Home  /  Quran  /  Surah
Loading...
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

Surah Al-Alaq

Surah Al-Alaq (The Clot) is Surah 96 of the Holy Quran, a Meccan Surah with 19 verses, available here in Telugu.

Surah 96 Meccan 19 verses Telugu

Verse 96:1

اِقْرَاْ بِاسْمِ رَبِّكَ الَّذِیْ خَلَقَ ۟ۚ

ʹIq̣raʹ bismi Rab-bikal laẓee khalaq̣,

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు![1]

Verse 96:2

خَلَقَ الْاِنْسَانَ مِنْ عَلَقٍ ۟ۚ

Khalaq̣al ʹiñsaana min ʻalaq̣.

ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.[1]

Verse 96:3

اِقْرَاْ وَرَبُّكَ الْاَكْرَمُ ۟ۙ

ʹIq̣raʹ wa-Rabbukal ʹAkram,―

చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

Verse 96:4

الَّذِیْ عَلَّمَ بِالْقَلَمِ ۟ۙ

ʹAllaẓee ʻallama bil-Q̣alam,―

ఆయన కలం ద్వారా నేర్పాడు.[1]

Verse 96:5

عَلَّمَ الْاِنْسَانَ مَا لَمْ یَعْلَمْ ۟ؕ

ʻAl-lamal ʹiñsaana maa- lam yaʻlam.

మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.

Verse 96:6

كَلَّاۤ اِنَّ الْاِنْسَانَ لَیَطْغٰۤی ۟ۙ

Kallaaa ʹinnal ʹiñsaana layaṭg̣aa,

అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.

Verse 96:7

اَنْ رَّاٰهُ اسْتَغْنٰی ۟ؕ

ʹArra ʹaahus tag̣naa.

ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.

Verse 96:8

اِنَّ اِلٰی رَبِّكَ الرُّجْعٰی ۟ؕ

ʹInna ʹilaa Rabbikar rujʻaa.

నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.

Verse 96:9

اَرَءَیْتَ الَّذِیْ یَنْهٰی ۟ۙ

ʹA-raʹaytal laẓee yanhaa

నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?[1]

Verse 96:10

عَبْدًا اِذَا صَلّٰی ۟ؕ

ʻAbdan ʹiẓaa ṣallaa?

నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?[1]

Verse 96:11

اَرَءَیْتَ اِنْ كَانَ عَلَی الْهُدٰۤی ۟ۙ

ʹA-raʹayta ʹiñ kaana ʻalal Hudaa?

ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?

Verse 96:12

اَوْ اَمَرَ بِالتَّقْوٰی ۟ؕ

ʹAw ʹamara bit-Taq̣waa?

ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?[1]

Verse 96:13

اَرَءَیْتَ اِنْ كَذَّبَ وَتَوَلّٰی ۟ؕ

ʹA-raʹayta ʹiñ kaẓ-ẓaba wa-tawallaa?

ఒకవేళ (ఆ నిరోధించే)[1] వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?

Verse 96:14

اَلَمْ یَعْلَمْ بِاَنَّ اللّٰهَ یَرٰی ۟ؕ

ʹAlam yaʻlam̃ biʹannal laaha yaraa?

వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?

Verse 96:15

كَلَّا لَىِٕنْ لَّمْ یَنْتَهِ ۙ۬ لَنَسْفَعًا بِالنَّاصِیَةِ ۟ۙ

Kallaa laʹil lam yañtahi lanasfaʻam bin-naaṣiyah,―

అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.[1]

Verse 96:16

نَاصِیَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ ۟ۚ

Naaṣiyatiñ kaaẓibatin khaaṭiʹah!

అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!

Verse 96:17

فَلْیَدْعُ نَادِیَهٗ ۟ۙ

Fal-yadʻu naadiyah:

అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!

Verse 96:18

سَنَدْعُ الزَّبَانِیَةَ ۟ۙ

Sanadʻuz zabaaniyah!

మేము కూడా నరక దూతలను పిలుస్తాము!

Verse 96:19

كَلَّا ؕ لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِبْ ۟

Kallaa: laa- tuṭiʻhu wasjud waq̣tarib!

అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!