    Wallaẓeena haajaroo fil laahi mim baʻdi maa- z̤̣ulimoo lanubawwiʹannahum fid dunyaa ḥasanah; wa-laʹajrul ʹAakhirati ʹakbar. Law kaanoo yaʻlamoon!

    మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్ కొరకు వలస పోతారో;[1] అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము. మరియు వారి పరలోక ప్రతిఫలం దాని కంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది!

  143. 16:42

    ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

    ʹAllaẓeena ṣabaroo wa-ʻalaa Rabbihim yatawakkaloon.

    అలాంటి వారే సహనం వహించిన వారు మరియు తమ ప్రభువును నమ్ముకున్నవారు.

  144. 16:43

    وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِىٓ إِلَيْهِمْ ۚ فَسْـَٔلُوٓا۟ أَهْلَ ٱلذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ

    Wa-maaa ʹarsalnaa miñ q̣ablika ʹillaa rijaalan nooḥeee ʹilayhim, fasʹalooo ʹahlaẓ Ẓikri ʹiñ kuñtum laa- taʻlamoon,―

    మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)![1] మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియకపోతే పూర్వ గ్రంథ ప్రజలను అడగండి.

  145. 16:44

    بِٱلْبَيِّنَـٰتِ وَٱلزُّبُرِ ۗ وَأَنزَلْنَآ إِلَيْكَ ٱلذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ

    Bil-Bayyinaati waz-Zubur; wa-ʹañzalnaaa ʹilaykaẓ Ẓikra litubayyina linnaasi maa- nuzzila ʹilayhim wa-laʻallahum yatafakkaroon.

    (పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (జుబూర్ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని!

  146. 16:45

    أَفَأَمِنَ ٱلَّذِينَ مَكَرُوا۟ ٱلسَّيِّـَٔاتِ أَن يَخْسِفَ ٱللَّهُ بِهِمُ ٱلْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ

    ʹA-faʹaminal laẓeena makarus sayyiʹaati ʹañy yakhsifal laahu bihimul ʹarḍa ʹaw yaʹtiyahumul ʻaẓaabu min ḥays̤u laa- yashʻuroon?

    దుష్టపన్నాగాలు చేస్తున్నవారు - అల్లాహ్ తమను భూమిలోనికి దిగి పోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా - తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి?

  147. 16:46

    أَوْ يَأْخُذَهُمْ فِى تَقَلُّبِهِمْ فَمَا هُم بِمُعْجِزِينَ

    ʹAw yaʹkhuẓahum fee taq̣allubihim famaa hum̃ bimuʻjizeen?―

    లేదా వారు తిరుగాడుతున్నపుడు, అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే, వారు ఆయన (పట్టు) నుండి తప్పించుకోగలరా?

  148. 16:47

    أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ

    ʹAw yaʹkhuẓahum ʻalaa takhawwuf: faʹinna Rabbakum la-Raʹoofur Raḥeem.

    లేదా, వారిని భయకంపితులు జేసి పట్టుకోవచ్చు కదా! కాని నిశ్చయంగా, నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.

  149. 16:48

    أَوَلَمْ يَرَوْا۟ إِلَىٰ مَا خَلَقَ ٱللَّهُ مِن شَىْءٍ يَتَفَيَّؤُا۟ ظِلَـٰلُهُۥ عَنِ ٱلْيَمِينِ وَٱلشَّمَآئِلِ سُجَّدًا لِّلَّهِ وَهُمْ دَٰخِرُونَ

    ʹA-walam yaraw ʹilaa maa- khalaq̣al laahu miñ shayʹiñy yatafayyaʹu z̤̣ilaaluhoo ʻanil yameeni washshamaaaʹili sujjadal lillaahi wa-hum daakhiroon?

    ఏమీ? వారు అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువునూ గమనించటం (చూడటం) లేదా? వాటి నీడలు కుడివైపుకూ, ఎడమ వైపుకూ వంగుతూ ఉండి, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ, ఎలా వినమ్రత చూపుతున్నాయో?[1]

  150. 16:49

    وَلِلَّهِ يَسْجُدُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ مِن دَآبَّةٍ وَٱلْمَلَـٰٓئِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ

    Wa-lillaahi yasjudu maa- fis samaawaati wa-maa fil ʹarḍi miñ daaabbatiñw walmalaaaʹikatu wa-hum laa- yastakbiroon,

    మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. వారెన్నడూ (తమ ప్రభువు సన్నిధిలో) గర్వపడరు.

  151. 16:50

    يَخَافُونَ رَبَّهُم مِّن فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩

    Yakhaafoona Rabbahum miñ fawq̣ihim wayafʻaloona maa- yuʹmaroon.

    వారు తమపై నున్న ప్రభువునకు భయపడుతూ తమకు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకుంటారు.

  152. 16:51

    ۞ وَقَالَ ٱللَّهُ لَا تَتَّخِذُوٓا۟ إِلَـٰهَيْنِ ٱثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَـٰهٌ وَٰحِدٌ ۖ فَإِيَّـٰىَ فَٱرْهَبُونِ

    Waq̣aalal laahu laa- tattakhiẓooo ʹilaahaynis̤ nayn: ʹinnamaa Huwa ʹIlaahuñw Waaḥid: faʹiyyaaya farhaboon.

    మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "(ఓ మానవులారా!) ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య దైవం ఆయన (అల్లాహ్) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి."[1]

  153. 16:52

    وَلَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَلَهُ ٱلدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ ٱللَّهِ تَتَّقُونَ

    Walahoo maa- fis samaawaati wal-ʹarḍi wa-lahud Deenu waaṣibaa: ʹafag̣ayral laahi tattaq̣oon?

    మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు.[1] ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?

  154. 16:53

    وَمَا بِكُم مِّن نِّعْمَةٍ فَمِنَ ٱللَّهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فَإِلَيْهِ تَجْـَٔرُونَ

    Wa-maa bikum min niʻmatiñ faminal laahi s̤umma ʹiẓaa massakumuḍ ḍurru faʹilayhi tajʹaroon;

    మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా![1]

  155. 16:54

    ثُمَّ إِذَا كَشَفَ ٱلضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ

    S̤umma ʹiẓaa kashafaḍ ḍurra ʻañkum ʹiẓaa fareeq̣um miñkum̃ bi-Rabbihim yushrikoon.

    తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) కల్పించ సాగుతారు -

  156. 16:55

    لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ تَعْلَمُونَ

    Liyakfuroo bimaaa ʹaataynaahum! Fatamattaʻoo; fasawfa taʻlamoon!

    మేము చేసిన ఉపకారానికి కృతఘ్నతగా - సరే (కొంతకాలం) సుఖాలను అనుభవించండి. తరువాత మీరు తెలుసుకుంటారు.[1]

  157. 16:56

    وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِّمَّا رَزَقْنَـٰهُمْ ۗ تَٱللَّهِ لَتُسْـَٔلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ

    Wa-yajʻaloona limaa laa- yaʻlamoona naṣeebam mimmaa razaq̣naahum! Tallaahi latusʹalunna ʻammaa kuñtum taftaroon.

    మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటక దైవాల) కొరకు నిర్ణయించుకుంటారు వారు.[1] అల్లాహ్ తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు.

  158. 16:57

    وَيَجْعَلُونَ لِلَّهِ ٱلْبَنَـٰتِ سُبْحَـٰنَهُۥ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ

    Wa-yajʻaloona lillaahil banaati Subḥaanahoo wa-lahum maa yashtahoon!

    మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేది.[1] (నియమించుకుంటారు).

  159. 16:58

    وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِٱلْأُنثَىٰ ظَلَّ وَجْهُهُۥ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ

    Wa-ʹiẓaa bushshira ʹaḥaduhum̃ bil-ʹuñs̤aa z̤̣alla wajhuhoo muswaddañw wahuwa kaz̤̣eem!

    మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడి పోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు.

  160. 16:59

    يَتَوَٰرَىٰ مِنَ ٱلْقَوْمِ مِن سُوٓءِ مَا بُشِّرَ بِهِۦٓ ۚ أَيُمْسِكُهُۥ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُۥ فِى ٱلتُّرَابِ ۗ أَلَا سَآءَ مَا يَحْكُمُونَ

    Yatawaaraa minal q̣awmi miñ soooʹi maa- bushshira bih! ʹA-yumsikuhoo ʻalaa hoonin ʹam yadussuhoo fit turaab? ʹAlaa saaaʹa maa- yaḥkumoon?

    తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చి వేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో![1]

  161. 16:60

    لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ مَثَلُ ٱلسَّوْءِ ۖ وَلِلَّهِ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

    Lillaẓeena laa- yuʹminoona bil-ʹAakhirati mas̤alus sawʹ: wa-lillaahil Mas̤alul ʹAʻlaa: wa-Huwal ʻAzeezul Ḥakeem.

    ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

  162. 16:61

    وَلَوْ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَآبَّةٍ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ لَا يَسْتَـْٔخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ

    Wa-law yuʹaakhiẓul laahun naasa biz̤̣ulmihim maa taraka ʻalayhaa miñ daaabbatiñw walaakiñy yuʹakhkhiruhum ʹilaaa ʹajalim musammaa: faʹiẓaa jaaaʹa ʹajaluhum laa- yastaʹkhiroona saaʻatañw walaa yastaq̣dimoon.

    మరియు ఒకవేళ అల్లాహ్ మానవులను - వారు చేసే దుర్మార్గానికి - పట్టుకో దలిస్తే, భూమిపై ఒక్క ప్రాణిని కూడ వదిలేవాడు కాదు.[1] కాని, ఆయన ఒక నిర్ణీత కాలం వరకు వారికి వ్యవధినిస్తున్నాడు. ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.[2]

  163. 16:62

    وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ ٱلْكَذِبَ أَنَّ لَهُمُ ٱلْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ ٱلنَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ

    Wa-yajʻaloona lillaahi maa- yakrahoona wa-taṣifu ʹalsinatuhumul kaẓiba ʹanna lahumul ḥusnaa: laa- jarama ʹanna lahumun Naara wa-ʹannahum mufraṭoon!

    మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. "నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే)." అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చయంగా, వారందులోకి త్రోయబడి, వదలబడతారు.

  164. 16:63

    تَٱللَّهِ لَقَدْ أَرْسَلْنَآ إِلَىٰٓ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ أَعْمَـٰلَهُمْ فَهُوَ وَلِيُّهُمُ ٱلْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

    Tallaahi laq̣ad ʹarsalnaaa ʹilaaa ʹumamim miñ q̣ablika fazayyana lahumush Shayṭaanu ʹaʻmaalahum fahuwa waliyyuhumul yawma wa-lahum ʻaẓaabun ʹaleem.

    అల్లాహ్ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షైతాన్ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేశాడు. అదే విధంగా ఈనాడు కూడా వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు.[1] మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

  165. 16:64

    وَمَآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِى ٱخْتَلَفُوا۟ فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ

    Wa-maaa ʹañzalnaa ʻalaykal Kitaaba ʹillaa litubayyina lahumul laẓikh talafoo feehi wa-hudañw waraḥmatal liq̣awmiñy yuʹminoon.

    మరియు మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురి అయిన విషయాన్ని వారికి నీవు స్పష్టం చేయటానికీ మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వం గానూ మరియు కారుణ్యం గానూ ఉంచటానికి!

  166. 16:65

    وَٱللَّهُ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَسْمَعُونَ

    Wallaahu ʹañzala minas samaaaʹi maaaʹañ faʹaḥyaa bihil ʹarḍa baʻda mawtihaa: ʹinna fee ẓaalika laʹAayatal liq̣awmiñy yasmaʻoon.

    మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి సూచన ఉంది.

  167. 16:66

    وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَـٰمِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهِۦ مِنۢ بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَآئِغًا لِّلشَّـٰرِبِينَ

    Wa-ʹinna lakum fil ʹanʻaami laʻIbrah. Nusq̣eekum mimmaa fee buṭoonihee mim bayni fars̤iñw wadamil labanan khaaliṣañ saaaʹig̣allish shaaribeen.

    మరియు నిశ్చయంగా, మీకు పశువులలో ఒక గుణపాఠం ది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన (స్వచ్ఛమైన) పాలు, త్రాగేవారికి ఎంతో రుచికరమైనది.

  168. 16:67

    وَمِن ثَمَرَٰتِ ٱلنَّخِيلِ وَٱلْأَعْنَـٰبِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَعْقِلُونَ

    Wa-miñ s̤amaraatin nakheeli wal-ʹaʻnaabi tattakhiẓoona minhu sakarañw warizq̣an ḥasanaa: ʹinna fee ẓaalika laʹAayatal liq̣awmiñy yaʻq̣iloon.

    మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు.[1] నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది.

  169. 16:68

    وَأَوْحَىٰ رَبُّكَ إِلَى ٱلنَّحْلِ أَنِ ٱتَّخِذِى مِنَ ٱلْجِبَالِ بُيُوتًا وَمِنَ ٱلشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ

    Wa-ʹawḥaa Rabbuka ʹilan NAḤLI ʹanit takhiẓee minal jibaali buyootañw waminash shajari wa-mimmaa yaʻrishoon;

    మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు:[1] "నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో!

  170. 16:69

    ثُمَّ كُلِى مِن كُلِّ ٱلثَّمَرَٰتِ فَٱسْلُكِى سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِنۢ بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَٰنُهُۥ فِيهِ شِفَآءٌ لِّلنَّاسِ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

    S̤umma kulee miñ kullis̤ s̤amaraati faslukee subula Rabbiki ẓululaa. Yakhruju mim buṭoonihaa sharaabum mukhtalifun ʹalwaanuhoo feehi shifaaaʹul linnaas: ʹinna fee ẓaalika laʹAayatal liq̣awmiñy yatafakkaroon.

    తరువాత అన్నిరకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు." దాని కడుపు నుండి రంగు రంగుల పానకం (తేనే) ప్రసవిస్తుంది; అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది.

  171. 16:70

    وَٱللَّهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّىٰكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرْذَلِ ٱلْعُمُرِ لِكَىْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْـًٔا ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ قَدِيرٌ

    Wallaahu khalaq̣akum s̤umma yatawaffaakum wa-miñkum mañy yuraddu ʹilaaa ʹarẓalil ʻumuri likay laa- yaʻlama baʻda ʻilmiñ shayʹaa: ʹinnal laaha ʻAleemuñ Q̣adeer.

    మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు.

  172. 16:71

    وَٱللَّهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِى ٱلرِّزْقِ ۚ فَمَا ٱلَّذِينَ فُضِّلُوا۟ بِرَآدِّى رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَهُمْ فِيهِ سَوَآءٌ ۚ أَفَبِنِعْمَةِ ٱللَّهِ يَجْحَدُونَ

    Wallaahu faḍḍala baʻḍakum ʻalaa baʻḍiñ fir rizq̣: famal laẓeena fuḍḍiloo biraaaddee rizq̣ihim ʻalaa maa- malakat ʹaymaanuhum fahum feehi sawaaaʹ. ʹAfabiniʻmatil laahi yajḥadoon?

    మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్న వారికి (బానిసలకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా?

  173. 16:72

    وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَٰجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَـٰتِ ۚ أَفَبِٱلْبَـٰطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ ٱللَّهِ هُمْ يَكْفُرُونَ

    Wallaahu jaʻala lakum min ʹañfusikum ʹazwaajañw Wajaʻala lakum min ʹazwaajikum baneena waḥafadatañw warazaq̣akum minaṭ ṭayyibaat: ʹafabilbaaṭili yuʹminoona wa-biniʻmatil laahi hum yakfuroon?―

    మరియు అల్లాహ్ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారా?

  174. 16:73

    وَيَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ شَيْـًٔا وَلَا يَسْتَطِيعُونَ

    Wa-yaʻbudoona miñ doonil laahi maa laa- yamliku lahum rizq̣am minas samaawaati wal-ʹarḍi shayʹañw walaa yastaṭeeʻoon?

    మరియు వారు అల్లాహ్ ను వదలి ఆకాశాల నుండి గానీ, భూమి నుండి గానీ వారికి ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని మరియు కనీసం (సమకూర్చే) సామర్థ్యం కూడా లేని వారిని ఆరాధిస్తున్నారు.

  175. 16:74

    فَلَا تَضْرِبُوا۟ لِلَّهِ ٱلْأَمْثَالَ ۚ إِنَّ ٱللَّهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ

    Falaa taḍriboo lillaahil ʹams̤aal: ʹinnal laaha yaʻlamu waʹañtum laa- taʻlamoon.

    కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి.[1] నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు.

  176. 16:75

    ۞ ضَرَبَ ٱللَّهُ مَثَلًا عَبْدًا مَّمْلُوكًا لَّا يَقْدِرُ عَلَىٰ شَىْءٍ وَمَن رَّزَقْنَـٰهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُۥنَ ۚ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

    Ḍarabal laahu Mas̤alan ʻabdam mamlookal laa yaq̣diru ʻalaa shayʹiñw wamar razaq̣naahu minnaa rizq̣an ḥasanañ fahuwa yuñfiq̣u minhu sirrañw wajahraa: hal yastawoon? ʹAl-Ḥamdu lillaah. Bal ʹaks̤aruhum laa- yaʻlamoon.

    అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేని వాడు, మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందిన వాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేయగల వాడు. ఏమీ? వీరిద్దరు సమానులవుతారా? సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే! కానీ, చాలా మందికి ఇది తెలియదు.

  177. 16:76

    وَضَرَبَ ٱللَّهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَآ أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَىْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَىٰهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِى هُوَ وَمَن يَأْمُرُ بِٱلْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

    Wa-ḍarabal laahu Mas̤alar rajulayni ʹaḥaduhumaaa ʹabkamu laa- yaq̣diru ʻalaa shayʹiñw wa huwa kallun ʻalaa mawlaahu ʹaynamaa yuwajjihhu laa- yaʹti bikhayr: hal yastawee huwa wa-mañy yaʹmuru bilʻadli wa-huwa ʻalaa Ṣiraaṭim Mustaq̣eem?

    అల్లాహ్ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైనపని చేయలేడు. ఏమీ? ఇటువంటి వాడు మరొకతనితో - ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ, ఋజుమార్గంపై నడుస్తున్నాడో - సమానుడు కాగలడా?[1]

  178. 16:77

    وَلِلَّهِ غَيْبُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَمَآ أَمْرُ ٱلسَّاعَةِ إِلَّا كَلَمْحِ ٱلْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

    Wa-lillaahi g̣aybus samaawaati wal-ʹarḍ. Wa-maaa ʹamrus Saaʻati ʹillaa kalamḥil baṣari ʹaw huwa ʹaq̣rab: ʹinnal laaha ʻalaa kulli shayʹiñ Q̣adeer.

    మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అంతిమ ఘడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.

  179. 16:78

    وَٱللَّهُ أَخْرَجَكُم مِّنۢ بُطُونِ أُمَّهَـٰتِكُمْ لَا تَعْلَمُونَ شَيْـًٔا وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ

    Wallaahu ʹakhrajakum mim buṭooni ʹummahaatikum laa- taʻlamoona shayʹañw wajaʻala lakumus samʻa wal-ʹabṣaara wal-ʹafʹidata laʻallakum tashkuroon.

    మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని.[1]

  180. 16:79

    أَلَمْ يَرَوْا۟ إِلَى ٱلطَّيْرِ مُسَخَّرَٰتٍ فِى جَوِّ ٱلسَّمَآءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا ٱللَّهُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

    ʹAlam yaraw ʹilaṭ ṭayri musakhkharaatiñ fee jawwis samaaaʹ? Maa- yumsikuhunna ʹillal laah. ʹInna fee ẓaalika laʹAayaatil liq̣awmiñy yuʹminoon.

    ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య స్థితిలో (పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? వాటిని అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ (ఆకాశంలో) నిలుపలేరు. నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి సూచనలున్నాయి.

  181. 16:80

    وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۢ بُيُوتِكُمْ سَكَنًا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ ٱلْأَنْعَـٰمِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ۙ وَمِنْ أَصْوَافِهَا وَأَوْبَارِهَا وَأَشْعَارِهَآ أَثَـٰثًا وَمَتَـٰعًا إِلَىٰ حِينٍ

    Wallaahu jaʻala lakum mim buyootikum sakanañw wajaʻala lakum miñ juloodil ʹanʻaami buyootañ tastakhiffoonahaa yawma z̤̣aʻnikum wa-yawma ʻiq̣aamatikum wa-min aṣwaafihaa wa-ʹawbaarihaa wa-ʹashʻaarihaaa ʹas̤aas̤añw Wamataaʻan ʹilaa ḥeen.

    మరియు అల్లాహ్ మీకు, మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు. మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు (గుడారాలు) నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బస చేసినప్పుడు, చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో, బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపలంకరణ సామగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను (మీ కొరకు సృష్టించాడు).

  182. 16:81

    وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَـٰلًا وَجَعَلَ لَكُم مِّنَ ٱلْجِبَالِ أَكْنَـٰنًا وَجَعَلَ لَكُمْ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلْحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ

    Wallaahu jaʻala lakum mimmaa khalaq̣a z̤̣ilaalañw wajaʻala lakum minal jibaali ʹaknaanañw Wajaʻala lakum saraabeela taq̣eekumul ḥarra wa-saraabeela taq̣eekum̃ baʹsakum. Kaẓaalika yutimmu niʻmatahoo ʻalaykum laʻallakum tuslimoon.

    మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పరచాడు. మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు.

  183. 16:82

    فَإِن تَوَلَّوْا۟ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

    Faʹiñ tawallaw faʹinnamaa ʻalaykal Balaag̣ul Mubeen.

    (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే!

  184. 16:83

    يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ

    Yaʻrifoona niʻmatal laahi s̤umma yuñkiroonahaa wa-ʹaksaruhumul kaafiroon.

    వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్యతిరస్కారులే!

  185. 16:84

    وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا۟ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ

    Wa-yawma nabʻas̤u miñ kulli ʹummatiñ Shaheedañ s̤umma laa- yuʹẓanu lillaẓeena kafaroo wa-laa hum yustaʻtaboon.

    మరియు (జ్ఞాపకం ఉంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెడ్తాము. అప్పుడు సత్యతిరస్కారులకు ఏ విధమైన (సాకులు చెప్పటానికి) అనుమతి ఇవ్వబడదు[1] మరియు వారికి పశ్చాత్తాప పడే అవకాశం కూడా ఇవ్వబడదు.

  186. 16:85

    وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ

    Wa-ʹiẓaa ra ʹallaẓeena z̤̣alamul ʻAẓaaba falaa yukhaffafu ʻanhum wa-laa hum yuñz̤̣aroon.

    మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.[1]

  187. 16:86

    وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشْرَكُوا۟ شُرَكَآءَهُمْ قَالُوا۟ رَبَّنَا هَـٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدْعُوا۟ مِن دُونِكَ ۖ فَأَلْقَوْا۟ إِلَيْهِمُ ٱلْقَوْلَ إِنَّكُمْ لَكَـٰذِبُونَ

    Wa-ʹiẓaa ra ʹallaẓeena ʹashrakoo shurakaaaʹahum q̣aaloo Rabbanaa haaaʹulaaaʹi shurakaaaʹunal laẓeena kunnaa nadʻoo miñ doonik. Faʹalq̣aw ʹilayhimul q̣awla ʹinnakum lakaaẓiboon!

    మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు, తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు: "ఓ మా ప్రభూ! వీరే మేము నీకు సాటి కల్పించి, నీకు బదులుగా ఆరాధించిన వారు." కాని (సాటిగా నిలుపబడిన) వారు, సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు: "నిశ్చయంగా, మీరు అసత్యవాదులు."[1]

  188. 16:87

    وَأَلْقَوْا۟ إِلَى ٱللَّهِ يَوْمَئِذٍ ٱلسَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

    Wa-ʹalq̣aw ʹilal laahi yawmaʹiẓinis salama wa-ḍalla ʻanhum maa kaanoo yaftaroon.

    మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి.

  189. 16:88

    ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوا۟ عَن سَبِيلِ ٱللَّهِ زِدْنَـٰهُمْ عَذَابًا فَوْقَ ٱلْعَذَابِ بِمَا كَانُوا۟ يُفْسِدُونَ

    ʹAllaẓeena kafaroo waṣaddoo ʻañ Sabeelil laahi zidnaahum ʻAẓaabañ fawq̣al ʻaẓaabi bimaa kaanoo yufsidoon.

    ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి, మేము వారు చేస్తూ ఉండిన దౌర్జన్యాలకు శిక్ష మీద శిక్ష విధిస్తాము.[1]

  190. 16:89

    وَيَوْمَ نَبْعَثُ فِى كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَـٰٓؤُلَآءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ تِبْيَـٰنًا لِّكُلِّ شَىْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

    Wa-yawma nabʻas̤u fee kulli ʹummatiñ shaheedan ʻalayhim min ʹañfusihim wa-jiʹnaa bika shaheedan ʻalaa haaaʹulaaaʹ. Wa-nazzalnaa ʻalaykal Kitaaba tibyaanal likulli shayʹiñw wa-Hudañw wa-Raḥmatañw wa-Bushraa lil-Muslimeen.

    మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము.[1] ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి.

  191. 16:90

    ۞ إِنَّ ٱللَّهَ يَأْمُرُ بِٱلْعَدْلِ وَٱلْإِحْسَـٰنِ وَإِيتَآئِ ذِى ٱلْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ وَٱلْبَغْىِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

    ʹInnal laaha yaʹmuru bil-ʻadli wal-ʹiḥsaani wa-ʹeetaaaʹi ẓil q̣urbaa wa-yanhaa ʻanil faḥshaaaʹi wal-muñkari walbag̣yi: yaʻi-Z̤̣ukum laʻallakum taẓakkaroon.

    నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు.[1] ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.

  192. 16:91

    وَأَوْفُوا۟ بِعَهْدِ ٱللَّهِ إِذَا عَـٰهَدتُّمْ وَلَا تَنقُضُوا۟ ٱلْأَيْمَـٰنَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ ٱللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ ٱللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ

    Wa-ʹawfoo biʻAhdil laahi ʹiẓaa ʻaahattum wa-laa tañq̣uḍul ʹaymaana baʻda tawkeedihaa wa-q̣ad jaʻaltumul laaha ʻalaykum kafeelaa: ʹinnal laaha yaʻlamu maa- tafʻaloon.

    మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి.[1] (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్ ను మీకు జామీనుదారుగా[2] చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

  193. 16:92

    وَلَا تَكُونُوا۟ كَٱلَّتِى نَقَضَتْ غَزْلَهَا مِنۢ بَعْدِ قُوَّةٍ أَنكَـٰثًا تَتَّخِذُونَ أَيْمَـٰنَكُمْ دَخَلًۢا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِىَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ ٱللَّهُ بِهِۦ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ

    Wa-laa takoonoo kallatee naq̣aḍat g̣azlahaa mim baʻdi q̣uwwatin ʹañkaas̤aa. Tattakhiẓoona ʹaymaanakum dakhalam baynakum ʹañ takoona ʹummatun hiya ʹarbaa min ʹummah; ʹinnamaa yablookumul laahu bih; wa-la-yubayyinanna lakum Yawmal Q̣iyaamati maa- kuñtum feehi takhtalifoon.

    మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు.

  194. 16:93

    وَلَوْ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَٰحِدَةً وَلَـٰكِن يُضِلُّ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَلَتُسْـَٔلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ

    Wa-law shaaaʹal laahu lajaʻalakum ʹummatañw waaḥidatañw walaakiñy yuḍillu mañy yashaaaʹu wa-yahdee mañy yashaaaʹ: wa-latusʹalunna ʻammaa kuñtum taʻmaloon.

    ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు.[1] మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు.

  195. 16:94

    وَلَا تَتَّخِذُوٓا۟ أَيْمَـٰنَكُمْ دَخَلًۢا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌۢ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا۟ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ ٱللَّهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ

    Wa-laa tattakhiẓooo ʹaymaanakum dakhalam baynakum fatazilla q̣adamum baʻda s̤ubootihaa wa-taẓooq̣us soooʹa bimaa ṣadattum ʻañ Sabeelil laahi walakum ʻaẓaabun ʻaz̤̣eem.

    మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాప ఫలితాన్ని రుచి చూడగలరు.[1] మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు.

  196. 16:95

    وَلَا تَشْتَرُوا۟ بِعَهْدِ ٱللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ ٱللَّهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

    Wa-laa tashtaroo biʻAhdil laahi s̤amanañ q̣aleelaa: ʹinnamaa ʻiñdal laahi huwa khayrul lakum ʹiñ kuñtum taʻlamoon.

    మరియు మీరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని స్పల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే, నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది.

  197. 16:96

    مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ ٱللَّهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ ٱلَّذِينَ صَبَرُوٓا۟ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ

    Maa- ʻiñdakum yañfadu wa-maa ʻiñdal laahi baaq̣. Wa-lanajziyannal laẓeena ṣabarooo ʹajrahum̃ biʹaḥsani maa- kaanoo yaʻmaloon.

    మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

  198. 16:97

    مَنْ عَمِلَ صَـٰلِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُۥ حَيَوٰةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ

    Man ʻamila ṣaaliḥam miñ ẓakarin ʹaw ʹuñs̤aa wa-huwa Muʹminuñ falanuḥyiyannahoo Ḥayaatañ Ṭayyibah, wa-lanajzi-yannahum ʹajrahum̃ biʹaḥsani maa- kaanoo yaʻmaloon.

    ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము.[1] మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

  199. 16:98

    فَإِذَا قَرَأْتَ ٱلْقُرْءَانَ فَٱسْتَعِذْ بِٱللَّهِ مِنَ ٱلشَّيْطَـٰنِ ٱلرَّجِيمِ

    Faʹiẓaa q̣araʹtal Q̣urʹaana fastaʻiẓ billaahi minash Shayṭaanir Rajeem.

    కావున నీవు ఖుర్ఆన్ పఠించబోయేటప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్ శరణు వేడుకో![1]

  200. 16:99

    إِنَّهُۥ لَيْسَ لَهُۥ سُلْطَـٰنٌ عَلَى ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

    ʹInnahoo laysa lahoo sulṭaanun ʻalal laẓeena ʹaamanoo wa-ʻalaa Rabbihim yatawakkaloon.

    విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా, వాడికి ఎలాంటి అధికారం ఉండదు.

  201. 16:100

    إِنَّمَا سُلْطَـٰنُهُۥ عَلَى ٱلَّذِينَ يَتَوَلَّوْنَهُۥ وَٱلَّذِينَ هُم بِهِۦ مُشْرِكُونَ

    ʹInnamaa sulṭaanuhoo ʻalal laẓeena yatawallawnahoo wallaẓeena hum̃ bihee mushrikoon.

    కాని! నిశ్చయంగా, వాడి (షైతాన్) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహం చేసుకునే) వారిపై[1] మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారిపై, వాడికి అధికారం ఉంటుంది.

  202. 16:101

    وَإِذَا بَدَّلْنَآ ءَايَةً مَّكَانَ ءَايَةٍ ۙ وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مُفْتَرٍۭ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

    Wa-ʹiẓaa baddalnaaa ʹaayatam makaana ʹaayatiñw wal-laahu ʹAʻlamu bimaa yunazzilu q̣aalooo ʹinnamaaa ʹañta muftar: bal ʹaks̤aruhum laa- yaʻlamoon.

    మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు;[1] తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్ కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్యతిరస్కారులు) ఇలా అంటారు: "నిశ్చయంగా నీవే (ఓ ముహమ్మద్!) దీనిని కల్పించేవాడవు." అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు.

  203. 16:102

    قُلْ نَزَّلَهُۥ رُوحُ ٱلْقُدُسِ مِن رَّبِّكَ بِٱلْحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

    Q̣ul nazzalahoo Rooḥul Q̣udusi mir Rabbika bil-Ḥaq̣q̣i liyus̤abbital laẓeena ʹaamanoo Bushraa wa-Hudañwwa lil-Muslimeen.

    వారితో అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్ కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్)[1] క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వచ్చాడు."

  204. 16:103

    وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٌ ۗ لِّسَانُ ٱلَّذِى يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِىٌّ وَهَـٰذَا لِسَانٌ عَرَبِىٌّ مُّبِينٌ

    Wa-laq̣ad naʻlamu ʹannahum yaq̣ooloona ʹinnamaa yuʻallimuhoo bashar. Lisaanul laẓee yulḥidoona ʹilayhi ʹaʻjamiyyuñw Wahaaẓaa lisaanun ʻArabiyyum mubeen.

    మరియు: "నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు."[1] అని, వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే (అపార్థం చేసే) వ్యక్తి భాష పరాయి భాష. కాని ఈ (ఖుర్ఆన్) భాష స్వచ్ఛమైన అరబ్బీ భాష.[2]

  205. 16:104

    إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ لَا يَهْدِيهِمُ ٱللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

    ʹInnal lazeena laa- yuʹminoona biʹaayaatil lahi laa- yahdeehimul laahu wa-lahum ʻaẓaabun ʹaleem.

    నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ సందేశాలను (ఆయాత్ లను) విశ్వసించరో! వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

  206. 16:105

    إِنَّمَا يَفْتَرِى ٱلْكَذِبَ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَـٰذِبُونَ

    ʹInnamaa yaftaril kaẓibal laẓeena laa- yuʹminoona biʹaayaatil laahi wa-ʹulaaaʹika humul kaaẓiboon.

    నిశ్చయంగా, అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) విశ్వసించని వారు, అబద్ధాలను కల్పిస్తున్నారు. మరియు అలాంటివారు! వారే, అసత్యవాదులు.

  207. 16:106

    مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعْدِ إِيمَـٰنِهِۦٓ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُۥ مُطْمَئِنٌّۢ بِٱلْإِيمَـٰنِ وَلَـٰكِن مَّن شَرَحَ بِٱلْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ ٱللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ

    Mañ kafara billaahi mim baʻdi ʹeemaaniheee ʹillaa man ʹukriha wa-q̣albuhoo muṭmaʹinnum bil-ʹEemaani wa-laakim mañ sharaḥa bilkufri ṣadrañ faʻalayhim g̣aḍabum minal laahi wa-lahum ʻaẓaabun ʻaz̤̣eem.

    ఎవడైతే విశ్వసించిన తరువాత, అల్లాహ్ ను తిరస్కరిస్తాడో - తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి, బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప![1] - మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్యతిరస్కారానికి పాల్పడతారో, అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహం (దూషణ) విరుచుకు పడుతుంది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది.

  208. 16:107

    ذَٰلِكَ بِأَنَّهُمُ ٱسْتَحَبُّوا۟ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا عَلَى ٱلْـَٔاخِرَةِ وَأَنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَـٰفِرِينَ

    Ẓaalika biʹannahumus taḥabbul ḥayaatad dunyaa ʻalal ʹAakhirati waʹannal laaha laa- yahdil Q̣awmal kaafireen.

    ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.

  209. 16:108

    أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَـٰرِهِمْ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْغَـٰفِلُونَ

    ʹUlaaaʹikal laẓeena ṭabaʻal laahu ʻalaa q̣uloobihim wa-samʻihim wa-ʹabṣaarihim wa-ʹulaaaʹika humul G̣aafiloon.

    ఇలాంటి వారి హృదయాల మీదా. చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్ ముద్రవేసి ఉన్నాడు.[1] మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు!

  210. 16:109

    لَا جَرَمَ أَنَّهُمْ فِى ٱلْـَٔاخِرَةِ هُمُ ٱلْخَـٰسِرُونَ

    Laa- jarama ʹannahum fil ʹaakhirati humul khaasiroon.

    నిశ్చయంగా, పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే, అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.

  211. 16:110

    ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا۟ مِنۢ بَعْدِ مَا فُتِنُوا۟ ثُمَّ جَـٰهَدُوا۟ وَصَبَرُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ

    S̤umma ʹinna Rabbaka lillaẓeena haajaroo mim baʻdi maa- futinoo s̤umma jaahadoo waṣabarooo ʹinna Rabbaka mim baʻdihaa G̣afoorur Raḥeem.

    ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో![1] దాని తరువాత నిశ్చయంగా, అలాంటి వారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

  212. 16:111

    ۞ يَوْمَ تَأْتِى كُلُّ نَفْسٍ تُجَـٰدِلُ عَن نَّفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

    Yawma taʹtee kullu nafsiñ tujaadilu ʻan nafsihaa wa-tuwaffaa kullu nafsim maa ʻamilat Wahum laa- yuz̤̣lamoon.

    ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో![1] ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.[2]

  213. 16:112

    وَضَرَبَ ٱللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ ءَامِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ ٱللَّهِ فَأَذَٰقَهَا ٱللَّهُ لِبَاسَ ٱلْجُوعِ وَٱلْخَوْفِ بِمَا كَانُوا۟ يَصْنَعُونَ

    Wa-ḍarabal laahu Mas̤alañ q̣aryatañ kaanat ʹaaminatam muṭmaʹinnatañy yaʹteehaa rizq̣uhaa rag̣adam miñ kulli makaaniñ fakafarat biʹanʻumil laahi faʹaẓaaq̣ahal laahu libaasal jooʻi walkhawfi bimaa kaanoo yaṣnaʻoon.

    మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతి దిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్నులయ్యారు), కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు.

  214. 16:113

    وَلَقَدْ جَآءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ ٱلْعَذَابُ وَهُمْ ظَـٰلِمُونَ

    Wa-laq̣ad jaaaʹahum Rasoolum minhum fakaẓẓaboohu faʹakhaẓahumul ʻaẓaabu wa-hum z̤̣aalimoon.

    మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్కరించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది.

  215. 16:114

    فَكُلُوا۟ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَـٰلًا طَيِّبًا وَٱشْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

    Fakuloo mimmaa razaq̣akumul laahu Ḥalaalañ Ṭayyibaa; washkuroo niʻmatal laahi ʹiñ kuñtum ʹiyyaahu taʻbudoon.

    కావున మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి.

  216. 16:115

    إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ ٱلْمَيْتَةَ وَٱلدَّمَ وَلَحْمَ ٱلْخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيْرِ ٱللَّهِ بِهِۦ ۖ فَمَنِ ٱضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

    ʹInnamaa ḥarrama ʻalaykumul maytata waddama wa-laḥmal khiñzeeri wa-maaa ʹuhilla lig̣ayril laahi bih. Famaniḍ ṭurra g̣ayra baag̣iñw walaa ʻaadiñ faʹinnal laaha G̣afoorur Raḥeem.

    నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జిబహ్ చేయబడినది (పశువు/పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.[1]

  217. 16:116

    وَلَا تَقُولُوا۟ لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ ٱلْكَذِبَ هَـٰذَا حَلَـٰلٌ وَهَـٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا۟ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ ۚ إِنَّ ٱلَّذِينَ يَفْتَرُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ لَا يُفْلِحُونَ

    wa-laa taq̣ooloo limaa taṣifu ʹalsinatukumul kaẓiba haaẓaa ḥalaaluñw wahaaẓaa ḥaraamul litaftaroo ʻalal laahil kaẓib. ʹInnal laẓeena yaftaroona ʻalal laahil kaẓiba laa- yufliḥoon.

    అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.

  218. 16:117

    مَتَـٰعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

    Mataaʻuñ q̣aleel; wa-lahum ʻaẓaabun ʹaleem.

    దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

  219. 16:118

    وَعَلَى ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَـٰهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

    Wa-ʻalal laẓeena haadoo ḥarramnaa maa- q̣aṣaṣnaa ʻalayka miñ q̣abl: wa-maa z̤̣alamnaahum wa-laakiñ kaanooo ʹañfusahum yaz̤̣limoon.

    మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు.[1]

  220. 16:119

    ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا۟ ٱلسُّوٓءَ بِجَهَـٰلَةٍ ثُمَّ تَابُوا۟ مِنۢ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ

    S̤umma ʹinna Rabbaka lillaẓeena ʻamilus soooʹa bijahaalatiñ s̤umma taaboo mim baʻdi ẓaalika wa-ʹaṣlaḥooo ʹinna Rabbaka mim baʻdihaa la-G̣afoorur Raḥeem.

    అయితే నిశ్చయంగా, నీ ప్రభువు - ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి, ఆ పిదప పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటారో - దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత.

  221. 16:120

    إِنَّ إِبْرَٰهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ ٱلْمُشْرِكِينَ

    ʹInna ʹIbraaheema kaana ʹummatañ q̣aanital lillaahi ḥaneefaa: wa-lam yaku minal mushrikeen:

    నిశ్చయంగా, ఇబ్రాహీమ్ (ఒక్కడే) అల్లాహ్ కు భక్తిపరుడై, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకు తానే ఒక సమాజమై ఉండెను.[1] అతను అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు.

  222. 16:121

    شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ ٱجْتَبَىٰهُ وَهَدَىٰهُ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

    Shaakiral liʹanʻumih: ʹijtabaahu wa-hadaahu ʹilaa Ṣiraatim Mustaq̣eem.

    ఆయన (అల్లాహ్) యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన (అల్లాహ్) అతనిని (తన స్నేహితునిగా) ఎన్నుకొని, అతనికి ఋజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు.

  223. 16:122

    وَءَاتَيْنَـٰهُ فِى ٱلدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ

    Wa-ʹaataynaahu fid dunyaa Ḥasanah: wa-ʹinnahoo fil ʹAakhirati laminaṣ Ṣaaliḥeen.

    మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు

  224. 16:123

    ثُمَّ أَوْحَيْنَآ إِلَيْكَ أَنِ ٱتَّبِعْ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ

    S̤umma awḥaynaaa ʹilayka ʹanit tabiʻ Millata ʹIbraaheema Ḥaneefaa, wa-maa kaana minal mushrikeen.

    తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్) అల్లాహ్ కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు."

  225. 16:124

    إِنَّمَا جُعِلَ ٱلسَّبْتُ عَلَى ٱلَّذِينَ ٱخْتَلَفُوا۟ فِيهِ ۚ وَإِنَّ رَبَّكَ لَيَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فِيمَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ

    Innamaa juʻilas Sabtu ʻalal laẓeenakh talafoo feeh: wa-ʹinna Rabbaka layaḥkumu baynahum Yawmal Q̣iyaamati feemaa kaanoo feehi yakhtalifoon.

    వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు! పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు.

  226. 16:125

    ٱدْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِٱلْحِكْمَةِ وَٱلْمَوْعِظَةِ ٱلْحَسَنَةِ ۖ وَجَـٰدِلْهُم بِٱلَّتِى هِىَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ ۖ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ

    ʹUdʻu ʹilaa sabeeli Rabbika bilḥikmati walmawʻiz̤̣atil ḥasanati wa-jaadilhum̃ billatee hiya ʹaḥsan: ʹInna Rabbaka Huwa ʹAʻlamu bimañ ḍalla ʻañ Sabeelihee wa-Huwa ʹaʻlamu bil-Muhtadeen.

    (ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు.[1] నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు.

  227. 16:126

    وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا۟ بِمِثْلِ مَا عُوقِبْتُم بِهِۦ ۖ وَلَئِن صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِّلصَّـٰبِرِينَ

    Wa-ʹin ʻaaq̣abtum faʻaaq̣iboo bimis̤li maa- ʻooq̣ibtum̃ bih: wa-laʹiñ ṣabartum lahuwa khayrul liṣ-Ṣaabireen.

    మరియు మీరు (మీ ప్రత్యర్థులను) శిక్షించదలచుకుంటే, మీకు జరిగిన దానికి (అన్యాయానికి) సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వండి. కాని మీరు సహనం వహిస్తే నిశ్చయంగా, సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది.

  228. 16:127

    وَٱصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِٱللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِى ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ

    Waṣbir wa-maa ṣabruka ʹillaa billaahi wa-laa taḥzan ʻalayhim wa-laa taku fee ḍayq̣im mimmaa yamkuroon.

    (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకుల పడకు.

  229. 16:128

    إِنَّ ٱللَّهَ مَعَ ٱلَّذِينَ ٱتَّقَوا۟ وَّٱلَّذِينَ هُم مُّحْسِنُونَ

    ʹInnal laaha maʻal laẓeenat taq̣aw wal-laẓeena hum Muḥsinoon.

    నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు.